Tiger Tension: బాబోయ్ బెంగాల్ టైగర్ (Bengal Tiger) అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పులుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొదట కేవలం పశువులపైనే దాడి చేసినా.. ప్రజలపై దాడి చేయలేదు. కానీ ఇటీవల ఆ పులి మనుషులను కూడా వదలడం లేదు (Tiger Attacked on people).. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పులి జాడ తెలిసినా ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే విమర్మలు ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టినా చిక్కడం లేదు. మరి కొన్ని చోట్లా అధికారులు అందుబాటులో లేక రైతులు, స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రను ముప్పుతిప్పలు పెట్టిన పులికోసం వేట కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా (East Godavari Distirct) నుంచి విశాఖ జిల్లా (Visakha District )లో రెండు నెలలుగా మకాం వేసిన పులికోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నాలుగున్నరేళ్ల వయసున్న బెంగాల్ టైగర్‌ను ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ప్రస్తుతం అనకాపల్లి (Anakapalli) లో సంచరిస్తున్న ఈ బెంగాల్ టైగర్ స్టోరీ.. తెలుగు డైలీ సీరియల్ లా మారింది. ఎందుకంటే ప్రోమోలో వేస్తున్నట్టు.. ఆ టైగర్ పోలీసులకు చిక్కినట్టే విజువల్స్ లో కనిపిస్తోంది.. జస్ట్ మిస్ అవుతోంది. చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అవుతోంది. ఇలా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యేక ఆపరేషన్ మొదలెట్టినా.. పులిని పట్టుకోలేకపోతున్నారు.
తాజాగా బెంగాల్ టైగర్ రూటు మార్చింది అంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిపిరి వలస వైపు టైగర్ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అక్కడ పులి పాదముద్రలు కనిపించాయి. పదిరోజుల కిందట చిపిరి వలస వెళ్లి అక్కడి నుంచి తిరిగి చంద్రయ్యపేటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరిగి చిపిరివలస వెళ్లడంతో ఈ రెండు రోజుల్లో తిరిగి చంద్రయ్యపేటకు వస్తుందనేది అటవీశాఖ అధికారుల అంచనా.
ఇదీ చదవండి : మంత్రి రోజాకు మొదలైన తలనొప్పి.. అధినేత దగ్గరకు ఎలా వెళ్లాలని టెన్షన్
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. తెలంగాణలోని నల్గొండ, మంచిర్యాలలో కూడా పులుల సంచారం జనంలో భయం పుట్టిస్తోంది. గుట్టల్లో సంచరిస్తున్న పులులు.. పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో పదుల సంఖ్యలో పశువులను, గొర్రెలను చంపేశాయి. అధికారులకు సమాచారం అందించినా వీటిని బంధించేందుకు చర్యలు చేపట్టడంలో కొంత ఆలస్యం జరుగుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పులిసంచారం స్థానికులను భయపెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Tiger Attack, Visakhapatnam