Visakhapatnam: పాప ఎంత అల్లారుముద్దుగా ఉందో కదా.. అదే నిజమైతే ఇలా చేయడానికి ఈ తల్లికి చేతులెలా వచ్చాయో..

సింధుశ్రీతో వరలక్ష్మి (ఫైల్ ఫొటో)

బొద్దాన రమేష్, బొద్దాన వరలక్ష్మి(25)లకు పెళ్లి అయి 5 సంవత్సరాలు అయింది. వీరిద్దరికీ పాప పుట్టింది. ఆ పాపకు సింధుశ్రీ అని పేరు పెట్టుకుని కొన్నిరోజులు అల్లారుముద్దుగా చూసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి సింధుశ్రీ మూడు సంవత్సరాలు. అయితే.. వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె భర్త చెబుతున్నాడు.

  • Share this:
    విశాఖపట్నం: తన ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతోనే కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిందా అనే ఆలోచన కలిగేలా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురి చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని తన మూడేళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన ఘటన విశాఖ జిల్లాలో కలకలం రేపింది. చిన్నారి మృతదేహానికి రాత్రికి రాత్రి దహన కార్యక్రమాలు జరిపి మరుసటి రోజున చిన్నారి తండ్రికి తెలియజేయడంతో విషయం బయటకు వచ్చింది. తన భార్య, ఆమె ప్రియుడే తన కూతురిని చంపేసి ఉంటారన్న అనుమానంతో పాప తండ్రి బొద్దాన రమేష్(27) పోలీసులను ఆశ్రయించాడు. బొద్దాన రమేష్, బొద్దాన వరలక్ష్మి(25)లకు పెళ్లి అయి 5 సంవత్సరాలు అయింది. వీరిద్దరికీ పాప పుట్టింది. ఆ పాపకు సింధుశ్రీ అని పేరు పెట్టుకుని కొన్నిరోజులు అల్లారుముద్దుగా చూసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి సింధుశ్రీ మూడు సంవత్సరాలు. అయితే.. వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె భర్త చెబుతున్నాడు. తన భార్య వరలక్ష్మి మీద, బోర జగదీష్ రెడ్డి మీద తనకు అనుమానం ఉందని.. మూడు నెలలు ఉన్నప్పుడు తన దగ్గర నుంచి కూతురు సింధుశ్రీని తీసుకువెళ్లిపోయిందని బొద్దాన రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తన కూతురిని చంపేసి పూడ్చిన తర్వాత తన భార్య ఫోన్ చేసి చెప్పిందని రోదిస్తూ తన కూతురికి న్యాయం చేయాలని మీడియాని, పోలీసులను కోరాడు.

    రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పీఎం పాలెం సిఐ రవికుమార్‌ను వివరణ కోరగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రమేష్ (27) బోరవాని పాలెం వాసి అని, 2014లో మారికవలసకు చెందిన పీతల వరలక్ష్మి(25) అనే యువతితో వివాహం అయిందని పోలీసులు తెలిపారు. వీరికి సింధుశ్రీ అనే ఒక పాప పుట్టిందని, ఇప్పుడు పాప వయసు సుమారు 3 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం రమేష్, వరలక్ష్మి మధ్య గొడవలు జరిగాయని, బోరవానిపాలెంకు చెందిన బోర జగదీష్ రెడ్డితో వరలక్ష్మికి అక్రమ సంబంధం ఉందన్న కారణంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారని చెప్పారు. సింధుశ్రీని తీసుకెళ్లిపోయిన వరలక్ష్మి మే 14 నుంచి బోర జగదీష్ రెడ్డితో మారికవలసలో వేరే కాపురం పెట్టినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. జూన్ 1న రాత్రి సుమారు 8 గంటలు సమయంలో వాత్సల్య హాస్పిటల్‌కి సింధుశ్రీకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి వరలక్ష్మి తీసుకెళ్లిందని.. అప్పటికే సింధుశ్రీ చనిపోయిందని డాక్టర్స్ చెప్పారని, మారికవలసలో ఉన్న స్మశాన వాటికలో జగదీశ్ రెడ్డితో కలిసి వరలక్ష్మి పాపను రాత్రికి రాత్రి 11 గంటల సమయంలో పూడ్చి పెట్టడం జరిగిందని పోలీసులు తెలిపారు. పూడ్చి పెట్టిన మరుసటి రోజున భర్త బొద్దాన రమేష్‌కు సింధుశ్రీ మృతి చెందిన విషయాన్ని చెప్పడంతో విషయం అందరికీ తెలిసింది. అయితే రమేష్ తన భార్య వరలక్ష్మి, బోర జగదీష్ రెడ్డితో కలిసి సింధుశ్రీని చంపేసి ఉండొచ్చన్న అనుమానంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ సమక్షంలో సింధుశ్రీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

    తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని మూడేళ్ల చిన్నారిని హతమార్చిన ఆ కసాయి తల్లి వరలక్ష్మిని దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం మారికవలస గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభంశుభం తెలియని మూడేళ్ల బిడ్డను చంపేసిందన్న ఆగ్రహంతో నిందితురాలు వరలక్ష్మిపై దాడి చేసి కొట్టేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో స్థానికులకు, పోలీసులకు తోపులాట జరిగింది. పోలీస్ జీపు ధ్వంసం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. పోలీసులు వరలక్ష్మిని అక్కడి నుంచి తరలించారు. మూడేళ్ల చిన్నారి సింధుశ్రీ హత్యకేసును త్వరగా విచారించి నిందితురాలు, కసాయి తల్లి వరలక్ష్మిని, తన ప్రియుడు బోర జగదీష్ రెడ్డిలకు కఠిన శిక్ష పడేలా చూడాలని గ్రామస్తులు, చిన్నారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: