విశాఖపట్నంvisakhapatnam లో ఉగాది రోజున విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్ (3Storey Building)కుప్పకూలిపోవడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. ఈసంఘటన బుధవారం రాత్రి సిటీలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న రామజోగిపేట(Ramajogipet)లో చోటుచేసుకుంది. మృతి చెందిన ముగ్గురులో ఇద్దరు చిన్నపిల్లలు కాగా.మరొకరు బీహార్(Bihar)కి చెందిన యువకుడిగా గుర్తించారు. గాయపడిన మరో ఐదుగుర్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం కూలిన బిల్డింగ్ కింద రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. మృతి చెందిన ముగ్గురిలో ఓ బాలిక ఉంది. ఆమె పుట్టిన రోజు బుధవారం కావడంతో బర్త్ డే వేడుకలు జరుపుకున్న గంట వ్యవధి తర్వాత ఈదుర్ఘటన జరగడంతో స్ధానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
చితికిన బతుకులు..
సాగరతీరమైన విశాఖపట్నంలో ఉగాది పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. రామజోగిపేటలోని బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 8మందికి గాయపడ్డారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల ద్వారా సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ, ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకున్నారు, బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈప్రమాదంలో అప్పటికే సాకేటి అంజలి అనే 14ఏళ్ల బాలిక, ఆమె సోదరుడు 17సంవత్సరాల దుర్గాప్రసాద్‌తో పాటు బిహార్‌కి చెందిన మరో యువకుడు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ఈదుర్ఘటన మృతుల్లో ఒకరైన బాలిక అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న గంటలోనే ప్రమాదం జరగడం, సోదరుడితో కలిసి ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది.
ప్రమాదానికి గల కారణాలపై ఆరా..
ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో ప్రాణనష్టం జరిగి ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్ బీహార్‌కి చెందిన యువకుడు చోటు మృతదేహాన్ని ఉదయం వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరికి తీవ్రగాయాలైనట్లుగా డాక్టర్లు తెలిపారు. విశాఖపట్టణంలో పండుగ పూట ఇంతటి ప్రమాదం జరగడం..ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.