Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS ZOOLOGY LAB HAS HUNDRED YEARS OF SKULLS AND OTHER ORGANS IN AVN COLLEGE VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: 150ఏళ్ల నాటి అస్థిపంజరం.. దశాబ్దాల నాటి జంతువులు.. ఈ ల్యాబ్ చూస్తే ఆశ్చర్యపోతారు..

విశాఖ

విశాఖ ఏవీ కాలేజీలోని జువాలజీ ల్యాబ్

Visakhapatnam: మారుతున్న జనరేషన్‌.. నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత అవసరం. మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్నిటా ప్రయోగాలే. మరోవైపు జంతువులు, జలచరాల మీద కూడా ప్రయోగాలే.

  Neelima Eaty, News18 Visakhapatnam

  మారుతున్న జనరేషన్‌.. నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత అవసరం. మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్నిటా ప్రయోగాలే. మరోవైపు జంతువులు, జలచరాల మీద కూడా ప్రయోగాలే. తల్లి గర్భంలో ఉన్న శిశువు.. వందల ఏళ్ల నాటి జంతు కలేబరాలు.. వివిధ రకాల జలచరాలు. వందళ ఏళ్ల నాటి మానవ అస్థిపంజరం...ఎన్నో రకాల పాములు..ఇలా మానవ.. జంతు పుట్టుకలతో కూడిన ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) లోని ఏవీఎన్‌ కాలేజీలో ఉంది. ఏవీఎన్ కళాశాలలోని జువాలజీ (Zoology) డిపార్ట్‌ మెంట్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. విశాఖపట్నంలో ఇదే తొలి జువాలజీ ల్యాబ్‌ అని కూడా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బిల్డింగ్‌లో ఈ జంతుశాస్త్ర మ్యూజియం బ్లాక్ ఉంది. ఈ జువాలజీ మ్యూజియం లోపల గోడలు చాలా పురాతనమైనది. ఈ కళాశాల మ్యూజియాన్ని సందర్శించిన తర్వాత మీకు కలిగే అనుభూతి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది.

  స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటు చేసిన ల్యాబ్‌
  ఏవీఎన్‌ కళాశాలలో స్వాతంత్య్రం రాకముందే ఈ జువాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో పాటు మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో విశాఖలో మరెక్కడా దొరకని.. లభించని అనేక వస్తువులు పొందుపరిచారు. ఈ మ్యూజియంలో వేలాది స్పెసిమెన్స్, 100కు పైగా ఓస్టీయాలజీ స్పెసిమెన్స్, 75 రకాల మోడల్‌ స్పెసిమెన్స్‌తో పాటు 878 బాటిల్‌ స్పెసిమెన్స్, 700 పర్మినెంట్‌ స్లైడర్స్‌ ను భద్రపరిచారు. ఈ రకమైన జంతువుల సేకరణ విశాఖపట్నంలో మరే ఇతర కళాశాలలో లేదు. ఇక్కడ ఈ జంతుశాస్త్ర మ్యూజియంలో అందుబాటులో ఉన్నవన్నీ నిజమైనవే.

  ఇది చదవండి: అన్నిదేశాల చేపలు ఒకే చోట.. ఔరా అనిపిస్తున్న విశాఖ వాసి


  మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో ప్రయోగాత్మక మార్పులు వస్తున్నాయి. స్కూళ్లు.. కాలేజీల్లో ప్రాక్టికల్‌గా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరహా టీచింగ్‌ సైన్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఒకప్పుడు ల్యాబరేటరీలు కానీ..మ్యూజియంల ఊసు అస్సలు ఉండదు. ఇప్పటికీ చాలా చోట్ల ల్యాబ్‌లు అందుబాటులో లేవు. అయితే ఈ ఏవీన్‌ కాలేజీలో ఉన్న మ్యూజియం చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.

  ఇది చదవండి: మీకు సముద్రపు చేపలంటే ఇష్టమా..? ఇక్కడ చూడండి ఎన్నిరకాల చేపలో.. చూస్తే వదిలిపెట్టరు..!


  వందేళ్ల నాటి మానవ అస్థిపంజరం నుంచి ఎన్నో రకాల పాములు..!
  మానవ అస్థిపంజరం, డైనోసార్ అస్థిపంజరం, ఏనుగు అస్థిపంజరం, పిండం అభివృద్ధి (6,7,8 నెలల మానవ పిండాలు), మానవుని గుండె (Human Heart), హ్యూమన్‌ బ్రెయిన్ (Human brain), రెండు తలల బాతుపిల్ల (Double head duck) , ఫైవ్‌ లెగ్‌డ్‌ ఫ్రాగ్ (Five leg frog), తొండం గల పంది పిండం..ఇలా ఎన్నెన్నో మానవుని..జంతువుల అవయవాలు సేకరించారు. అన్ని రకాల పక్షుల ముక్కులను సేకరించి ఇక్కడ భద్రంగా భద్రపరిచారు. గర్భాశయ క్యాన్సర్ గురించి విద్యార్థులు మరింత వివరంగా తెలుసుకునే ఏర్పాట్లు చేశారు.

  ఇది చదవండి: విశాఖ బీచ్ కు వెళ్లాలంటే ఇదే సరైన టైమ్.. ఆ అనుభవం మాటల్లో చెప్పలేరు..!


  అంతేగాక మైక్రోస్కోప్స్‌..మోనుక్యులర్‌ అండ్‌ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్‌మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్, హిమోగ్లోబిన్‌మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్‌ బాత్‌.. ఇలా మరెన్నో బయాలజికల్‌ చార్ట్స్‌ ఉన్నాయి. ఆర్థ్రోపోడా, జంతు రాజ్యంలో అతిపెద్ద ఫైలం, ఇందులో ఎండ్రకాయలు, పీతలు, సాలెపురుగులు, పురుగులు, కీటకాలు, సెంటిపెడెస్, వంటి సుపరిచితమైన రూపాలు ఉన్నాయి. ఎండ్రకాయలు, తేలు, పీతపై సక్కులినా మరియు సన్యాసి పీత మొదలైనవి మరియు అన్ని రకాల కీటకాలు ఇక్కడ ఉన్నాయి.

  ఇది చదవండి: సాగరగర్భంలో అందమైన ప్రపంచం.. ఏపీ తీరంలో అరుదైన పగడపు దిబ్బలు..


  విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మరియు ఒకజాతికి చెందిన వాటిలో అనేక రకాల రకాలు ఉన్నాయని వారికి తెలియజేయడానికి. వాస్ప్ జీవిత చరిత్ర, దోమల జీవిత చరిత్ర, చెదపురుగు జీవిత చరిత్ర మరియు ఇవి మాత్రమే కాదు. హౌస్ ఫ్లై జీవిత చరిత్ర లాంటివి చాలా ఉన్నాయి.
  ఎముకలు మరియు జంతువుల పుర్రెలు ఒక కప్పు బోర్డులో ఉంచారు. నాగుపాము మరియు ఇతర వివిధ పాములు ఇక్కడ భద్రపరచబడ్డాయి.

  ఇది చదవండి: అదో భూతల స్వర్గం.. ఒక్కసారి వెళ్తే వెనక్కి రావాలనిపించదు.. అంత అందంగా ఉంటుంది..


  విద్యార్థుల మెదళ్లలో ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానాలు..!
  విద్యార్థులు ఒక్కసారి ఈ మ్యూజియాన్ని సందర్శిస్తే వాళ్ల మెదడు పనిచేసే విధానం వాళ్ల ఆలోచన మారుతుందనడంలో సందేహం లేదు. వాళ్లలో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి..వాటి సమాధానాల వేట మొదలుపెడతారు. ఆ ప్రయాణంలో వాళ్లేంతో నేర్చుకోవడమే కాకుండా..సైన్స్‌లో ఎన్నో విషయాలు తెలుసుకుంటారు.

  ఇది చదవండి: మత్స్యదర్శిని మిమ్మల్ని మాయ చేస్తుంది.. అదో అద్భుత ప్రపంచం


  మరెక్కడా కనిపించని మ్యూజియం...
  మ్యూజియంలో అరుదైన జీవ జాతులకు సంబంధించి స్పెసిమెన్స్, ట్యాక్సీడెర్మీసెక్షన్‌ కూడా ఉంది. వందల సంఖ్యలో సేకరించి భద్రపరిచిన జీవజాతులను చూసేందుకు జిల్లాలోని విద్యార్థులే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి ఆసక్తి ఉన్న వాళ్లు కూడా వస్తుంటారు. ఈ కళాశాలలో జీవ, జంతు, రసాయన శాస్త్రాలకు సంబంధించి ప్రయోగశాలలను.. అధునాతన సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పరిధిలోనే కాకుండా ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరెక్కడా ఇలాంటి మ్యూజియం ఉండదు. మానవ పిండాలకు సంబంధించి ఆంధ్రా మెడికల్‌ కళాశాల విద్యార్థులు కూడా తరచూ ఇక్కడకే వస్తుంటారని జువాలజీ ఇన్‌చార్జి రాంకుమార్‌ తెలిపారు.

  అడ్రస్ : హెడ్ పోస్ట్ ఆఫీస్‌ దగ్గర 21, 1-17, AVN కాలేజ్ రోడ్‌, KGH వెనుక, వన్‌ టౌన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్- 530001
  ఫోన్‌ నెంబర్‌ : +91 8912568004

  AVN College Visakhapatnam

  మ్యూజియమ్‌కి ఎలా వెళ్లాలి.?
  వైజాగ్‌ బస్టాండ్‌ నుంచి జగదాంబ జంక్షన్ వరకు 99 , 77P బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఆటోలో వెళ్లవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు వెళ్లి అక్కడనుంచి లోకల్ బస్సులు, ఆటోలో అక్కడకు వెళ్లొచ్చు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు