Home /News /andhra-pradesh /

Vizag Beach: సండే అందరికీ హాలిడే..! కానీ ఈ యువతికి కాదు..! కారణం ఏంటంటే..!

Vizag Beach: సండే అందరికీ హాలిడే..! కానీ ఈ యువతికి కాదు..! కారణం ఏంటంటే..!

బీచ్ లో వ్యర్థాలు ఏరుతున్న యువతి

బీచ్ లో వ్యర్థాలు ఏరుతున్న యువతి

ఆదివారం (Sunday) వస్తే చాలు ఏ పని చేయకుండా బద్దకించేవారు చాలామంది ఉంటారు. ఆరు రోజులు తీరికలేకుండా గడిపాకందా.. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకుంటారు. లేకుంటే ఏ ఫోనుతోనో, సినిమాలకో వెళ్లి కాలక్షేపం చేస్తారు. విశాఖపట్నం (Visakhapatnam)కు చెందిన ఈ యువతి అలా చేయలేదు.

ఇంకా చదవండి ...
  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆదివారం (Sunday) వస్తే చాలు ఏ పని చేయకుండా బద్దకించేవారు చాలామంది ఉంటారు. ఆరు రోజులు తీరికలేకుండా గడిపాకందా.. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకుంటారు. లేకుంటే ఏ ఫోనుతోనో, సినిమాలకో వెళ్లి కాలక్షేపం చేస్తారు. విశాఖపట్నం (Visakhapatnam)కు చెందిన ఈ యువతి అలా చేయలేదు. తీరిక దొరికిన ఒక రోజును సమాజం కోసం కేటాయించాలనుకుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను ఏరే పనిలో పడింది. చార్టడ్‌ అకౌంటెన్సీ చదువుతున్న ఈ విద్యార్థిని ప్రతి ఆదివారం వైజాగ్ బీచ్‌ (Vizag Beach) కు వస్తుంది. వారంలో దొరికిన ఓ రోజును విశ్రాంతి కోసం కేటాయించకుండా సమాజానికి పనికొచ్చే పనిచేస్తోంది ఓ యువతి. మరో యువతి తను బాల్యం నుంచి తెలుసుకున్న సేవా నిరతి పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూ అభ్యాగులకు తోచిన సాయం చేస్తోంది.

  వారంలో దొరికిన ఓ రోజును విశ్రాంతి కోసం కేటాయించకుండా సమాజానికి పనికొచ్చే పనిచేస్తోంది ఓ యువతి. మరో యువతి తను బాల్యం నుంచి తెలుసుకున్న సేవా నిరతి పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూ అభ్యాగులకు తోచిన సాయం చేస్తోంది. వీరు మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.అందరూ తీరంలో కెరటాలతో కేరింతలు కొడుతుంటే ఈ యువతి చేతిలో ఓ గోనెసంచి పట్టుకొని తీరంలోని ప్లాస్టిక వ్యర్థాలు ఏరి అందులో పోస్తుంటుంది.

  ఇది చదవండి: భార్యను భర్త కొట్టడం కరెక్టేనా..? తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఏమంటున్నారంటే..!


  ఇదేమిటని ప్రశ్నిస్తే.. ప్లాస్టిక్‌ వల్ల సముద్ర జలాలు కలుషితమవుతాయని సమాధానం చెప్తోంది. అందువల్ల తనకు దొరికిన ఓ సెలవు రోజును తీరంలో వీటిని ఏరడానికి కేటాయిస్తానంటోంది. ప్రతివారం వస్తానని.. వ్యర్థాలు సేకరిస్తానని చెప్తోంది. ఇదే తనకు ఆహ్లాదం కలిగిస్తుందని ఆ విద్యార్థిని చెప్తోంది. వారంలో దొరికిన ఓ సెలవు రోజును ఓ మంచి పనికి కేటాయిస్తున్న యువతిని అభినందించాల్సిందే. చిన్నప్పుడు సత్యసాయి స్కూల్లో చదవడం వల్ల తనకు సేవ చేయాలనే ఆలోచన బాల్యం నుంచే కలిగిందని ఆ యువతి చెప్తోంది.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ తెరపైకి కొత్త జిల్లాలు.. ప్రభుత్వ వ్యూహం ఇదేనా..?


  ప్రస్తుతం చదువు పూర్తయ్యాక కూడా దానిని కొనసాగిస్తోంది. ఇంజినీరింగ్‌ చేసిన ఈ యువతి తనకు ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తనకు వచ్చిన జీతంలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటుంది. తన అభిరుచికి తండ్రి వెంకటేశ్వరరావు చేదోడుగా నిలుస్తుంటారు. అనాథలు, యాచకులకు తనకు తోచిన సాయం చేస్తుంటుంది.

  ఇది చదవండి: మొబైల్ ఫోన్ పోయిందా..? వాట్సాప్ మెసేజ్ చేస్తే తెచ్చిస్తామంటున్న పోలీసులు.. అదెలాగంటే..!


  ఒక్కోసారి ఆహారం.. మరోసారి వారికి కావల్సిన కనీస వస్తువులు అందిస్తుంటుంది. ప్రస్తుతం చలికాలం. రోడ్ల పక్కన యాచకులు, అనాథలు చలితో ఇబ్బంది పడుతుండటం చూస్తుంటాం. అలాంటి వారికోసం రేఖ దుప్పట్లు, రగ్గులు కొని ఇటీవల పంచింది. వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే వేసుకోవడానికి మందులు కూడా కొనిస్తుంటుంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉందని చెప్తోంది.

  మీ నగరం నుండి (విశాఖపట్నం)

  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag

  తదుపరి వార్తలు