Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS WATER FALLS WILL GIVES UNIQUE EXPERIENCE WHICH IS LOCATED IN ANDHRA ODISHA BOARDER FULL DETAILS HERE PRN VSJ NJ

Wow: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ జలపాతాన్ని చూడాల్సిందే..! లేదంటే మీ బ్యాడ్‌ లక్‌..!

డుడుమ జలపాతం

డుడుమ జలపాతం

Duduma Water Falls: ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి.. దివి నుంచి భువికి జాలువారే ఆ నీటిలో ఎంజాయ్‌ చేస్తే ఆ మజానే వేరు. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే ... కాకపోతే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి జలపాతాలను చూస్తే ఎవ్వరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి.. దివి నుంచి భువికి జాలువారే ఆ నీటిలో ఎంజాయ్‌ చేస్తే ఆ మజానే వేరు. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే ... కాకపోతే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి జలపాతాలను చూస్తే ఎవ్వరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే.. తప్ప మాటలతో వర్ణించడం కష్టం. మన దేశంలోనూ అందులోనూ మన రాష్ట్రంలో జలపాతాలు చేసే సవ్వడి అంతా ఇంతా కాదు. టూరిస్ట్‌ ప్లేస్‌లుగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అయితే కొన్ని బయటిప్రపంచంతో సంబంధం లేనట్లు ఉంటే మరికొన్ని ఆ ప్రాంతవాసులను కట్టిపడేస్తుంటాయి. మన రాష్ట్రంలో పచ్చని కొండల నడుమ ఉన్న డుడుమా జలపాతాన్ని ఒక్కసారి చూశారంటే మీరు మైమరచిపోతారు.

  డుడుమ జలపాతం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు (Araku) నుండి 70 కిలోమీటర్ల దూరంలోని మూచ్ ఖండ్ నదిపై ఈ జలపాతం ఉంటుంది. ఈ డుడుమ జలపాతం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఒడిశా రాష్ట్రం బోర్డర్ లోనూ, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) ముంచింగిపుట్టు గ్రామానికి సమీపంలోనూ ఉంది. 520 అడుగుల ఎత్తుతో వున్న ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పచ్చని చెట్లు, కొండకోనల మధ్య నుండి వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే..! ఆ సీన్‌ను 70mm స్క్రీన్‌ మీద చూసినట్లు సంబరపడాల్సిందే..!

  ఇది చదవండి: మనం తేళ్లను చూస్తే పారిపోతాం.. కాని వారికి మాత్రం అవి దైవంతో సమానం.. 


  ప్రస్తుతం వర్షాకాలం కావడంతో భారీగా వానలు పడుతున్నాయి. దీంతో కొండ కోనల్లో నుంచి పొంగిపొర్లుతూ వస్తున్న నీరు.. పాలపొంగులాంటి ఈ డుడుమా జలపాతం చూస్తూ అందులో తడిసిముద్ధవకుండా ఎవ్వరూ ఉండలేరు..! కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు... డుడుమ జలపాతం సోయగాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న ఈ జలపాతం చూస్తుంటే వారెవ్వా అనాల్సిందే..!

  ఇది చదవండి: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!


  కాస్త ఎండలు తగ్గి వానలు పడుతుంటే… అరకు ఏజెన్సీ వంటి ప్రాంతాలు చూసేందుకు చాలామంది ట్రిప్‌లు వేస్తుంటారు. అయితే ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో ఉన్న ఈ డుడుమ జలపాతం మాత్రం పెద్దగా ఎవ్వరికి తెలియని ప్రాంతం. ఒడిశాలోని మచ్‌కుండ్ నది నుండి ఉద్భవించిన డుడుమా మూడు వేర్వేరు దిశలలో మూడు జలపాతాల సమూహం.. ప్రతి ఒక్కటి వాటి వాటి మార్గాల్లో ప్రవహిస్తూంటాయి.

  ఇది చదవండి: వైజాగ్ బీచ్ కు వెళ్తున్నారా.. అయితే కాస్త చూసుకోండి..! బి అలర్ట్..!


  ఈ డుడుమ జలపాతానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల ఇది అంతగా వెలుగులోకి రాలేదు. రహదారులు కానీ, స్థానిక సదుపాయాలు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల డుడుమ చాలా మంది పర్యాటకులను పెద్దగా తెలియడం లేదు. ఈ సుందర జలపాతం చూడాలంటే మీరు సాహసాలు చేయాల్సిందే..!

  ఇది చదవండి: బెల్లం వినాయకుడుని ఎప్పుడైనా దర్శించుకున్నారా: బెల్లమే నైవేద్యంగా స్వీకరించే గణనాధుడు


  మెల్లమెల్లగా మెట్లు దిగుతుండగా, రాళ్లపై నుంచి నీరు పడే హోరు వినపిస్తుంది. కిందకి చేరుకున్న తర్వాత జారుతున్నట్లుగా ఉండే రాళ్లపై నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇంత శ్రమ పడ్డ తర్వాతే పర్యాటకులు ఆ జలపాతాల పాదాలను ముద్దాడగలరు. అప్పటివరకు పడ్డ శ్రమఅంతా ఒక్కసారిగా ఆవిరై పోతుంది.

  ఇది చదవండి: బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే గుర్రాలు కట్టేసేవారట..! మరి ఆ ప్రాంతం ఇప్పుడెలా ఉంది..?


  ఈ డుడుమ జలపాతాన్ని మొత్తం చూడాలంటే సుమారు 2-3 గంటలు పడుతుంది. పర్యాటకులు నదిలో గులకరాళ్ళతో ఆడుకోవచ్చు… స్వచ్ఛమైన చల్లటి నీటిలో తడుస్తూ స్నానం చేయవచ్చు. డుడుమ వద్ద ఉన్న ప్రతి జలపాతంతో ఫోటో తీసుకోవొచ్చు. ఆ లోయలో మనం అరుస్తున్నప్పుడు వచ్చే ప్రతిధ్వనిని వర్ణించడం అసాధ్యం.. లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటి జలపాతాన్ని చూడాల్సిందే..!

  Vizag Duduma Water Falls Map

  ఎలా వెళ్లాలి?
  విశాఖకు 177 కిలోమీటర్ల దూరంలో ఈ డుడుమ జలపాతం ఉంటుంది. విశాఖ నుంచి కిరాండోల్‌ ప్యాసింజరు రైలు ఎక్కి.. బెజ్జా జంక్షన్‌ వద్ద దిగి అక్కడ నుంచి షేరింగ్‌ జీపుల ద్వారా డుడుమ వెళ్లొచ్చు. లేదంటే విశాఖ నుంచి ఒనకడిల్లీకి ఎపీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఉంది. అక్కడ నుంచి డుడుమ వెళ్లొచ్చు. అయితే డుడుమకు వెళ్లే రహదారి తూర్పు కనుమలపై ఉండటం వల్ల అక్కడక్కడ మొబైల్‌ సిగ్నల్స్ సరిగా పనిచేయవు..
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Araku, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు