Setti Jagadeesh, News 18, Visakhapatnam
కొండకోనల నుంచి కిందకు దూకే సమ్మగిరి జలపాతం (Sammagiri Water Falls) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) మన్యంలో లంబసింగి (Lambasingi) వచ్చే ప్రతి పర్యటకులు ఈ సమ్మగిరి రావడంతో పర్యాటకలతో కిటకిట లాడుతుంది. పచ్చని ప్రకృతి నడుమ ఈ ఎత్తైన జలపాతంలో స్నానాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు పర్యటకులు. కనుచూపు మేరంతా పచ్చదనం.. మధ్యలో చూడచక్కగా కనిపించే జలపాతం ఇది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం తరలివస్తున్నారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తున్నారు.
ఆదివారం, సోమవారం వచ్చిన సందర్భంగా... సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు.. వారూ వీరూ అని తేడా లేకుండా.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా... జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించారు.ఈ జలపాతం లంబసింగి వెళ్లే మార్గంలో ఎర్రవరం జలపాతం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని బోర్డు కనిపిస్తుంది. లంబసింగ్ వెళ్లే ప్రతి పర్యాటకులు ఈ జలపాతం చూసుకొని వెళ్లడం జరుగుతుంది. ఇది ఎంతో అద్భుతంగా ఉన్న జలపాతం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇది విశాఖపట్నం 100 కిలోమీటర్లు దూరంలో వుంది.
లంబసింగి నుండి 20 కి.మీ దూరంలో మరియు నర్సీపట్నం నుండి 25 కి.మీ దూరంలో, యర్రవరం వద్ద సమ్మగిరి జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని నర్సీపట్నం తాలూకాలోని యర్రవరం గ్రామంలో ఉన్న ఒక సుందరమైన జలపాతం. నర్సీపట్నం-చింతపల్లి రోడ్డులో ఇది వుంది.ఈ జలపాతం 10 అడుగుల ఎత్తు మరియు 15 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉంది. నీరు వేర్వేరు క్యాస్కేడ్లలో పడిపోతుంది మరియు దిగువన ఒక కొలనుని ఏర్పరుస్తుంది. ఇది ఏడాది పొడవునా ఉండే జలపాతం. కొండ ఎక్కడానికి ఆసక్తి ఉన్న వారికి ఇది ఉత్తమమైన ప్రదేశం.
ఈ ప్రదేశం వేసవి మరియు చలికాలంలో అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలపాతం చేరుకోవడానికి, నర్సీపట్నం సిటీ నుండి యర్రవరం గ్రామం వరకు క్యాబ్స్ ఆటోను అద్దెకు తీసుకొని, దట్టమైన అటవీప్రాంతం మధ్య 5 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.ట్రెక్కింగ్, స్టార్గేజింగ్ మరియు క్యాంపింగ్ వంటి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా చేసుకోవోచ్చు.
ఎలా వెళ్లాలి..? : విశాఖపట్నం నుండి బస్సు సౌకర్యం కలదు. విశాఖపట్నం నుండి నర్సీపట్నం చేరుకోవాలి. అనంతరం చింతపల్లి బస్ ద్వారా ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam