Setti Jagadeesh, News 18, Visakhapatnam
హిందువుల ఆరాధ్య దైవం కలియుగ పురుషుడు శ్రీరాముడు (Lord Srirama). ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలం (Bhadrachalam) తో పాటు ప్రతి గ్రామంలోని సీతారామకళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. మన దేశంలో శ్రీరాముడి గుడిలేని గ్రామం అంటూ ఉండదు. ప్రతి ఏటశ్రీరామ నవమి వస్తుందంటే చాలు ఊరువాడా సందడి వాతావరణం వుంటుంది. గ్రామాల్లో అందరూ శ్రీరామ నవమి రోజున వేకువజామున లేచి శ్రీ రాముడు మందిరం శుభ్రం చేసుకున్నాక మహిళలు దీపారాధన చేస్తారు. రామునికి పండ్లు, పూలు, ప్రసాదాన్ని సమర్పిస్తారు. శ్రీ రాముడు పెళ్లి ఊరు అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. పెళ్లి రోజు వడపప్పు, పానకం కళ్యాణానికి ప్రసాదంగా పెట్టి అందరికీ ప్రసాదం గా పంచుతారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తారు.
పెళ్లికి శోభనాలు...
శ్రీరాముడు పెళ్లి అంటే గ్రామాల్లో ముందు రోజు నుండి కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీరాముడు పెళ్ళంటే కొత్తగా పెళ్లయిన దంపతులు ఎవరైనా ఉంటే వారిని పెళ్లి కొడుకుగా పెళ్లికూతురుగా భావించి రాములు వారి కళ్యాణం వారిచే చేయడం జరుగుతుంది.
పెళ్లికి ముందు రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం శోభనాలు పొడడం జరుగుతుంది. శ్రీరాముని శోభనాలు అనగా పెళ్లికి ముందు రోజు రాత్రి పాలలో రోకలి ముంచి రాముని పెళ్లి చేసే పెళ్లి కొడుకుకి పొట్టమీద అంటించడం జరుగుతుంది. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం ఆనవాయితీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Sri Rama Navami 2023, Visakhapatnam