Setti Jagadeesh, News 18, Visakhapatnam
హిందూ సాంప్రదాయం (Hindu Traditions) లో వివాహం ఎంతో పవిత్రమైనది. పెళ్లి పనులు ప్రారంభం కి గోధుమరాయ పెట్టడం జరుగుతుంది. గోధుమ రాయి అంటే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అని అర్థం అని పెద్దలు మాట. హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు ఎందుకు పెడతారు ఏ విధంగా పెట్టాలనేది అర్చకులు విజయభాస్కర్ మాటల్లో విందాం. నిత్య జీవితంలో పూర్వకాలంలో రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంతో ముడివడి వుండేవి. వివాహం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం. పూర్వకాలంలో పెళ్లి వచ్చింది అంతే అన్ని కులాల వారికి ఉపాధి దొరకాలని ఈవిధంగా పెట్టారంటూ అర్చకులు చెప్తున్నారు. గోధుమ రాయి పెట్టినప్పుడు చేసే కార్యక్రమాలకు ఒక అర్థం ఉందంటూ చెబుతున్నారు.
ధాన్యం, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదటగా దంచుకొని పెళ్లికి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు,పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. పూర్వకాలంలో ప్రొద్దున్నే లేచినప్పటి నుండి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు, పసుపు కొట్టుకోవటం ఇవన్నీ రోజు చేసుకునే పనులుగా ఉండేవి.
కానీ ఇప్పుడు అవి లేవు. పూర్వకాలంలో విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అందుకే అప్పటి వారికి రోగాలు కూడా చాలా తక్కువ వచ్చేవి. పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం.ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది.
అన్నింటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్ గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారోమన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో తెలియడం లేదు.వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Marriage, Visakhapatnam