VISAKHAPATNAM THIS SPECIAL SWEET WILL WITNESS SANKRANTHI FESTIVAL IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
Sankranthi Special Sweet: ఈ స్వీట్ లేనిదే అక్కడ సంక్రాంతి లేదు.. ఎందుకంత స్పెషల్ అంటే..!
సంక్రాంతి స్పెషల్ ధనుర్మాస చిక్కీలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి (Sankranthi) సందడి నెలకొంది. పల్లెలలనీపండుగ వాతావరణంతో కళలాడుతున్నాయి. పెద్దపండక్కి పిండి వంటలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఓ స్వీట్ సంక్రాంతికి అసలైన చిహ్నంలా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి (Sankranthi) సందడి నెలకొంది. పల్లెలలనీపండుగ వాతావరణంతో కళలాడుతున్నాయి. పెద్దపండక్కి పిండి వంటలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఓ స్వీట్ సంక్రాంతికి అసలైన చిహ్నంలా నిలుస్తోంది. అక్కడ ఈ స్వీట్ లేనిదే సంక్రాంతి ఉండదు. అవే ధనుర్మాస చక్కీలు. ఉత్తరాంధ్రలో సంక్రాంతి సమయం వచ్చిందంటే ఈ ధనుర్మాస చక్కీలు తయారు చేయడం వచ్చిన మహిళలంతా కూడా వివిధ దుకాణాల దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని తయారు చేసి.. చక్కగా ప్యాకింగ్ చేసి పంపుతారు. ఇలా ఈ నెలంతా ఆడవాళ్లు వీటి తయారీ చేయడం ద్వారా ఉపాధి కూడా పొందుతారు. ధనుర్మాస చక్కీలను ఇంటికొచ్చిన ఆడపడుచులకు, పెళ్లైన ఆడపిల్లలకు సారెగా, స్నేహితులు, బంధువుల ఒకరికి ఒకరు ఆహ్వానాలు అందించేందుకు ఈ చక్కీలను ఇస్తారని...ప్రత్యేకంగా దేవుడి కోసం కూడా ఈ స్వీట్ ను తయారు చేస్తామని తయారు చేస్తున్న మహిళలు తెలిపారు.పంచదార, పేలాల్లా అంతా కలిసి ఉండాలనే ఒకరికి ఒకరు ఈ స్వీటు ఇచ్చిపుచ్చుకుంటారు.
దేవుడికి ప్రసాదంగా పెట్టే స్వీట్ ఇది. ఆ స్వీటే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు సారెగా కూడా ఇస్తారు. సంక్రాంతి పండగకి తప్పనిసరిగా ఈ స్వీట్ ఉండాల్సిదే. చలికాలంలో మాత్రమే దొరకడం ఈ స్వీట్ మరో ప్రత్యేకత. అన్నింటి కంటే మించి ప్రేమికులకు ఇష్టమైన లవ్ సింబల్ (హృదయాకారం) ఆకృతిలో ఉంటుంది. ఎన్నో ప్రత్యేకతులున్నఈ సంక్రాంతి స్వీట్ నెలన్నర రోజులే దొరుకుతుంది.
ఇన్ని ప్రత్యేకతులున్న ఈ స్వీట్ అన్నీ చోట్ల దొరకదు. కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే లభ్యమవుతుంది. వీటిని తయారీదారులు థనుర్మువ్వలు అని పిలుస్తారు. సాధారణ ప్రజలు మాత్రం ధనుర్మాస చిక్కీలు అంటారు. ఈ పేరుతోనే ఉత్తరాంధ్రలో ఈ స్వీట్ ఫేమస్. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు. చలికాలంలో మాత్రమే తయారయ్యే ఈ స్వీట్ ఎండకాలంలో ఎందుకు చేయకూడదు...? ఈ స్వీట్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి...?
సాధారణంగా పల్లీలు (వేరు శనగలు), బాదం, బెల్లం, పంచదార కలిపి తయారు చేసే చిక్కీలు చాలా చోట్ల దొరుకుతాయి. కానీ ధాన్యంలోని పాలతో తయారు చేసే ఈ ధనుర్మాస చిక్కీలు సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి సమయంలో ఈ స్వీట్ తినలేకపోతే...మళ్లీ మరో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఈ ధనుర్మాస చక్కీలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎక్కువగా తయారవుతాయి. కొన్ని తరాల కిందట ఒడిశా నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో స్థిరపడిన కుటుంబాలు ఈ స్వీట్ ను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటీకి ధనుర్మాస చక్కీలంటే ఇచ్ఛాపురం వెళ్లాల్సిందే. అయితే కాలక్రమంలో వీటి అమ్మకాలు మాత్రం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో ధనుర్మాస స్వీట్ రుచులు ఉత్తరాంధ్రలోచాలా మందికి తెలుసు. ఈ స్వీట్‌కు జౌషధ గుణాలు కూడా ఉన్నాయని అంటున్నారు తయారీదారులు.
ధనుర్మాసం అంటేనే పండగలు మొదలై...ప్రతి ఇంటిలో సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా పంటకోతల సమయం కావడంతో రైతులు ఇళ్లన్నీ పంటలతో కళకళలాడుతుంటాయి. రైతులు కోతలైన తర్వాత కొత్త ధాన్యాన్ని దంచి వాటి పాలతో చిక్కీలు చేస్తారు. ఈ పాలకు, పేలాలు, పంచదార పాకాన్ని కలిపి...పోషక విలువలు, అలంకరణ కోసం కోసం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం కూడా వాడతారు. స్పెషల్ డిజైన్లలో కూడా ఆర్డర్లపై తయారు చేస్తారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.