Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS SCHOOL IN VISAKHAPATNAM HAS ONLY TEACHER FOR FROM CLASS 1 TO 5TH AS STUDENTS FACING PROBLEMS FULL DETAILS HERE VSJ NJ PRN

Vizag: ఐదు క్లాసులకు ఒకే టీచర్.. ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదేనా..? ఇప్పుడేం సమాధానం చెబుతారు..?

విశాఖలో

విశాఖలో 67 మందికి ఒక్కరే టీచర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యావిధానంలో సమూల మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే విద్యాబోధనలో కూడా అప్ డేటెడ్ వెర్షన్స్ అమలు చేస్తున్నామంటోంది. నాడు నేడు పేరుతో బడుల రూపురేఖలు మార్చేసినట్లు ప్రకటిస్తోంది. కానీ కొన్ని స్కూళ్లలో ఇంకా సమస్యలు తిష్టవేశాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యావిధానంలో సమూల మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే విద్యాబోధనలో కూడా అప్ డేటెడ్ వెర్షన్స్ అమలు చేస్తున్నామంటోంది. నాడు నేడు పేరుతో బడుల రూపురేఖలు మార్చేసినట్లు ప్రకటిస్తోంది. కానీ కొన్ని స్కూళ్లలో ఇంకా సమస్యలు తిష్టవేశాయి. సాధారణంగా ఐదు తరగతుల వరకు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులైనా ఉండాలి. ప్రతీ తరగతిలో ఎంత లేదన్నా పది మంది విద్యార్థులు ఉంటారు. కానీ అధికారుల వైఫల్యం, సిబ్బంది కొరత కారణంగా కొన్ని చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. టీచర్లు ఎవరో ఒకరు ట్రాన్స్‌ ఫర్‌ కావడం, ప్రభుత్వం అక్కడ ఇంకొకరిని కేటాయించకపోవడం తదితర కారణాలతో సింగిల్‌ టీచర్‌తోనే స్కూళ్లు నడుస్తున్నాయి. బోధన సరిగా అందక విద్యార్థులు.. అన్ని తరగతులకు బోధించలేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు జ్ఞాన సముపార్జనలో నష్టపోతున్నారు.

  వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న జీ.వి.ఎమ్.సి న్యూరేసపువానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు 67 మంది విద్యార్థులున్నారు. అయితే వీరికి బోధన చేసేందుకు మాత్రం ఇద్దరు టీచర్లు ఉండాలి. కానీ ఒకే ఒక్క టీచరమ్మ ఇక్కడ విధుల్లో ఉన్నారు. కిరణ్మయి అనే టీచర్ ఒక్కరే ఐదు తరగతులను సమన్వయం చేసుకుంటూ పాఠాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫీ రూల్‌తో ఆ యాప్‌ సరిగా పనిచేయక అటు అవి చూసుకుంటూ ఇటు అన్ని తరగతులను మానేజ్‌ చేయడం ఆమెకు తలకు మించిన భారం అవుతోంది.

  ఇది చదవండి: వైజాగ్ బీచ్‌కు ఏమైంది.. ఎందుకలా జరుగుతోంది..ముప్పు ముంచుకొస్తోందా..?


  ఉదయం 9 గంటల నుండి పిల్లలకు హాజరు తీసుకోవడం , బాత్రూం ఫోటోలు అప్లోడ్ చేయడం , మధ్యాహ్నం భోజనం ఫోటోలు పెట్టడం వంటి పనులు ఆమెకు మధ్యాహ్నం వరకు సరిపోతున్నాయి. వీటితోనే రోజులో సగం గడిచిపోతుంటే…పిల్లలకి సరిగ్గా పాఠాలు బోధించడం అవ్వడం లేదని కిరణ్మయి టీచర్‌.. ఆమె పరిస్థితిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  ఇది చదవండి: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ జలపాతాన్ని చూడాల్సిందే..! లేదంటే మీ బ్యాడ్‌ లక్‌..!


  ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన స్థాయి పెంచుతున్నామంటూ ఉపన్యాసాలిచ్చే నాయకులు, అధికారుల మాటలు తామరాకు మీద నీటిబొట్టుగా మారుతున్నాయి. అటు గ్రామాల్లోని, పట్టణాలలోని పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో సతమతవవుతున్నాయి. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు బోధిస్తున్నారు. దీనిని బట్టి సర్కారు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒక క్లాస్‌ పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో మరో క్లాస్‌రూమ్‌లో పిల్లలు గోల గోల చేస్తున్నారు. అల్లరి చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో స్కూల్‌ను నెట్టుకొస్తున్నారు కిరణ్మయి టీచరమ్మ.

  ఇది చదవండి: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!


  ఒకపక్క పిల్లల్ని స్కూల్ వద్దకు తీసుకువస్తున్న తల్లిదండ్రులు, ఐదు తరగతులకు కలిపి ఒకే టీచర్ ఉంటే ఎలా బోధిస్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇలానే బోధన చేస్తారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఒక తరగతిలో టీచర్ పాటలు చెప్తే మిగతా తరగతిలో విద్యార్థులు అందరు కూడా ఆడుకుంటున్నారని..స్కూల్‌కు పంపిస్తే చదువుకుంటారనుకున్నామని.. ఇలా ఆడుకోడానికి అయితే స్కూల్‌ వరకు ఎందుకని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  ఇది చదవండి: అక్కడ దొరకని పుస్తకమంటూ ఉండదు.. నాలెడ్జ్ కు కేరాఫ్ అడ్రస్ ఆ లైబ్రరీ.. ఏపీలో ఎక్కడుందంటే..!


  ఆ పథకాలు, ఈ పథకాలు పెట్టి పిల్లలను స్కూల్‌ వరకు రప్పిస్తున్నారు కానీ వాళ్లు ఆ స్కూళ్లో సరైన విద్య అందుతుందో లేదో అని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. ఇలా అయితే తమ పిల్లలకు చదువులు ఎలా వస్తాయి అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అన్నితరగతులకు ఒక్క టీచరమ్మ ఉందని… ఆమె ఒక్కతే ఒకేసారి పాఠాలు చెప్పడం ఇబ్బంది అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఊరిలోని సర్కారు బడికి మరో టీచర్‌ను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  తదుపరి వార్తలు