హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Road Accident: వైజాగ్ to యమపురి..! ఆ రోడ్డుపై వెళ్తే యాక్సిడెంట్ గ్యారెంటీ..! సీఐ మృతికి కూడా కారణం ఇదేనా..?

Vizag Road Accident: వైజాగ్ to యమపురి..! ఆ రోడ్డుపై వెళ్తే యాక్సిడెంట్ గ్యారెంటీ..! సీఐ మృతికి కూడా కారణం ఇదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రెండేళ్లలో రిటైర్మెంట్. రెండు వారాల్లో టూర్ హాలిడే. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాలి. కానీ.. ఈ లోపే ఆ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను రోడ్డు మింగేసింది. వేగం, నిర్లక్ష్యం రూపంలో.. ఆ సీఐని రోడ్డు ప్రమాదం (Road Accident) కబళించింది. విశాఖపట్నం (Visakhapatnam) లోని ఎండాడ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందనడానికి ఇది మరో నిదర్శనం.

ఇంకా చదవండి ...

P. Anand Mohan, Visakhapatnam, News18

రెండేళ్లలో రిటైర్మెంట్. రెండు వారాల్లో టూర్ హాలిడే. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాలి. కానీ.. ఈ లోపే ఆ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను రోడ్డు మింగేసింది. వేగం, నిర్లక్ష్యం రూపంలో.. ఆ సీఐని రోడ్డు ప్రమాదం (Road Accident) కబళించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నంలోని (Visakhapatnam) ఎండాడలో రోడ్డులో జరిగిన ప్రమాదంలో సీఐ ఈశ్వరరావు మృత్యువాతపడ్డారు. ఈ మృతితో పోలీసుశాఖ (AP Police) ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఒక మంచి పోలీసు అధికారిని పోలీసు శాఖ కోల్పోయింది. అయితే ఈ మృతి విషయంలో ఎండాడ రోడ్డు ఎంత డేంజర్ అనేది మరోసారి రుజువైంది. ఎండాడ జంక్షన్ లో కచ్చితంగా వేగ నియంత్రణ ఉండాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది.

విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరం. అందులోనూ నగరం విస్తరిస్తోంది. ఇదివరకు అటు ఆదర్శనగర్.. ఇటు ఎన్ఏడీ కొత్త రోడ్డు వరకూ వెళ్తేనే అదో పెద్ద దూరంగా ఫీలయ్యేవారు. కానీ.. ఇప్పుడు భీమిలీ, గాజువాక వరకూ నగర పరిధే. వీటన్నటితో పాటు.. వాహనాలు పెరుగుతున్నాయి. బైక్, కార్ల సంఖ్య విశాఖలో గత అయిదేళ్లలో విపరీతంగా పెరిగింది. ఇటు జూ పార్క్ దాటితే ఇక వాహనాల వేగం పెరిగిపోతోంది. హనుమంతవాక నుంచీ అటు ఎన్ఏడీ వరకూ వేగం ముప్పై నలభై లోపు ఉండాల్సిందే. ఇక ఆతర్వాత వాహనాల గేర్లు మారిపోతుంటాయి. గంటకి ముప్పై కిలోమీటర్ల లోపు వెళ్లాల్సిన వారందరూ అక్కడ గేర్ మార్చేసి అరవై డెబ్బైలో వెళ్తారు. ఇక కార్ల సంగతి సరేసరి. కారులో ఎక్సలేటర్ తొక్కేవారికి వేగం అసలే తెలియదు.

ఇది చదవండి: మూడు రోజుల్లో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు హై అలర్ట్..


ఇక ఎండాడ జంక్షన్ గురించి చెప్పాలంటే చాలా డేంజర్ అనే చెప్పాలి. ఇప్పటికీ రోజుకు ఒక్క ప్రమాదమైనా జరుగుతూ ఉంటుంది. హైవేను ఆనుకుని ఉన్న ఎండాడ జంక్షన్ లో సిటీ దాటి అటు విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ఒడిశా కూడా వెళ్లే వాహనాలు ఈ హైవేలోనే వెళ్తాయి. దీంతో సిటీ దాటగానే లారీలు, బస్సులు వేగం పుంజుకుంటాయి. ఇక్కడ ఎండాడ జంక్షన్ లో ఏసీపీ ఆఫీస్ దగ్గర బాగా డౌన్ గా కూడా ఉంటుంది. ఇటు కొండ అటు ఎండాడ ఊరు మధ్యతో హైవే ఉండటం.. అదీ బాగా స్లోప్ ఏరియా కావడంతో ఇక్కడ వేగం తగ్గడం లేదు. పోలీసులు పొద్దస్తమానం ఇక్కడ కాపలా ఉన్నా.. ఒకట్రెండు యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇది చదవండి: పెన్సిల్ పోయిందంటూ పోలీస్ కంప్లైంట్... తగ్గేదేలే.. అంటున్న బుడ్డోడు..!


ఒక్క ఎండాడ జంక్షన్ లోనే యాక్సిడెంట్ల సంఖ్య కనీసం నెలలో ముప్పై ఉంటాయి. గత ఏడాది నుంచీ ఇప్పటి వరకూ అంటే నవంబర్ 25వరకూ లెక్క తీస్తే.. ఇప్పటికీ 30 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇక తీవ్రగాయాలు, గాయాలపాలైన వారి లెక్క వందలకి పైనే. ఈ రోడ్డు మొత్తం మీద ఎండాడ జంక్షన్ ఒక్కటే డేంజర్ అన్నది చాలామందికి తెలిసిన అంశమే. ఎండాడ, గొల్లల ఎండాల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ముసలి, చిన్నారులకు ఇక్కడి రోడ్డు దాటడమంటేనే కష్టం. మరోపక్క ఇక్కడ పోలీసులు సిగ్నల్ ఉదయం ఎనిమిది నుంచీ రాత్రి ఎనిమిది వరకూ ఉంచుతారు. తర్వాత అలర్ట్ సిగ్నల్స్ తప్ప ఇంకేం ఉండవు. దాంతో వాహనాల రాకపోకల్లో వేగం పెరిగి.. ఇలాంటి ప్రమాదాలు జరిగి మృత్యువాతపడుతున్నారు.

ఇది చదవండి: అసలు వీడు తండ్రేనా..? కన్నకూతురిపైనే కన్నేశాడు..! వీడికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు..!


ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశం పై సీరియస్ గా ఉన్నారు. సీఐ మృతికి కారణాలపై ఆరా తీయగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న హోంగార్డు నిర్లక్ష్యమే కారణంగా తెలిసింది. నిద్రమత్తులో అతివేగంతో వెళ్లి ట్రాలీని ఢీ కొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Road accident, Visakhapatnam

ఉత్తమ కథలు