Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS RESTAURANT WILL GIVE SPECIAL TASTY RECIPES AS THE SERVE QUAIL BIRD IN DIFFER STYLE IN VISAKHAPATNAM ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag News: మహారాజ్‌ కౌజు పిట్ట ఫ్రై.. ఎవ్వరైనా లొట్టలేయాల్సిందే..! దీనికి తిరుగేలేదు..!

నర్సీపట్నంలో

నర్సీపట్నంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా కౌజుపిట్ట వంటకాలు

Vizag News: మారుతున్న కాలంతో పాటు మనుషులు జిహ్వ రుచులు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా మాంసాహార ప్రియులు అయితే రోజుకో కొత్త రుచులను కోరుకుంటున్నారు. ఒకప్పుడు బాయిలర్‌ కోడి, నాటు కోడి, మటన్‌..అనే వాళ్లు ఆ తర్వాత ఈమూ కోడి,వాటి గుడ్లకు మొగ్గుచూపారు.

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  మారుతున్న కాలంతో పాటు మనుషులు జిహ్వ రుచులు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా మాంసాహార ప్రియులు అయితే రోజుకో కొత్త రుచులను కోరుకుంటున్నారు. ఒకప్పుడు బాయిలర్‌ కోడి, నాటు కోడి (Chicken), మటన్‌ (Mutton) .. అనే వాళ్లు ఆ తర్వాత ఈమూ కోడి,వాటి గుడ్లకు మొగ్గుచూపారు. ఇప్పుడు వీటన్నిటి స్థానాన్ని కౌజు పిట్టలు భర్తీ చేస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజుపిట్టల మాంసాన్ని, గుడ్లను నాన్‌వెజిటేరియన్లు లొట్టలేసుకుంటూ ఆరగించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలో ఈ కౌజు పిట్టల మాంసం తినాలంటే మాత్రం మహారాజు రెస్టారెంట్‌కెళ్లాల్సిందే…డిమాండ్‌కు తగ్గట్లు సరికొత్త వంటకాలు ట్రై చేస్తూ..వెరైటీ రుచులను నగరవాసులకు అందిస్తున్నారు మహారాజ్‌ హోటల్‌ యజమానులు. ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షించేలా మహారాజులో ఇంకా నోరూరించే వంటకాలు ఏమేం ఉన్నాయి..? ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం రండి..

  ‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు'..ఇది దూకుడులో మహేష్‌ బాబు చెప్పిన డైలాగ్‌. ఆ సినిమాలో మహేష్‌ చెప్పినట్లు.. క్రియేటివిటీ ఉండాలే కానీ అది ఏ ప్లాట్ ఫాం అయినా మన టాలెంట్‌ చూపించవచ్చు. గతంలో ఏ హోటల్‌, రెస్టారెంట్‌ పెట్టినా కేవలం ఫుడ్‌ కోసమే అన్నట్లు ఉండేవి… కానీ ఇప్పుడు కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు తమ క్రియేటివిటీతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

  ఇది చదవండి: బెజవాడ బెస్ట్ ఫుడ్ దొరికేది అక్కడే..! అన్నీ రుచులూ ఒకేచోట..!


  మహారాజ్‌ రెస్టారెంట్‌.. వెరీ స్పెషల్‌!
  అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హోటల్ మహారాజ్ నోరూరించే వంటకాలతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సరికొత్త అందాలతో మండీని ఏర్పాటు చేసి చక్కటి సౌకర్యాలు కల్పిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. ఇక్కడ అన్ని రకాల బిర్యానిలు లభిస్తాయి. అంతేకాదు సముద్రపు చేపలు, నాటు కోడి తదితర వంటకాలతో భోజనం ప్రియులను ఆకట్టుకుంటున్నారు. 20 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా భోజనప్రియుల అభినందనలు పొందుతూ ప్రస్తుతం కౌజ్ పిట్ట (quail bird),సముద్రపు చేపలతో ఫేమస్ హోటల్‌గా మారింది.

  ఇది చదవండి: ఇప్పుడీ రెస్టారెంట్ అందరికీ ఫేవరెట్ స్పాట్.. ఇక్కడ స్పెషాలిటీ ఇదే..!


  నేటి తరాన్ని ఎట్రాక్ట్‌ చేసేలా మెనూ కార్డు..!
  రెస్టారెంట్ యాజమాన్యం తగ్గట్లుగానే నేటి తరాన్ని ఎట్రాక్ట్‌ చేసేందుకు తమ మెనూ కార్డులో చాలా మార్పులు చేస్తున్నారు. రకరకాల ఫుడ్ వైరైటీలను పరిచయం చేయడమే కాకుండా. వివిధ రకాల థీమ్స్‌తో, విభిన్నమైన కాన్సెప్ట్ (Unique Concepts) లతో తమ రెస్టారెంట్లను డెకరేట్ చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. ఈ కోవలోనే మహారాజ్‌ రెస్టారెంట్ కూడా ఓ స్పెషల్ డిష్‌ను నర్సీపట్నం వాసులకు పరిచయం చేసింది. అదే కౌజు పిట్ట ఫ్రై..

  ఇది చదవండి: బ్రేక్ ఫాస్ట్ లో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా..? కోడి కూయకముందే పాయా రెడీ..


  ఎవ్వరైనా లొట్టలేయాల్సిందే..!
  వీకెండ్స్‌ వస్తే చాలు ఫ్యామిలీలంతా మహారాజ్‌ రెస్టారెంట్‌ వైపే వెళ్తుంటారు. అక్కడ దొరికే వెరైటీ ఫుడ్‌ను ఎంజాయ్‌చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ కౌజు పిట్ట ఫ్రై. అది అలా వేడివేడిగా తీసుకొచ్చి మన టేబుల్‌ మీద పెడితే..దాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందంటారు. ఇక్కడ ఫ్రై చేయడం మాత్రమే కాదు..అది కస్టమర్‌ కంటికి నచ్చేలా సర్వ్‌ చేస్తారు. కంటికి నచ్చితే చెయ్యి ఊరుకుంటుందా...అది కూడా జేబులోని ఫోన్‌ తీసి క్లిక్‌మనిపిస్తుంది. ఆ తర్వాతే నోటికి పనిచెబుతారు. అలా అర్డర్‌ చేసిన కౌజు పిట్ట... ఇలా టేబుల్‌ మీద వాలిపోతే..లోట్టలేయాల్సిందే.. !

  ఇది చదవండి: టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన వ్యాపారి ఐడియా..! అందరి చూపు అతనివైపే..!


  కౌజు పిట్ట.. ఎంతో హెల్దీ.!
  ఈ మేలిరకపు మాంసాహారంలో పోషకాలు మెండుగా ఉండటంతో..దీనికి రోజురోజుకి డిమాండ్‌ పెరుగుతుంది. అంతేకాదు కౌజు పిట్టల మాంసం ఆరగిస్తే నిత్యయవ్వనంగా ఉంటారట. అంతేనా.. కౌజు పిట్ట మాంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లేకపోలేదు. రక్తపోటును తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల్లో ఉన్న రాళ్లను కౌజు పిట్టల గుడ్లు కరిగించివేస్తాయి. రక్తంలో హెమోగ్లోబిన్‌ స్థాయి పెరగడానికి, బీపీ కంట్రోల్‌ ఉండటానికి, లైంగిక సమస్యలు ఉన్నవారు కౌజు పిట్టఈ గుడ్లను తరచూ ఆరగించినట్టయితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే, అంగ స్తంభన సమస్య నుంచి తొలగిపోతుంది. ఈ కౌజు పిట్ట ఫ్రై తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

  ఇది చదవండి: వైజాగ్ లో బెస్ట్ షాపింగ్ స్పాట్ ఇదే.. అక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు..


  ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కౌజు పిట్ట మాంసం మీరు ఓ సారి ట్రై చేయండి. నర్సీపట్నం మీదగా వెల్తే మాత్రం మహారాజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లకుండా మాత్రం ఉండకండి..అక్కడ ఒక్కసారి కౌజు పిట్ట ఫ్రై తిన్నారంటే…మళ్లీ మళ్లీ తింటారంతే..

  అడ్రస్‌ : షాపు నెంబర్‌ 79, నర్సీపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 531116
  ఫోన్‌ నెంబర్‌ : 93477 99777

  ఎలా వెళ్లాలి?
  నర్సీపట్నం కాంప్లెక్స్ నుండి 100 మీటర్లు దూరంలోనే ఈ మహారాజ్‌ రెస్టారెంట్‌ ఉంది. అక్కడ ఎవ్వరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు