Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS PARK IS A SPECIAL ATTRACTION IN VISAKHPATNAM HAVE A LOOK AT THE SPECIALTIES AND OTHERS PRN VSJ NJ

Vizag News: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!

విశాఖలో

విశాఖలో ఆకట్టుకుంటున్న స్మార్ట్ సిటీ పార్క్

Visakhpatnam: ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రకృతివనంలో అడుగుపెట్టామా అన్నట్లుగా ఉండే ఈ ఉద్యానవనం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలల హోరుతో కనువిందు చేసే విశాల సముద్ర దృశ్యాలు, సంగీతంతో కూడిన బోటింగ్‌, స్కేటింగ్ రింక్‌తో పాటు చిన్నారులకు గేమ్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రకృతివనంలో అడుగుపెట్టామా అన్నట్లుగా ఉండే ఈ ఉద్యానవనం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలల హోరుతో కనువిందు చేసే విశాల సముద్ర దృశ్యాలు, సంగీతంతో కూడిన బోటింగ్‌, స్కేటింగ్ రింక్‌తో పాటు చిన్నారులకు గేమ్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. నూతన హంగులతో స్మార్ట్ సిటీ పార్క్‌ గా మారిన వుడా పార్క్ అందర్ని ఆకట్టుకుంటోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) అధికారులు స్మార్ట్ సిటీలో భాగంగా వుడా పార్క్ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టారు. 33 ఎకరాల్లో విస్తరించి ఉన్న VMRDA (వుడా పార్క్) పార్క్ మూడు జోన్లలో అభివృద్ధి చేశారు. వాకర్స్ కోసం, పిల్లల కోసం, వృద్ధులు, క్రీడా మరియు ఇతరులతో సహా అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను కల్పిస్తూ తీర్చిదిద్దారు.

  వాకర్స్ కోసం నేచర్ ట్రైల్, యూత్‌కి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. యోగా చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా యోగా సర్కిల్‌ను సిద్ధం చేశారు. ఈ పార్కులో బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌ బాల్, స్కేటింగ్ వంటి ఆటల కోసం ప్రత్యేకమైన స్పోర్ట్స్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్‌ లో వివిధ ఆట పరికరాలతో కూడిన పిల్లల ప్లే గ్రౌండ్‌ మరియు ప్రజల కోసం వివిధ రకాల ఎక్విప్‌మెంట్‌ తో ఓపెన్‌ జిమ్‌ ను ఏర్పాటు చేశారు. బోటింగ్ సౌకర్యాన్ని మరింతగా అందంగా పునరుద్ధరించారు. పార్కుకు వచ్చిన ప్రజల కోసం రకరకాల ఆహారపదార్థాలను అందించే ఫుడ్‌ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: వైజాగ్ బీచ్ కు వెళ్తున్నారా.. అయితే కాస్త చూసుకోండి..! బి అలర్ట్..!


  ఈ పార్క్‌ లో ఫిషింగ్ బోట్ యొక్క కళాకృతి, లార్డ్ బుద్ధ వ్యూ పాయింట్ మరియు గోడలపై గిరిజన జానపద కొత్త మ్యూరల్ పెయింటింగ్‌లు పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు జీవీఎంసీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ల దగ్గర అందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

  ఇది చదవండి: అక్కడ దొరకని పుస్తకమంటూ ఉండదు.. నాలెడ్జ్ కు కేరాఫ్ అడ్రస్ ఆ లైబ్రరీ.. ఏపీలో ఎక్కడుందంటే..!


  ప్రకృతి ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని అధికారులు పచ్చదనంపై దృష్టి సారించారు. పార్కు ఆవరణలో హెర్బల్ మొక్కలు, నీడ నిచ్చే చెట్లు, అనేక రకాల పూల మొక్కలతో ల్యాండ్ స్కేపింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు విడివిడిగా పార్కింగ్ సౌకర్యాన్ని పెంచారు. రూ. 33.50 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు చేపట్టారు. మ్యూజికల్‌ ఫౌంటేన్‌, గుర్రపు స్వారీ, సంగీతం, బోటింగ్‌, డాన్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

  ఇది చదవండి: చూడ్డానికి పాత ఆటోలా కనిపిస్తుందా..! కానీ లోపల చూస్తే వారెవ్వా అనాల్సిందే..!


  ఎంజాయ్‌ చేస్తున్న నగరవాసులు..!
  బీచ్ ఆవరణలో ఉన్న ఈ పార్క్.., నగరంలోని పురాతన మరియు అతిపెద్ద ఉద్యానవనాల్లో ఒకటి. బోటింగ్, స్కేటింగ్ మరియు వాకింగ్ ట్రాక్‌ల వంటి సౌకర్యాలతో నగరవాసులను, పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు నగరవాసులు ఈ పార్కుకు వచ్చిసేద తీరుతుంటారు. వీకెండ్స్‌ లో అయితే ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకయితే ఈ పార్క్‌ మరింతగా నచ్చుతుంది. ఈ సారి మీరు వైజాగ్‌ ట్రిప్‌ వేసినప్పుడు ఓ సారి ఈ వుడా పార్కుకు వెళ్లిరండి. మీరు మీ ఫ్యామిలీతో పాటు ఆహ్లాదంగా గడిపేందుకు చాలా చక్కని ప్రదేశం.

  అడ్రస్‌: వుడా పార్క్‌, బీచ్‌ రోడ్‌ కైలాసగిరి, చిన్న వాల్తేర్‌, జాలరి పేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530017.

  Vizag Vuda Park map

  ఎలా వెళ్లాలి?
  ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఐదు-ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వుడా పార్కుకు.. ఆటోలు, బస్సులు, క్యాబ్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు