Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS IS THE BEST PLACE WHO WANT PREPARE TET AND HOW TO APPLY TET EXAM WHAT IS THE FEES AND LAST DATE NGS VSJ NJ

Vizag: ఆహ్లాదకర వాతావరణంలో టెట్‌కు ప్రిపరేషన్.. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. ఎలా చేయాలంటే?

ఆహ్లాదకర

ఆహ్లాదకర వాతావరణంలో టెట్ కు ప్రిపరేషన్

Vizag: ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాల కోసం నేటి నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున విశాఖ నగరం చుట్టుపక్కల విద్యార్థులు అందరూ ఆంధ్ర యూనివర్సిటీలో చల్లనివాతావరణంలో చదువుకునేందుకు వస్తున్నారు..

    Setti Jagadeesh, News18, Visakhapatnam

    Vizag:  ఆంధ్ర ప్రదేశ్‌ (Andhra Pradesh) లో టెట్‌ నోటిఫికేషన్‌ (Tet Notification) పడటంతో చాలా మంది అభ్యర్థులకు ఇదో చక్కని అవకాశం. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించాయి.  16-06-22 నుంచే దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. చాలా రోజులుగా టెట్‌ నిర్వహించక పోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఇప్పటి వరకు ఎదురు చూశారు. జూన్‌ 10న నోటిఫికేషన్‌ పడిన రోజు నుంచే అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్‌ల బాట పడుతున్నారు. అయితే కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారు.. ఇంట్లో చదువుకునే వాతావరణం లేని వాళ్లు.. ఆంధ్రాయూనివర్సిటీ (Andhra University) లోని ఓపెన్‌ ప్లేస్‌లో చదువుకునేందుకు వెళ్తున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు విశాఖపట్నంలో గల ఆంధ్ర యూనివర్సిటీ చక్కటి ప్రదేశం.. ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ఉన్నందున అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు.

    ఒక్కసారి పాస్‌అయితే లైఫ్‌టైమ్‌ వాలిడిటీ
    డీఎస్సీ (DSC) లో టెట్‌ మార్కులకు 20 శాతం మేర వెయిటేజీ ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. దీంతో ఒక్కసారి పాస్‌ అయితే చాలు లైఫ్‌టైమ్‌ వాలిడిటీ ఉంటుందనే ఆశతో అభ్యర్థులు ప్రిపరేషన్స్‌ షురుచేశారు. 

    అభ్యర్థులు ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు ఫీజును ఒక్కో పేపర్‌కు  500 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు దాదాపు నెల రోజులు అంటే జులై 16 వరకు గడువు ఉంటుంది.

    ఇదీ చదవండి : నేడు విజయనగరంలో చంద్రబాబు టూర్.. టార్గెట్ అదేనా..?

    టెట్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు:
    నోటిఫికేషన్ విడుదల: జూన్ 10, 2022
    దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడవు: జూన్ 15 నుంచి జులై 15, 2022 వరకు
    ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు: జూన్ 16 నుంచి జులై 16, 2022 వరకు
    హెల్ప్ డెస్క్ సర్వీస్: జూన్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది.
    ఆన్‌లైన్ మాక్ టెస్ట్: జులై 26 నుంచి అందుబాటులో ఉంటుంది.
    హాల్ టికెట్ డౌన్‌లోడ్: జులై 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
    ఎగ్జామ్స్ తేదీలు: ఆగస్టు 6 నుంచి 21 వరకు..
    ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 31, 2022
    ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు: సెప్టెంబరు 1 నుంచి 7 వరకు
    తుది కీ ప్రచురణ తేదీ: సెప్టెంబరు 12, 2022
    తుది పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబరు 14, 2022

    ఇదీ చదవండి : ఆదాయం.. ఆరోగ్యం.. రెండిటిపైనా ఫోకస్.. ఆంధ్రా కశ్మీర్ లో యాపిల్స్ ఎంతో ప్రత్యేకం..

    టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ వెబ్‌సైట్‌లోనే మీరు ఎగ్జామ్‌ ఫీ కట్టొచ్చు.. ఇందులోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో పూర్తి టెట్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి.

    ఇదీ చదవండి: ప్రత్యేక హోదా ఇస్తేనే.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు.. లోకేష్ కొత్త డిమాండ్.. వైసీపీ సమాధానం..!

    టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది.

    ఇదీ చదవండి : మొన్న దావోస్.. త్వరలో పారిస్.. మరో విదేశీ పర్యటనకు సీఎం జగన్.. కూతురు చేతికి పట్టా వచ్చే వేళ

    పరీక్షకు తక్కువ సమయమే.!                                                                      సరిగ్గా పరీక్షకు రెండు నెలలు సమయమే ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంతకుముందు చదివినవి రివిజన్‌ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది కొత్తగా ఇప్పుడే పరీక్ష రాసేవాళ్లు ఇంత తక్కువ సమయంలో ప్రిపేర్‌ అవ్వాలంటే.. చాలా ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి : ఆత్మకూరు ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద.. వచ్చే ఎన్నికలకు ట్రయల్ రన్..

    ఏ ఏ సబ్జెక్ట్‌ ఎన్ని మార్కులు..!
    మొత్తం 150 మార్కులకు గాను ఏ ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని మార్కులున్నాయో చూసుకోగలిగితే..ఆయా సబ్జెక్ట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ 30 మార్కులు, సాధారణ తెలుగు( మూడో తరగతి నుంచి 10 తరగతి వరకు ఉన్న తెలుగు) 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు వ్యాకరణం, గ్రామర్‌పై దృష్టిపెట్టాలి. మిగిలిన 60 మార్కులే చాలా ముఖ్యం… తెలుగు మెథడాలజీ 12 మార్కులు, మిగిలిన 48 మార్కులు తెలుగు సాహిత్యం, ఆధునిక ధోరణీ, టెక్ట్స్‌ బుక్స్‌లో ఉన్నవన్నీ తిరగేయాల్సిందే.

    ఇదీ చదవండి: అమెరికన్ స్లాంగ్ తో ఇంగ్లీష్ మాట్లాడే బెండపూడి విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? నిజం ఏంటి..?

    ఇంకెందుకాలస్యం, త్వరగా దరఖాస్తు చేసేయండి…ప్రణాళికలు సిద్ధం చేయండి..మీకు ఇంట్లో వీలు కాకపోతే ఏయూలో మీకు చదువుకునేందుకు చక్కని వాతావరణం ఉంది..కావాలంటే అక్కడకైనా వెళ్లి మీరు ప్రశాంతంగా ప్రిపేర్‌ అవ్వొచ్చు. మీకేమైనా డౌట్స్ వచ్చినా.. అడిగేందుకు అక్కడ చాలా మంది విద్యార్థులు, అభ్యర్థులు ఉంటారు.


    అడ్రస్‌ : ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530003
    ఎలా వెళ్లాలి?
    బస్టాండ్‌ నుంచి లోకల్‌ బస్సు, ఆటోలు ఆంధ్రాయూనివర్సిటీకి అందుబాటులో ఉంటాయి. క్యాబ్‌లు కూడా బుక్‌ చేసుకుని వెళ్లొచ్చు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, EDUCATION, Local News, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు