Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS HOUSE WILL BRING YOU INTO A MUSEUM TAKE LOOK AT SOME OLDEST THINGS FROM THE PAST IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VSJ NJ

ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!

రవిశంకర్

రవిశంకర్ ఇంట్లోని వస్తువులు

ఆ ఇల్లంతా ఓ మాయాద్వీపంలా ఉంటుంది.విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి చెందిన రవిశంకర్‌ రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతన వస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయన వద్ద ఉన్నాయి.

    Setti Jagadeesh, News 18, Visakhaptnam

    ఆ ఇంట్లో అడుగుపెడితే ఏదో మ్యూజియంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. మనం స్విచ్‌ వేయకుండానే.. లైట్‌ వెలుగుతుంది. యాప్‌ ద్వారా అలెక్సా.. బెడ్‌ రూమ్‌ స్విచ్‌ ఆన్‌ లైట్‌ అనగానే వెలుగుతుంది. అలెక్సా (Alexa).. స్విచ్‌ ఆన్‌ ఫ్యాన్‌ అనగానే ఫ్యాన్‌ తిరుగుతుంది. మూడంతస్తుల మేడ పైనుంచి అలెక్సా.. ఓపెన్‌ ద మెయిన్‌ గేట్‌ అనగానే వెంటనే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్‌ గేట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఇల్లంతా ఓ మాయాద్వీపంలా ఉంటుంది. విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి చెందిన రవిశంకర్‌ రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతన వస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరించారు రవి.

    రిమోట్‌ కంట్రోల్‌ డివైస్‌ తయారుచేసిన రవిశంకర్‌
    రవిశంకర్ చదివింది డిప్లమో అయినా తన మెదడుకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో ఓ డివైస్‌ను తయారుచేశారు. రిమోట్‌తో అర కిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేయోచ్చు. తన ఇంటి గేట్‌ను రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా ఆపరేట్‌ చేయడం, రిమోట్‌ లైట్‌ సిస్టమ్, జీరో పవర్‌ కన్జంప్షన్‌ ( zero power consumption)తో ఆటోమేటిక్‌ ఓవర్‌ హెడ్, డబుల్‌ షీటర్‌ సైకిల్‌ వంటివి సృష్టించారు. ఇలాంటి మరెన్నో వినూత్నమైన వస్తువులను రవిశంకర్‌రెడ్డి రూపొందిస్తున్నారు.

    ఇది చదవండి: పేపర్ తో మ్యాజిక్ చేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా.. క్రియేటివిటీతో కేకపుట్టిస్తున్న చిన్నారులు


    ఆనాటి బైక్‌ల, నాణేల సేకరణ
    1957 నుంచి 27 ద్విచక్రవాహనాలు జావా, లాంబ్రెట్టా, మినీ రాజ్‌దూత్, ఏజీడీ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ 50 ఏళ్లు పురస్కరించుకున్న సందర్భంగా 2018లో కోల్‌కతా మింట్‌ విడుదల చేసిన రూ.50 మొదటి కాయిన్‌ను రూ.3,560కు బుక్‌ చేసుకుని పొందారు. ఆ తర్వాత రూ.500 కాయిన్‌ సంపాదించారు. మూడేళ్ల కిందట రూ.200 నాణెం సేకరించారు. రెండేళ్ల కిందట రూ.1000 నాణెం సొంతం చేసుకున్నారు.

    ఇది చదవండి: మన ఇండియా గొప్పతనం అదే.. అందుకే ఈమె సప్తసముద్రాలు దాటి వచ్చేసింది..!


    గతంలో రూ.10, రూ.20, రూ.100, రూ. 150.. వంటి కాయిన్లను సేకరించారు. నాలుగు నెలల కిందట రూ.75, రూ.350, రూ.550 నాణాలు సేకరించిన రవిశంకర్‌రెడ్డి.. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని ముంబాయి మింట్‌ విడుదల చేసిన రూ.250 కాయిన్‌ను సొంతం చేసుకున్నారు. రూ.4,390కు ఈ కాయిన్‌ను కొనుగోలు చేశారు. 40 గ్రాముల సిల్వర్‌తో కూడిన ఆ కాయిన్‌ ఇటీవల ఆయన చెంతకు చేరింది.

    ఇది చదవండి: తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!


    అతిపెద్ద క్రేన్‌ల నమూనా
    1990లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వంద మీటర్ల ఎత్తు, 32 టన్నుల బరువును ఉపయోగించి రెండు అతిపెద్ద క్రేన్‌ నమూనాలు, ఎలక్ట్రిక్‌ ఓవర్‌ హెడ్‌ ట్రావెల్‌ క్రేన్, రష్యన్‌ క్రేన్‌ తయారు చేశారు. ఈ రెండు క్రేన్‌లను మ్యూజియంకు అందజేశారు.

    ఇది చదవండి: హాట్ సమ్మర్లో ఇక్కడికి వెళ్తే కూల్ అవుతారు.. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు



    అధునాతన సైకిళ్లు రూపొందిస్తున్న రవిశంకర్‌
    తన మేధాశక్తితో అధునాతనంగా సైకిళ్లు రూపొందిస్తున్నారు. యునీ సైకిల్, డ్యూయల్‌ సైకిల్, కోస్టర్‌ బ్రేక్, రెట్రా డ్రైవ్, సైడ్‌ వేస్, బైసింపిల్‌(చెయిన్‌ లెస్‌) తదితర మోడళ్లను తయారు చేశారు. గతేడాది రెట్రా డ్రైవ్‌ సైకిల్‌ను రూపొందించారు. ఇండియాలోనే తొలి సైకిల్‌ ఇది అని రవిశంకర్‌ అంటున్నారు. ముందుకు తొక్కితే డబుల్‌ స్పీడ్‌తో వెళ్తుందని, వెనక్కి తొక్కితే సింగిల్‌ స్పీడ్‌తో నడుస్తుందని చెప్పారు. వ్యాయామం చేసేందుకు ఈ సైకిల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

    ఇది చదవండి: మీరు వైజాగ్ వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! అధికారుల కీలక నిర్ణయం


    బ్యాక్‌వర్డ్స్‌ బ్రెయిన్‌ సైకిల్‌
    రవిశంకర్‌రెడ్డి తాజాగా బ్యాక్‌వర్డ్స్‌ బ్రెయిన్‌ సైకిల్‌ను రూపొందించారు. హ్యాండిల్‌ ఎడమ వైపు తిప్పితే టైర్‌ కుడి వైపు, హ్యాండిల్‌ కుడి వైపు తిప్పితే టైర్‌ ఎడమవైపు వెళ్తుంది. ఈ సైకిల్‌ నడిపేవారు రెగ్యులర్‌ సైకిల్‌ నడపలేరన్నారు. ఈ సైకిల్‌ రూపొందించేందుకు 2 నెలల సమయం పట్టిందని, రూ.8,500 ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా తానే రూపొందించానని చెప్పారు. దీని పేటెంట్స్‌ కోసం దరఖాస్తు చేయలేదని, చూడడానికి మామూలు సైకిల్‌గానే కనిపిస్తుందన్నారు. బుర్రపెట్టి నడపాలంటున్నారు.

    Vizag Kancharapalem Street

    ఎలా వెళ్లాలి..?
    అడ్రస్‌: రెడ్డి కంచరపాలెం వీధి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ - 530008. వైజాగ్‌ బస్టాండ్‌ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. నేరుగా ఆటోలో వెళ్లొచ్చు. రైల్వేస్టేషన్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి కూడా లోకల్‌ ఆటోలు అందుబాటులో ఉంటాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు