హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

APSRTC: దసరా సెలవులకు పయనమవుతున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌..!

APSRTC: దసరా సెలవులకు పయనమవుతున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌..!

ప్రయాణికులకు

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

విశాఖ ప్రజలకు ఏపీఎస్‌ఆర్టీసీ( APSRTC) శుభవార్త చెప్పింది. దసరా నేపథ్యంలో విశాఖ నుంచి 520 ప్రత్యేక బస్సులు తిప్పనున్నట్లు డి.పి.టి.ఒ అప్పలరాజు తెలిపారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) ప్రజలకు ఏపీఎస్‌ఆర్టీసీ( APSRTC) శుభవార్త చెప్పింది. దసరా నేపథ్యంలో విశాఖ నుంచి 520 ప్రత్యేక బస్సులు తిప్పనున్నట్లు డి.పి.టి. ఒ అప్పలరాజు తెలిపారు. గతంలో ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేవాళ్లమని ఈ దసరాకి ఎటువంటి అదనపు చార్జీలు లేవని తెలిపారు. ప్రతి ఏటా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. టికెట్ తీసుకునే ప్రతిసారి అధికారులను చెడామెడా తిడుతుంటారు. అయితే ఈ దసరాకి అలాంటి ఇబ్బంది ఏమి లేదు. ప్రత్యేక బస్సులలో అదనపు చార్జీలు లేకుండా చేశామని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

  పిల్లలకి 10రోజుల వరకు స్కూల్‌కి సెలవలు రావడంతో కుటుంబసభ్యులంతా కలిసి ప్రయాణాలు చేస్తుంటారు..దీంతో అధికంగా రద్దీ అవుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 520 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు విశాఖలో ప్రజా రవాణా శాఖ రీజియన్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ (Hyderabad)‌, కాకినాడ (Kakinada), రాజమండ్రి (Rajahmundry), విజయవాడ (Vijayawada) వంటి దూర ప్రాంతాలకు నడిచే సర్వీస్‌లలో సీట్లు ఇప్పటికే ఈ నెల 29 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు కూడా అన్ని రిజర్వు అయిపోయాయి. ఇవే కాకుండా ప్రయాణికుల రద్దీని బట్టి రీజియన్‌ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబరు నాలుగో తేదీ వరకు 280 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  విశాఖ నుంచి హైదరాబాద్‌కు 40, రాజమండ్రికి 50, కాకినాడకు 20, విజయవాడకు 70,ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, విజయనగరం , బొబ్బిలి, సాలూరు ప్రాంతాలకు కలిపి మరో 100 ప్రత్యేక సర్వీసులు పెట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  విజయదశమి తరువాత కూడా అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 240 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్.టి.సి అధికారులు తెలిపారు. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 20, విజయవాడకు 100, కాకినాడ 20, రాజమండ్రి 50, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, విజయనగరం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాలకు కలిపి 50 ప్రత్యేక సర్వీసులు అధికారులు ఆపరేట్‌ చేయాలని నిర్ణయించారు.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  విశాఖలో అన్ని డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేస్తున్నట్లు విశాఖపట్నం డి.పి.టి.ఒ రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు తెలిపారు. అయితే దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏ రూట్‌లో అయినా ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా వుంటే ఆ రూట్‌లో ప్రత్యేక బస్సుల సర్వీస్‌ సంఖ్య పెంచుతామని చెప్పారు.

  ఆ క్రమంలో డిమాండ్‌ లేని రూట్లలో కాస్త సర్వీసుల సంఖ్య తగ్గిస్తామని తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ ఆధారంగా రాత్రివేళల్లో అయినా బస్సులు ఆపరేట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని..అంతేకాని ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అప్పలరాజు స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు