Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THIS BUILDING HAS WILL GENERATE POWER AS OWNER FIXED SOLAR POWER PANELS TO ALL SIDES OF THE BUILDING IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన వ్యాపారి ఐడియా..! అందరి చూపు అతనివైపే..!

విశాఖలో

విశాఖలో ఆకట్టుకుంటున్న సోలార్ భవనం

దేశవ్యాప్తంగా కరెంటు కొరత (Power Crisis) అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రజలను వేధిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు (Power Cuts) విధిస్తుంటే... మరికొన్ని రాష్ట్రాల్లో కరెంటు బిల్లులు భారీగా పెంచేస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల చూపు సోలార్‌ వైపు మళ్లుతోంది.

ఇంకా చదవండి ...
  Neelima Eaty, News18, Visakhapatnam

  దేశవ్యాప్తంగా కరెంటు కొరత (Power Crisis) అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రజలను వేధిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు (Power Cuts) విధిస్తుంటే... మరికొన్ని రాష్ట్రాల్లో కరెంటు బిల్లులు భారీగా పెంచేస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల చూపు సోలార్‌ వైపు మళ్లుతోంది. కొందరు ప్రజలు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కోసం చిన్నపాటి సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది తమ పెంట్‌హౌస్‌లు, టెర్రస్‌ల మీద సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటుచే సి కరెంట్‌ బిల్లుల నుంచి తప్పించుకుంటున్నారు. స్వకార్యం స్వామికార్యం అన్నట్లు.. అటు తమ ఇంటికి, ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఇదే బాటలో నడుస్తున్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లోని గురుద్వారా జంక్షన్ వద్ద ఓ హోటల్‌ వ్యాపారి నారాయణరావు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  ఈ బిల్డింగ్ ఒక గెస్ట్ హౌస్ మరియు హోటల్. దీని పేరు నమో ఇన్స్పైర్ ద స్మార్ట్ ఇన్ గెస్ట్ హౌస్ (Namo Inspire The Smart INN). బిల్డింగ్ మొత్తం సోలార్ ప్యానెల్స్ తో ఏర్పాటు చేయడమే దీని ప్రత్యేకత. స్మార్ట్‌ ఇన్‌ ది గెస్ట్‌ హౌస్‌.. పేరుతో నారాయణరావు అలియాస్‌ బాబ్జి స్టార్ట్ చేసిన హోటల్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దూరం నుంచి చూస్తుంటే ఈ హోటల్‌ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ఎలివేషన్‌ల కోసం బ్లాక్‌ ఫ్రేమ్‌ అద్దాలకు బదులు..ఈ సోలార్‌ ప్యానెళ్లను బిగించడం వల్ల మొదట్లో కాస్త ఖర్చు ఎక్కువైనా.. తర్వాత లైఫ్‌ టైమ్‌ అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది.

  ఇది చదవండి: వైజాగ్ లో బెస్ట్ షాపింగ్ స్పాట్ ఇదే.. అక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు..


  రోజుకు 100మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి..!
  ఈ సోలార్‌ హోటల్‌ని వందశాతం గ్రీన్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దాలని నారాయణరావు ఆలోచించి దాన్ని పూర్తిగా సోలార్ ప్యానెల్స్ తో కప్పారు. రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఈ సోలార్‌ ప్యానల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఐదంతస్తుల భవనం కింది అంతస్తు నుంచి పై వరకు చుట్టూ ఉన్న ఈ సోలార్ ఫ్యానల్స్‌ వల్ల రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ హోటల్‌ నిర్వహణకు రోజుకు 40 నుంచి 50 కిలో వాట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతుంది. దీంతో మిగిలిన విద్యుత్‌ను సదరు వ్యాపారి గ్రిడ్‌కు అమ్ముతున్నారు.

  ఇది చదవండి: 150ఏళ్ల నాటి అస్థిపంజరం.. దశాబ్దాల నాటి జంతువులు.. అక్కడికెళ్తే ఆశ్చర్యపోతారు.


  ఆరేళ్లలో పెట్టుబడి వెనక్కి..!
  సాధారణంగా ఏ బిల్డింగ్‌కు అయినా ఐదు వైపులా ( ముందు వెనక, రెండు పక్కల, పైన) ఓపెన్‌ ప్లేస్‌ ఉంటుంది. ఈ బిల్డింగ్‌కు నారాయణరావు మూడు వైపులా సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటుచేశారు. త్వరలో రూఫ్ టాప్ పైన సోలార్ ప్యానల్ ఫిక్స్ చేస్తానంటున్నారు. మొత్తంగా 250 ప్యానెల్స్‌ని ఫిక్స్ చేశారు.
  ఈ సోలార్‌ ప్యానెల్స్‌ కోసం 15 లక్షల వరకు ఖర్చు అయిందంటున్నారు నారాయణరావు. అయితే ఈ మొత్తం పెట్టుబడి తనకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో వచ్చేస్తుందని.. ఆ తర్వాత లైఫ్‌ టైమ్‌ ఫ్రీ కరెంట్‌తో పాటు ఆదాయం వస్తుందంటున్నారు హోటల్‌ యజమాని.

  ఇది చదవండి: అన్నిదేశాల చేపలు ఒకే చోట.. ఔరా అనిపిస్తున్న విశాఖ వాసి


  పర్యావరణాన్ని రక్షించేందుకే ఈ చిన్న ప్రయత్నం
  అందరిలాగే నేను కూడా అద్దాలు పెడితే ప్రత్యేకత ఏముంటుంది.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది నా చిన్న ప్రయత్నం అని నారాయణ రావు గారు అలియాస్ బాబ్జీ గారు న్యూస్‌ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఐడియా వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని నారాయణరావు తెలిపారు.

  ఇది చదవండి: స్కేటింగ్‌ నేర్చుకోవాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్‌..! అక్కడ కోచింగ్ ఫ్రీ.. వివరాలివే..!


  నారాయణరావు ఆలోచనకు మెచ్చి... ఆదర్శంగా తీసుకుని మరికొందరు కమర్షియల్ బిల్డింగ్స్ ను సోలార్ ప్యానల్స్ తో నిర్మిస్తే మరింత ఎనర్జీని సేవ్ చేయొచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు వాళ్లకు వచ్చే రెగ్యులర్‌ కరెంట్‌ బిల్లుల భారం తగ్గుతుంది. మీరు మీ ఇంటికి కానీ, కమర్షియల్‌ బిల్డింగ్‌లకు కానీ సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే ASJ SOLAR ENERGY Pvt Ltd ని సంప్రదించండి. వాళ్ల బ్రాంచ్‌లు హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, భీమవరం, కాకినాడలోనూ ఉన్నాయి.

  ఫోన్‌ నెంబర్‌ : 9000710319
  ఈమెయిల్‌ ఐడీ : Info@asjsolarenergy.com
  వెబ్‌సైట్‌ : www.asjsolarenergy.com
  సోలార్‌ హోటల్‌ అడ్రస్‌: స్మార్ట్‌ ఇన్‌ ది గెస్ట్‌ హౌస్‌, గురుద్వారా జంక్షన్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ -530013.

  Smart Inn Guest House Visakhapatnam

  ఎలా వెళ్లాలి..?
  ఈ సోలార్ ప్యానెల్స్ బిల్డింగ్ గురుద్వారా జంక్షన్ నుండి క్లియర్‌గా కనపడుతుంది. విశాఖపట్నం బస్టాండ్‌ నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉంటుంది. గురుద్వారా జంక్షన్‌ నుంచి NRI హాస్పిటల్‌కు వెళ్లే దారిలో ఎడమవైపు ఈ హోటల్‌ కనిపిస్తుంది. వైజాగ్‌ బస్టాండ్‌ నుంచి 38 నంబర్‌ బస్సు ఎక్కితే ఈ గురుద్వారా జంక్షన్ దగర దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తొచ్చు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Solar, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు