హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌లే అతని టార్గెట్‌..! ఉదయం రెక్కి చేస్తాడు..రాత్రికి దోచేస్తాడు..!

Vizag: అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌లే అతని టార్గెట్‌..! ఉదయం రెక్కి చేస్తాడు..రాత్రికి దోచేస్తాడు..!

 అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌లే అతని టార్గెట్‌..!

అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌లే అతని టార్గెట్‌..!

జల్సాలకు అలవాటు పడిన యువకుడు తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఊరి చివరన ఉండే అపార్ట్‌మెంట్‌లలో పనిచేసే వాచ్‌మెన్‌లను టార్గెట్‌ చేశాడు. ఉదయం రెక్కి చేసి..రాత్రికి ఆ ఇంట్లోకి వెళ్లి కేవలం బంగారు ఆభరణాలను మాత్రమే కాజేస్తాడు..!

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti jagadesh,  News 18, Vizag


  Vizag; అనేక మంది యువకులు యుక్త వయస్సులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. చెడు అలవాట్లకులోనై సరిపడా డబ్బు లేకపోవడంతో క్షణికావేశంలో ఎంతకైనా తెగిస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులోనే నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. ఫలితంగా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలా జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేస్తున్న ఒక వ్యక్తిని విశాఖపట్నంలోని (visakapatnam) న్యూపోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 8 కేసులకు సంబంధించి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌ కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా, తెల్లవారేసరికి వాచ్‌మెన్‌ భార్య లక్ష్మీ మెడలోని పుస్తెలతాడు కనిపించలేదు. వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


  ఇలా ఈ ఒక్కటే కాదు, పలు రకాల చైన్‌ స్నాచింగ్‌ కేసులు పోలీసుల దృష్టికి వచ్చాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గాజువాకలోని పలు లాడ్జీలను తనిఖీ చేశారు.
  పెదగంట్యాడకు చెందిన కె.మణిలోకేష్ అనే వ్యక్తి మూడు నెలలుగా లాడ్జిలో బసచేసి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై ప్రత్యేక నిఘా పెట్టారు.


  Read this also ; Vijayawada: సోషల్ మీడియాలో పరిచయం.. మహిళకు వేధింపులు.. వైసీపీ నేతపై ఆరోపణలు.. అసలు స్టోరీ ఇదే..!


  కె. మణి లోకేష్ ఐ.టి.ఐ. పూర్తి చేసి, కొంతకాలం విద్యుత్తు మీటర్ బిల్లుల తీసే బాయ్‌గా పనిచేశాడు. అయితే జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం బంగారు గొలుసులు దొంగతనం చేయటం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


  విశాఖపట్నంలో నిర్మానుష్యమైన అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌లను టార్గెట్‌ చేశాడు. దొంగతనానికి ముందు రోజు ఆ ప్రాంతంలో రెక్కి చేస్తాడు. ఆ అపార్టుమెంట్‌లలో వాచ్‌మెన్‌ గదిలో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తాడు. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి… అక్కడ నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసును వైర్ కట్టర్‌తో కట్ చేసి దొంగతనం చేసేవాడు. ఇంట్లో ఎవరూ లేకపోతే, బీరువాలు పరిశీలించి కేవలం బంగారు ఆభరణాలను మాత్రమే దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


  Read this also ; Vizag: సారా రహిత జిల్లాగా అనకాపల్లి..! వేల లీటర్ల నాటుసారా ధ్వంసం చేసిన పోలీసులు!


  అలా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ఎవరికి అనుమానం రాకుండా.. తనకు డబ్బులు అర్జెంట్‌ అని..బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు ఇమ్మని తీసుకునేవాడు. ఇలా తాను దొంగతనం చేసిన గొలుసులను ఇతరులతో తాకట్టు పెట్టించి డబ్బు తీసుకునేవాడు.  Read this also ; Vizag: తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నారా..? బీకేర్ ఫుల్ అంటున్న వాకర్స్..? అక్కడ ఏం జరుగుతోంది?


  మణిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. న్యూ పోర్టు స్టేషన్‌ పరిధిలో 6 , దువ్వాడ, గాజువాక పరిధిలో 1 చొప్పున మొత్తం 8 కేసుల్లో మణికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 6.5 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, బైక్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Chain snatching, Crime news, Gold robbery, Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు