హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntagalagara Leaf: ఈ ఆకు వాడితే జుట్టు పెరగడం ఖాయం..ఆయుర్వేద నిపుణుల సలహా ఏమిటంటే..? 

Guntagalagara Leaf: ఈ ఆకు వాడితే జుట్టు పెరగడం ఖాయం..ఆయుర్వేద నిపుణుల సలహా ఏమిటంటే..? 

guntagalagaraku

guntagalagaraku

ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

గుంటగలగర మొక్కలు నీటి ఒడ్డున, పంట పొలాల గట్లపైన ఎక్కడపడితే అక్కడ వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతాయి. భూమిపైన ఒకటి నుండి రెండడుగుల ఎత్తు వరకు పెరుగుతూ వీటి కాండం, కొమ్మలపైన తెల్లని నూగు ఉంటుంది.ధీర్ఘకాల వ్యాధులకు దివ్యౌషథం:ఇది కారము, చేదు రుచులతో, ఉష్ణస్వభావంతో రసాయనసిద్ధిని కలిగించే అమృతగుణం కలిగి ఉండటంవల్ల అన్నిరకాల కఫ, వాత రోగాలను నివారిస్తుంది.

గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలికమైన తలనొప్పి, తలబరువు, మెదడు బలహీనత, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు నివారించబడతాయి. ఈ ఒక్క మొక్కను పెంచుకుని ఆకులు మాత్రమే వాడుకుంటూ నూనె తయారు చేసుకుని వాడుకుంటే కేశాలు పొడవుగా, దృఢంగా ఉంటాయి. విత్తనం సేకరించుకోవడం సులభం. స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకుని గుంటగలగర ఆకుల మిశ్రమతో నూనె తయారు చేసుకుని వాడుకుంటమే ఉత్తమం.

ఇక గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి, నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకొని ఐదు నుండి పదినిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత, నాలుకపూత, నాలుకపై పగుళ్ళు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి. వయసును బట్టి ఐదు నుండి పది గ్రాములు ఆకుల్ని తీసుకొని, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి. దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా భోజనానికి గంట ముందు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం తగ్గుతాయి.

ఇక చర్మవ్యాధులకుచక్కని మందుగా గుంటగలగర ఆకు పనిచేస్తుంది. ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి. లేదా గుంటగలగర వేళ్లు, వేళ్ళ పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపుకొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటేచర్మవ్యాధులు తగ్గుతాయి.

అలాగే మట్టి మూకుడులో శుభ్రంచేసిన వాము (ఓమ) వేసి అది మునిగే వరకూ గుంటగలగర ఆకుల రసం పోసి, రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఆ పాత్రను ఎండలో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే సాయంత్రానికి రసమంతా గింజలలోకి ఇంకి పోతుంది. దీన్ని బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఆ గింజల్ని పొడి చేసి, జల్లెడపట్టి నిల్వ చేసుకోవాలి. కప్పు మంచినీటిలో పావుచెంచా పొడి వేసి, బాగా కలిపి రెండుపూటలా భోజనానికి గంట ముందుగా తాగాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల పైథ్యం, ఉద్రేకం తగ్గుతాయి. అందుకు కారణమైన కాలే యము (లివర్‌) సహజస్థితికి చేరుతుంది. అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్ళు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదా లు పగలడం మొదలైన సమస్యలన్నీ తగ్గుతాయి.

లివర్ సమస్యలకు కూడా పనిచేస్తుంది ఈ ఆకు. గుంటగలగర ఆకులు, కొమ్మలు కడిగి, దంచి వడపోసిన రసం రోజూ రెండుపూటలా భోజనానికి గంట ముందుగా పావుకప్పు చొప్పున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయ వాపు, ప్లీహ వాపు తగ్గి పోతాయి. దీనివల్ల రక్తం శుద్ధవుతుంది. వృద్ధి కూడా చెందుతుంది. చర్మ రోగాలు, మలబద్ధకం, నపుంసకత్వం మొదలైన వ్యాధులూ సమసిపోతాయి. కుష్టురోగం కూడా సంవత్సర కాలంలో పూర్తిగా తగ్గు తుంది. అయితే కుష్టు వ్యాధిగ్రస్తులు ఆవు పాలతో మాత్రమే తీసుకోవాలి. పైన తెలిపిన విధంగా గుంటగలగర ఆకుల రసం రెండుపూటలా మూడు, నాలుగు చుక్కల మోతాదులో ముక్కులలో వేసి పీలుస్తూ ఉంటే ముక్కుల నుండి చెడిపోయిన కఫం నీటిలాగా కారిపోయి, శ్వాస క్రమబద్ధమై, శ్వాస సంబంధ రోగాలు తగ్గుతాయి.

కంటికి సంబంధించిన వ్యాధులకు పచ్చి ఆకులను దంచి తీసిన రసం బట్టలో వడకట్టి ఒకటి లేక రెండు చుక్కలు రెండుపూటలా కళ్ళల్లో వేస్తుంటే కండ్లకలకలు, దానివల్ల ఏర్పడిన మంటలు, నొప్పులు, ఎరుపుదనం రెండు, మూడు రోజుల్లో తగ్గుతాయి. ఆకులను కొంచెం నీటితో కలిపి, దంచాలి. అలా వచ్చిన రసాన్ని వడపోయాలి. ఈ ఆకులు పావుకప్పు తీసుకొని అందులో మూడు చిటికెలు ఉప్పు, దోరగా వేయించిన మిరియాల పొడి, రెండు చెంచాల నిమ్మరసం కలిపి రెండుపూటలా భోజనానికి గంట ముందు తాగితే రెండు, మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది.

దేహ పటుత్వానికి కూడా గుంటగలగర మొక్కలను దంచి తీసిన రసం ఒక నూలుబట్టలో వడపోసి దీనిని పావుకప్పు నుండి అరకప్పు మోతాదుగా తాగాలి. ఆ వెంటనే ఒక కప్పు ఆవుపాలల్లో చెంచా పటికబెల్లం పొడి కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు తీసుకుంటే నెలరోజుల్లోనే అనూహ్యమైన దేహదారుఢ్యం కలుగుతుంది. ఇలా ఎన్నో వ్యాధులను అతి సులువుగా నివారించ గల ఔషధశక్తి ఈ మొక్కల్లో ఉండటంవల్ల గుంట గలగరను పచ్చడి, పప్పు, వేపుడు, తాలింపుకూర మొదలైన వెరైటీలు తయారుచేసుకొని తింటారు.

First published:

Tags: Hair fall, Health Tips, Local News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు