Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THERE ARE 4 MORE TIGERS IN ANDHRA PRADESH AS OFFICIALS SEARCHING FOR BENGAL TIGER IN ANAKAPALLE DISTRICT FULL DETAILS HERE PRN VSP

Tigers in AP: ఒకటికాదు నాలుగు పులులు.. ఏపీలో హడలెత్తిస్తున్న టైగర్స్.. లేటెస్ట్ అప్ డేట్ ఇదే..!

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దాదాపు నెలన్నరగా పెద్ద పులి (Tiger) కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తొలుత కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలంలో కనిపించిన రాయల్ బెంగాల్ టైగర్ ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) ను హడలెత్తిస్తోంది.

ఇంకా చదవండి ...
    P Anand Mohan, News18, Visakhapatnam

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దాదాపు నెలన్నరగా పెద్ద పులి (Tiger) కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తొలుత కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలంలో కనిపించిన రాయల్ బెంగాల్ టైగర్ ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) ను హడలెత్తిస్తోంది. ప్రస్తుతం పులి గ్రామాల్లోకి రావడం పశువులను వేటాడుతుండటంతో జనం హడలిపోతున్నారు. పలి భయంతో ఇంకా కొన్ని గ్రామాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. పులి కోసం అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అది మాత్రం చిక్కడం లేదు. ఐతే తాజాగా ఏపీలో దాదాపు నాలుగైదు పులులు ఉండవచ్చని అదీ పాపికొండల అడవుల్లో పులిజాడలున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఐతే ప్రస్తుతం తిరుగుతున్న పులి పాపికొండలు ఫారెస్ట్ నుంచి వచ్చినదా లేక ఒడిశా వైపు నుంచి వచ్చిందా అనేది మాత్రం అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

    పులులు సహజంగా 3 లేదా 4 ఏళ్ల వయసులో అడవిని వదిలిపెట్టి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాయని, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న పులి కూడా అలాగే వచ్చి ఉంటుందని తెలిపారు జిల్లా అటవీశాఖ అధికారులు. పులి పాద ముద్రలను గమనిస్తే దాని వయసు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాలుగేళ్ల వయసున్న పులి.. అడవినుంచి సుదూర ప్రాంతాలకు రావడం సహజం అంటున్నారు. పాపికొండల సమీపంలోని పార్క్‌ లో నాలుగైదు పులులు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. అయితే జిల్లాకు వచ్చిన పులి అక్కడినుంచే వచ్చిందా, లేక వేరే ప్రాంతం నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. పులి రోజుకు 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని అంచనా. పులి ప్రయాణం ఎక్కువగా రాత్రుళ్లు ఉంటుంది. రాత్రి పూట.. ఎక్కువగా బయట సంచరిస్తుంది. పగటిపూట సురక్షితంగా ఉన్న ప్రాంతంలో అలాగే ఉండిపోయుంది. అయితే ఇప్పుడు ఉన్న పులి ఎటునుంచి వచ్చిందో చెప్పగలం గానీ, ఎటు వెళ్తుందో కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.


    ఇది చదవండి: ప్రేమ వ్యవహారం లేదు.. పని ఒత్తిడి లేదు.. యువతి ఆత్మహత్యకు కారణం తెలిసి షాకైన పోలీసులు..


    ఎరవేసి పులిని పట్టుకోవడానికి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయత్నించామని, కానీ అది అక్కడి బోనులోకి రాకుండా ఎరను చూసి వెళ్లిపోయిందన్నారు. పులి చాలా తెలివైన జంతువని, అది అంత దొందరగా ఎరకు చిక్కదని, అదే సమయంలో దాడి చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. పులి క్రూర జంతువు కావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో రెండురోజుల్లో పులి విశాఖ రేంజిలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఆయా గ్రామాల సర్పంచ్ లకు సమాచారం ఇచ్చామని, విశాఖ జూ నుంచి వెటర్నరీ డాక్టర్‌ ను కూడా రప్పించి పులిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అయితే విజయనగరం జిల్లాలో తిరుగుతున్న పులి, ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఉన్న పులి ఒకటి కాదంటున్నారు అధికారులు. అదే సమయంలో పులిని పట్టుకొని భయాందోళనలు తగ్గిస్తామని అంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tiger, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు