ప్రకృతిలో లభించే కొన్ని చెట్ల ఆకులు, కొన్ని పూలు, మరికొన్ని చెట్టు బెరడ్లు కూడా ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతి ఒడిలో ..చుట్టూ చెట్లు ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా అన్నీ చెట్ల సంగతి పక్కనపెడితే ముఖ్యంగా యూకలిప్టస్ చెట్టు వైద్యపరంగా ఎంతగానో మేలు చేస్తుంది. మళ్లీ మళ్లీ పీల్చాలనిపించే సువాస నీలగిరి సొంతం. ఈ చెట్టు ఆకుల నుంచి తయారయ్యే తైలాన్ని యూకలిప్టస్ ఆయిల్(Eucalyptus oil), జామాయిల్, లేదంటే నీలగిరి తైలం అంటారు. ముఖ్యంగా ఇవి నీలగిరి కొండల్లో పెరగడం వల్లే ఈ చెట్టు ఆకుల నుంచి తీసే తైలాన్ని నీలగిరి తైలంగా పిలుస్తారు. ఈ నీలగిరి తైలం(Nilgiri oil)లో ఎలాంటి ఔషద గుణాలు ఉన్నాయి...ఎలాంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందో తెలియాలంటే ఈస్టోరీ చదవాలి.
నీలగిరి తైలంలో ఔషద గుణాలు..
మళ్లీ మళ్లీ పీల్చాలనిపించే సువాస నీలగిరి సొంతం. నీలగిరి, జామాయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇలా రకరకాల పేర్లతో ఈ తైలాన్ని పిలుస్తారు. ఈ నూనె మంచి ఔషధంగా పనిచేస్తుంది. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు ఆ పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జండుబామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది. జిందా తిలిస్మాత్, జండూబామ్, టైగర్ బామ్, అమృతాంజన్, విక్స్ వంటి వాటిలో నీలగిరి తైలాన్ని ఉపయోగిస్తారు. అలాగే మందుల తయారీలో, సుగంధ ద్రవ్యాల తయారీలో, పారిశ్రామికంగా ఈ నూనెను ఉపయోగిస్తారు. జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఈ నీలగిరి తైలం చెక్ పెడుతుంది.
ఆరోగ్యానికి 25రకాల ప్రయోజనాలు..
నీలగిరి తైలంలో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. యూకలిప్టస్ చెట్టులో పలురకాలు వున్నాయి. నీలగిరి తైలాన్నిఎక్కువగా యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆకుల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ నూనెను నేరుగా తక్కువ పరిమాణంలో కడులోకి తీసుకుంటే ప్రమాదమేమి లేదు. కానీ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడి, ఆజీర్తి చేస్తుంది. మోతాదులో వాడితే సుమారు 25రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
ఎక్కువ వాడితే ప్రమాదమే..
ఈ నీలగిరి తైలాన్ని ఎలా వాడాలి..ఎలా ఉపయోగిస్తే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయో చూద్దాం. ఈ తైలాన్ని వాసన చూడడం, పలుచగా రాసుకోవడం వల్ల జలుబుతో ఇబ్బంది పడే వాళ్లకు ఇట్టే ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు 2చుక్కల నీలగిరి తైలాన్ని నీటిలో వేసుకొని ఆ ఆవిరిని పీల్చితే జలుబు, ముక్కు దిబ్బడ మాయమైపోతాయి. ఈ నీలగిరి తైలాన్ని ఔషధంగా తాగినా ఛాతీ మీద తరచూ మర్దనా చేసినా ప్రాణాంతకమైన శ్వాస సంబంధిత సమస్యలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయి. తలలో చుండ్రు, పేను సమస్యలకు ఇబ్బంది పడే వాళ్లకు కూడా ఇదో చక్కని ఔషధంగా పని చేస్తుంది. జామాయిల్‌ని విడిగా లేదంటే కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తల్నానం చేస్తే చుండ్రు, పేల సమస్యలు తొలగిపోతాయి. పైగా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. ముఖ్యంగా చర్మ,ఎలర్జీకి సంబంధించినటువంటి దురద, చిరాకును కూడా ఈ నీలగిరి తైలం దరిచేరనివ్వదు.
నీలగిరి ఆరోగ్యలహరి..
నీలగిరి తైలాన్ని ఔషదంగా తీసుకుటే సైనస్, అలర్జీలు కూడా మాయమవుతాయి. ఈ నూనె యాంటీ మైక్రోబయల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక నిరభ్యంతరంగా అన్నీ రకాల గాయాలకు, పుళ్ళకు లేపనంగా వాడవచ్చు. క్రిమికీటకాలు కాటు వేసిన గాయాలకైనా నొప్పి నివారణగా పనిచేయడంతో పాటు త్వరగా తగ్గిపోయేలా చేస్తుంది. ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనానికి స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు ఈ జామాయిల్‌ని వేసి స్నానం చేస్తే హాయిగా వుంటుంది. ఇక ప్రతి ఒక్కరిని బాధించే తలనొప్పికి జామాయిల్ చక్కని పరిష్కారమార్గం చూపిస్తుంది. నీలగిరి తైలాన్ని నుదుటికి పట్టిస్తే, నొప్పి తగ్గిపోతుంది. నీలగిరి తైలాన్ని సన్నని క్లాత్‌మీద వేసి వాసన చూస్తుంటే జలుబు, గొంతునొప్పి తగ్గిపోతుంది.
మోకాళ్ల నొప్పులకు తైలంతో చెక్..
మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే నీలగిరి ఆయిల్‌తో మసాజ్ చేసి, వేడినీటితో కాపడం పెట్టాలి. మడమ నొప్పి వచ్చి నడవలేకపోతుంటే ఆ ప్రాంతంలో నీలగిరి తైలంతో బాగా మసాజ్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. ఒళ్ళు నొప్పులుగా ఉంటే స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి స్నానం చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయి. గోరువెచ్చని నీటిలో 3-4 చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి తాగితే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి. ఇక దంతాల సమస్యకు ఈ నీలగిరి తైలం బాగా పనికొస్తుంది. పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలిప్టస్ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని వేడినీటిలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితే నొప్పి తగ్గుతుంది.
దంతాల సమస్యలు దూరం..
నీలగిరి తైలం వాడటం కారణంగా జలుబు, నొప్పులతో పాటుగా చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు. మొటిమల సమస్యతో బాధపడేవారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి తక్కువ సమయంలోనే మొటిమల సమస్య తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇతర మచ్చలు కూడా పోతాయి. దుస్తులు ఉతికేటప్పుడు కొద్దిగా నీలగిరి తైలం వేసి వాటిని ఉతకాలి. దీంతో దుస్తులకు పట్టి ఉండే ఫంగస్, ఇతర క్రిములు నశిస్తాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు కవర్లు తదితర ఇతర వస్త్రాలపై కూడా నీలగిరి తైలం చల్లుతుంటే అవి సువాసన వస్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్‌కు చక్కని మెడిసిన్..
నిత్యం ఆహారంలో నీలగిరి తైలం చేర్చి తీసుకోవడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నీలగిరి తైలంలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో తేలిందని అంటున్నారు. దంతాలు తోముకునే పేస్టులో యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తళతళా మెరుస్తాయి. నీలగిరి తైలం విరేచనాల సమస్యతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. పొట్టపై కొద్దిగా ఈ ఆయిల్‌ను రాయాలి. కొద్దిసేపటికే సునాయాసంగా నొప్పి తగ్గిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.