Home /News /andhra-pradesh /

Robbery: తుఫాన్ భయంతో ఊరంతా నిర్మానుష్యం.. ఇదే అదునుగా పనికానిచ్చిన దొంగలు..

Robbery: తుఫాన్ భయంతో ఊరంతా నిర్మానుష్యం.. ఇదే అదునుగా పనికానిచ్చిన దొంగలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

జొవాద్ తుఫాన్ (Cyclone Jawad) రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరాన్ని వణికించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసులు ఎక్కడికక్కడ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. తుఫాన్ కు బయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దొంగలు దీన్నే తమకు అనువుగా మార్చుకున్నారు.

ఇంకా చదవండి ...
    P. Bhanu Prasad, Vizianagaram, News18

    జొవాద్ తుఫాన్ (Cyclone Jawad) రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరాన్ని వణికించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసులు ఎక్కడికక్కడ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. తుఫాన్ కు బయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు తమ వ్యాపారాలు బంద్ చేసి ఇంటిదగ్గరే ఉన్నారు. దీంతో ఇదే అదనుగా చూసుకొని దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్సో లోనూ, జ్యూయలరీ షాపుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ.. వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తుఫాన్ హెచ్చరికను అదనుగా చేసకొని దొంగలు రెచ్చిపోతున్నారు. జ్యూయలరీ షాపులు, షాపింగ్ మాల్స్ ను కొల్లగొడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు రెండు భారీ చోరీలకు పాల్పడ్డారు.

    రణస్థలం మండల కేంద్రంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న పది షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. ఓవైపు తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షం కురుస్తుండడంతో.. వ్యాపారులు శుక్రవారం సాయంత్రమే తమ వ్యాపారాలు మూసేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక సముద్ర తీర ప్రాంత మండలాల్లో తుఫాన్ సహాయ చర్యల్లో పోలీసులు ఉండడంతో.. గస్తీ తక్కువగా ఉంటుందని ముందే గ్రహించిన దుండగులు.. శుక్రవారం అర్ధరాత్రి ఈ చోరీకి పాల్పడ్డారు. షాపులకున్న షర్టర్లు ఎత్తి పది షాపుల్లో చోరీలకు పాల్పడడమే కాక, సీసీ కెమెరాలు ఉండడం చూసి ఎటువంటి ఆధారాలు లేకుండా.. సీసీ ఫుటేజ్ లను తమతో పాటు తీసుకువెళ్లారు.

    ఇది చదవండి: విశాఖలో కలకలం.., ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి.. కారణం ఇదేనా..?


    ఇక ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు.. తమ షాపుల్లో చోరీలు జరిగాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మందస మండలం హరిపురం గ్రామంలో కూడా మరో చోరీ జరిగింది. రాఘవ జ్యూయలరీ షాపులో చోరీకి పాల్పడి.. సుమారు రెండు లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక్కడ కూడా ఉదయం షాపు తెరవడానికి వచ్చిన షాపు యజమాని ఇప్పలి రాఘవ చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఇది చదవండి: స్కూల్లోనే మందుకొట్టిన స్టూడెంట్స్.. లంచ్ బ్రేక్ లో సిట్టింగ్.. విద్యార్థి చెప్పిన సమాధానానికి అంతా షాక్..


    పోలీసుల గస్తీ లేని సమయంలో .. ఈ చోరీలు జరిగాయని, తుఫాను కారణంగా సహాయ చర్యల్లో ఉన్న సమయంలో ఈ చోరీలు జరగాయంటూ పోలీసులు అంటున్నారు. దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

    మీ నగరం నుండి (విశాఖపట్నం)

    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నం
    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నం
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Srikakulam, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు