Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THEFT IN SIMAHACHALAM CHANDANOTSAVAM ONE THEFT CUT SI WIFE BANG AND STOLEN GOLD ORNAMENTS NGS VSP

Simchachalam Temple: అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వెళ్తే.. ఎస్ఐ భార్య బ్యాగ్ కొట్టేసిన ఘనుడు

చందనోత్సవంలో దొంగల హల్ చల్

చందనోత్సవంలో దొంగల హల్ చల్

Simchachalam Temple: సందంట్లో సడేమియా అంటే ఇదే.. సింహాచలంలోని అప్పన్న స్వామి నిజరూపం దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనేది భక్తుల నమ్మకం. అలా వచ్చిన ఓ భక్తురాలు.. అది కూడా ఎస్ఐ భార్య బ్యాగ్ ను కట్ చేశాడు ఓ దొంగ.. ఆ బ్యాగ్ లో భారీగా బంగారు అభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Simchachalam Temple: సందట్లో సడేమియా అంటే.. ఇదేనేమో.. విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం (Simhachalam)లోని సింహాద్రి అప్పన్న స్వామి (Simhadrai Appanna Swamy) నిజరూప దర్శనం కొనసాగుతోంది.  ఈ నిజ  దర్శనాన్ని ఒక్కసారి చూస్తే చాలు జీవితకాలం పుణ్యం వస్తుందని.. కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయని.. భక్తుల నమ్మకం. అందుకే ఒక్కసారైన స్వామివారి నిజదర్శనం చేసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. అలాగే ఓ మహిళ.. ఆమె తూర్పుగోదావరికి చెందిన ఎస్ఐ భార్య. ఆమె సైతం స్వామి వారి నిజరూప దర్శనం కోసం వచ్చారు. ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ఆభరణలు మెడలో ఉంచుకోకండి దొంగలు ఉంటారు.. జాగ్రత్తగా చూసుకొండి.. నగలు తీసి బ్యాగ్ లో పెట్టాయాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మహిళ నిజమే కాదా అని ఆభరణాలు తీసి బ్యాగ్ లో పెట్టుకుంది. తరువాత స్వామి వారిని దర్శించుకోవాలని ఉత్సాహంతో ముందుకు అడుగులు వేశారు. కానీ ఇంతంలో ఆమె బ్యాగ్ ను కట్ చేసి.. బంగారునగలను (Gold ornaments) దోచుకుపోయాడు దొంగ. తరువాత విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    సాధారణంగా జనాలు ఎక్కువగా ఉన్న చోట దొంగలకు చేతినిండా పని ఉంటుంది. అందుకే జాగ్రత్తలు అవసరం.. కానీ కొందరు మోస పోతునే ఉన్నారు. దొంగల హల్ చల్ సంగతి ఎలా ఉన్నా..? సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనాలు మంగళవారం ఉదయం నుంచే కొనసాగుతున్నాయి. వైశాఖ శుద్ధ తదియలో వేకువజాము నుంచి అప్పన్న నిజరూపంలో దర్సనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న అశోకగజపతి రాజుకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి నిజరూపం దర్శనం కోసం వందల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

    ఇదీ చదవండి : ప్రశాంతంగా.. ఆహ్లాదంగా ఉన్న ప్రాంతమని అటు వెళ్తున్నారా..? ఒంటరిగా వెళ్తే అంతే.. ప్రాణాలకే ప్రమాదం

    అలాగే ఏపీ రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్ నాథ్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, స్పీకర్ తమ్మినేని సీతరామ్..మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా సింహాచల నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

    ఇదీ చదవండి : మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోటి 80 లక్షలు గుంజాడు, ప్రియురాలి కోరిక కోసం.. ఏం చేశాడో తెలుసా?

    అలాగే శారదా పీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర స్వామి సైతం చందనోత్సవంలో పాల్గొన్నారు. వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు స్వరూపానందేంద్ర. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదన్నారు స్వరూపానందేంద్ర. రెండేళ్ల తర్వాత జరుగుతున్న చందనోత్సవానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Visakhapatnam

    తదుపరి వార్తలు