Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THE PEOPLE WHO HAVE INTEREST IN MUSIC CAN LEARN WITHOUT ANY KNOWLDGE FROM RAMAKRISHNA MISSION VIZAG NGS VNL NJ

Vizag: సంగీతంలో సరిగమలు తెలియకపోయినా.. ఇంట్లో కూర్చుని మ్యూజిక్‌ నేర్చుకునే అవకాశం.. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి

ఇంటిదగ్గర

ఇంటిదగ్గర కూర్చొని మ్యూజిక్ నేర్చుకునే అవకాశం

Vizag: మీకు సంగీతం అంటే ఇష్టమా..? సరిగమలు కూడా రావు.. సంగీతం ఎలా నేర్చుకోవాలని భయపడుతున్నారా..? మీలాంటి వాళ్ల కోసమే రామకృష్ణ మిషన్‌ ఓ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరైనా సరే.. ఇంట్లో కూర్చునే సంగీతం నేర్చుకోవచ్చు.

  Neelima Eaty, News18 Visakhapatnam

  Vizag: సంగీతం (Music) అంటే  మీకు మహా ఇష్టమా.. మంచి సింగర్ లా పాటలు పాడాలి.. అందరి ముందు మీ గొంతు వినిపించాలి అని ఉందా..  కానీ సంగీతంలో ఓనామాలు కూడా తెలియకుండా ఎలా అని మదనపడుతున్నారా..? మీకు జస్ట్ సంగీతం నేర్చుకోవాలని (Music Learning) తపన ఉంటే చాలు. మీలాంటి వాళ్లకోసమే రామకృష్ణ మిషన్‌ (Ramakrishna Mission) ఓ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. అది కూడా ఇంటి గడప దాటకుండానే.. మీ రోజు వారి పనులు పక్కన పెట్టడకుండానే ఖాళీ సమయంలో సంగీతం నేర్చుకోవచ్చు.. అది కూడా అతి సులువుగా.. రామకృష్ణ మిషన్‌ కు మంచి చరిత్రే ఉంది. శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడైన స్వామి శివానందజీ (మహాపురుష్ మహారాజ్) వైజాగ్‌ నగరాన్ని సందర్శించి, 1924లో కొన్ని రోజులు ఇక్కడే ఉండి.. భవిష్యత్తులో ఇక్కడ పని చేయడానికి పునాది వేశారు. ఆర్కేబీచ్‌ (RK Beach) కు సమీపంలో 1938లో రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ప్రత్యేక కోర్సులు నేర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ ఏడాదిలో చాలా కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. వాటిలో ఒకటి సంగీతం.
  ఈ మిషన్‌ ఆధ్వర్యంలో నేర్పించే సంగీతం కోర్సులో కర్ణాటక వోకల్స్ లెవెల్ 1, లెవెల్ 2,  హిందుస్థాన్ సంగీతం లెవెల్ 1, లెవెల్ 2 నేర్పించనున్నారు.
  సంగీతంలో సరిగమలు తెలియనివాళ్లకు కూడా నేర్పిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా 8 సంవత్సరాలు నుండి 70 సంవత్సరాలు వాళ్లు కూడా ఈ కోర్సులో జాయిన్ అవచ్చు. సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే చాలు. ఇప్పటి వరకు సంగీతం నెరవేర్చుకునే ఛాన్స్ రానివాళ్లకి ఇది ఒక గొప్ప అవకాశం. తమ సంగీత కలని నెరవేర్చుకోవచ్చు.. వాళ్లు కూడా అద్భుతంగా పాటలు పాడొచ్చు.

  సంగీతం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. సంగీతం నేర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఏకాగ్రత, క్రమ శిక్షణ, జ్ఞాపకశక్తి పెరుగుతుందని   అన్నారు. సంగీతం నేర్చుకోవడం ఒక ఆనందం, ఆ మధురానుభూతిని ఇక్కడ మీరు ఆస్వాదించవచ్చు. వివేక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో చాలా కోర్సుల కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అతి తక్కువ ధరలకే మీరు ఎన్నో కోర్స్ లు నీ నేర్చుకొని జాబ్ కూడా సంపాదించవచ్చు అని స్వామి అధిస్వరనంద తెలిపారు. త్వరలో ఎయిర్ కండిషన్డ్, మల్టీమీడియా క్లాస్‌రూమ్‌లు లో క్లాస్ లు నిర్వహిస్తామన్నారు. పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని… మొదట వచ్చిన వారికే తొలి ప్రాధాన్యమన్నారు. త్వరపడండి… మీ పేరు నమోదు చేసుకోండి. కంగారు పడొద్దు….రిజిస్ట్రేషన్‌కి ఎలాంటి ధరలను చెలించనవసరం లేదు.

  ఇదీ చదవండి : ఆ భక్తులకు గుడ్ న్యూస్.. ఇక కొండపైనే రూ.300 దర్శన టికెట్లు.. ఎలా పొందాలి అంటే..?

  రిజిస్ట్రేషన్‌ ఎలా?
  ఈ కోర్సులను మీరు ప్రపంచంలో ఏ నలుమూలల ఉన్నా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఆఫ్లైన్ మరి యు ఆన్లైన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడి నుండైనా చేరవచ్చు. ఇక్కడ ఉన్న గూగుల్ ఫారమ్ లింక్‌ని క్లిక్ చేసి మి వివరాలను నింపి సబ్‌మిట్‌ చేస్తే చాలు రిజిస్ట్రార్ అయిపోయినట్టే.

  ఇదిగోండి లింక్: https://bit.ly/3ip0Sgk

  మీరు ఒక్కసారి రిజిస్ట్రర్‌ చేసుకున్న తర్వాత…క్లాసెస్‌ ఎప్పుడు మొదలుపెడతారు ఏంటి అని దానికి సంబంధించిన అన్ని డిటైల్స్‌ మీ ఫోన్‌కు సమాచారం అందుతుంది.

  ఇదీ చదవండి : మానవత్వం అంటే ఇదే కదా.. అనాథ కోసం గ్రామం అంతా చేయి చేయి కలిపింది

  ఫీజు: ఆఫ్‌లైన్‌ మరియు ఆన్‌లైన్‌ రెండింటికి రూ.750

  వివేక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో మరిన్ని కోర్సులు
  1. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ యోగా & మెడిటేషన్- పురుషుల కోసం మరియు మహిళలు
  2. కంప్యూటర్ లెర్నింగ్ 3-నెలల కోర్సులు (ఆఫ్‌లైన్ మాత్రమే)
  a) DCA (డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్)
  b) TALLY-GST c). DTP, ఫోటోషాప్ & తెలుగు d) వెబ్ డిజైనింగ్
  3. స్పోకెన్‌ ఇంగ్లీష్ & కమ్యూనికేషన్ కోర్సు (వారానికి 3 రోజులు) (ఆఫ్‌లైన్ మాత్రమే)
  4. సంస్కృత కోర్సులు (ఆఫ్‌లైన్ మాత్రమే)
  5. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ కర్నాటిక్ వోకల్ మ్యూజిక్ లెవెల్-1 (( 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారికి 3 నెలల ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్.))
  6. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ కర్నాటిక్ వోకల్ మ్యూజిక్ లెవెల్-2
  7. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ హిందుస్తానీ వోకల్ మ్యూజిక్ లెవెల్-1
  8. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ హిందుస్తానీ వోకల్ మ్యూజిక్ లెవెల్-2
  9. పాఠశాల పిల్లల కోసం ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ వివేకానంద బాల వికాస్‌లో శిక్షణ పొందుతారు: యోగా & మెడిటేషన్, ఇంటెలిజెంట్ గేమ్‌లు, కళ, క్రాఫ్ట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, స్మృతి & కేంద్రీకరణ, చైతన్యం & కేంద్రీకరణ, . (పాఠశాల పిల్లల కోసం మొత్తం వ్యక్తిత్వ వికాస కార్యక్రమం)
  10. ETC మరియు భజనలు & శ్లోకం... 3 నెలల ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్ 16 నుండి 40 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలు & బాలికల కోసం. ప్రతి ఆదివారం. 4.00 pm-5.30 pm IST

  ఇదీ చదవండి : ఆహ్లాదకర వాతావరణంలో టెట్‌కు ప్రిపరేషన్.. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. ఎలా చేయాలంటే?

  వెబ్‌సైట్‌ : మరిన్ని వివరాల కోసం https://rkmissionvizag.org/vie/ ను సందర్శించండి.
  ఫోన్‌ నెంబర్‌ : 9703306562, 8801304408, 9866993250, 9182215134.
  సంప్రదించాల్సిన టైమింగ్స్‌ : ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ఆదివారం సెలవు.
  అడ్రస్: రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం, RK బీచ్, విశాఖపట్నం-530003, Ph: 0891-3551477


  ఎలా వెళ్లాలి?
  బస్టాండ్‌ నుంచి ఆటోలు , క్యాబ్‌లు అక్కడకు వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను నుంచి అక్కడకు వెళ్లొచ్చు. విమానమార్గం ద్వారా అయినా వైజాగ్‌కు వచ్చి..అక్కడ నుంచి డైరక్ట్‌గా క్యాబ్‌ మాట్లాడుకుంటే ఆర్కేబీచ్‌ రోడ్డులోని రామకృష్ణమిషన్‌కు ఈజీగా వెళ్లొచ్చు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు