Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM THE FIRST BIO DIVERSITY PARK IN VISHAKAPATNAM WHICH HAS ALL THE SPECIES OF PLANTS ACROSS THE GLOBE FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: ఆటోగ్రాఫ్‌.. మిక్కీమౌస్‌.. ఫస్ట్‌ లవ్‌.. ఇవన్నీ మొక్కల పేర్లే సుమీ..! కావాలంటే మీరే చూడండి..!

మొక్కలు

మొక్కలు కీటకాలను తినడం చూస్తుంటాం.. కానీ కీటకాలనే తినే కాండం మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా...! ఆ మొక్క ఆకు మీద మనం గోరుతో రాస్తే.. తరాల తరబడి అంతే ఉంటుందని మీకు తెలుసా..? ఇలా అక్కడ ఒక్కో మొక్క ఒక్కో అద్భుతం..? ఈ ప్రకృతి ప్రపంచంలోకి వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న పెద్ద వాల్తేర్‌కు వెళ్లాల్సిందే..!

మొక్కలు కీటకాలను తినడం చూస్తుంటాం.. కానీ కీటకాలనే తినే కాండం మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా...! ఆ మొక్క ఆకు మీద మనం గోరుతో రాస్తే.. తరాల తరబడి అంతే ఉంటుందని మీకు తెలుసా..? ఇలా అక్కడ ఒక్కో మొక్క ఒక్కో అద్భుతం..? ఈ ప్రకృతి ప్రపంచంలోకి వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న పెద్ద వాల్తేర్‌కు వెళ్లాల్సిందే..!

ఇంకా చదవండి ...
  Neelima Eaty, News18, Visakhapatnam

  మొక్కలు కీటకాలను తినడం చూస్తుంటాం.. కానీ కీటకాలనే తినే కాండం మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా...! ఆ మొక్క ఆకు మీద మనం గోరుతో రాస్తే.. తరాల తరబడి అంతే ఉంటుందని మీకు తెలుసా..? ఇలా అక్కడ ఒక్కో మొక్క ఒక్కో అద్భుతం..? ఈ ప్రకృతి ప్రపంచంలోకి వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న పెద్ద వాల్తేర్‌కు వెళ్లాల్సిందే..! పెద్దవాల్తేర్‌లోని బయోడైవర్సిటీ పార్క్.. విశాఖపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (VUDA) మరియు డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేటివ్‌ సొసైటీ వాలంటీర్స్‌ సహాయంతో నిర్వహించబడుతున్న విద్యా వృక్ష ఉద్యానవనం. ఇందులో 2000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు, వందలాది సీతాకోకచిలుక మరియు పక్షి జాతులు ఉన్నాయి. విద్య మరియు పరిశోధన ప్రయోజనాల కోసం ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.

  డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ ..?
  డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అనేది నమోదిత, స్వచ్ఛంద, పర్యావరణ అనుకూల సంస్థ. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, విద్య మరియు అవగాహన కోసం కట్టుబడి ఉంటుంది.నగరంలో చాలా తక్కువ మందికి తెలిసిన ఈ ఉద్యాన వనాన్ని మార్చి 5, 2001న ప్రారంభించారు. ఈబయో డైవర్సిటీ పార్క్ వ్యవస్థాపకులు - డా. ఎం. రామ మూర్తి , వారి శ్రీమతి. ఎం. మంగతాయి.

  ఇది చదవండి: వైజాగ్ వెళ్తే ఇక్కడికి వెళ్లడం అస్సలు మర్చిపోవద్దు.. ఫుడ్ లవర్స్ కి ఇదే బెస్ట్ ఛాయిస్


  పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల్లో వుడా పాత్ర
  వుడా(VUDA) అనేక ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. చెట్ల పెంపకం మరియు వన్యప్రాణుల సంరక్షణ, విశాఖపట్నం బీచ్లోని అంతర రాతి తీర జంతుజాలం , వృక్షజాలంపై పరిశోధన మరియు అవగాహన కార్యకలాపాలు, ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు, పాములు, జూ జంతువులు మరియు సన్నని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. అంతేకాదు విశాఖపట్నం జిల్లాలో సీతాకోకచిలుకలు మరియు పక్షులపై పరిశోధన సర్వేలు చేపట్టడం లాంటి ఎన్నో పరిరక్షణ కార్యక్రమాలుచేపట్టారు.

  ఇది చదవండి: విశాఖకే తలమానికం ఆ ప్రాంతం.. కానీ ఇప్పుడు శిథిలావస్థలో..


  మూడు ఎకరాల విస్తీర్ణంలో బయోడైవర్సిటీ పార్కు
  వుడా, డీసీఎన్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెదవాల్టైర్ లోని రాణి చంద్రమని దేవి ఆస్పత్రి పరిసరాలను 5 జూన్, 2002న దత్తత తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఎంతో అందంగా, ఆహ్లాదకరమైన బయో డైవర్సిటీ పార్క్గా మార్చారు.ఈ పార్క్ 3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ RCD బయో-డైవర్సిటీ పార్క్ 70 జాతుల పక్షులు మరియు 100 జాతుల సీతాకోకచిలుకలతో 2000 కంటే ఎక్కువ జాతుల మొక్కలతో అద్భుతమైన ఉద్యానవనంగా మారింది. 2002లో జీవీకే కాలేజీ జువాలజీ ఫ్రొపెసర్‌..తమ విద్యార్థులతో కలిసి ఇక్కడ 100 రకాల మొక్కలను నాటారు. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 2000 దాటింది. అందులో ఫూల జాతికి చెందినవి కొన్ని అయితే, 500 వరకు మెడిసినల్‌ ప్లాంట్స్ ఉన్నాయి.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  నేచర్‌ లవర్స్‌కు అడ్డా..!
  ఎన్నో రకాల మొక్కలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ బయోడైవర్సిటీ పార్క్‌లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలున్నాయి. వాటిలో ఒకటే ఫస్ట్ లవ్ లేదా గోల్డెన్ పెండా (క్శాంతోస్టెమోన్ క్రిసాంతస్, ఫ్యామిలీ: మైర్టేసి)..

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!  ఓచ్నా సెర్రులాట / మిక్కి మౌస్‌ ట్రీ
  సాధారణంగా చిన్న-ఆకులతో కూడిన విమానం, కార్నివాల్ ఓచ్నా, బర్డ్స్ ఐ బుష్, మిక్కీ మౌస్ ప్లాంట్ లేదా మిక్కీ మౌస్ బుష్ అని పిలుస్తారు, ఇది మొక్క యొక్క పండిన బ్లాక్‌ఫ్రూట్ కారణంగా తలక్రిందులుగా మిక్కీ మౌస్ చెవులను మరియు ప్రకాశవంతమైన-ఎరుపు సీపల్స్‌ను పోలి ఉంటుంది. అతని ప్యాంటును పోలి ఉంటుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓచ్నేసి కుటుంబానికి చెందిన ఒక అలంకారమైన తోట మొక్క. ఇది దక్షిణ ఆఫ్రికా తోటలలో నాటబడింది మరియు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో ఒక ఆక్రమణ జాతికి చెందింది.

  ఇది చదవండి: మన ఇండియా గొప్పతనం అదే.. అందుకే ఈమె సప్తసముద్రాలు దాటి వచ్చేసింది..!  ఆటోగ్రాఫ్/వాలెంటైన్స్/లవర్స్ మొక్క
  ఈ మొక్క శాస్త్రీయ నామం: Clusia rosea, కుటుంబం; క్లూసియేసి. ఈ చెట్టు ఆకులు విశాలంగా, ముదురు ఆకుపచ్చ రంగుంలో ఉంటాయి. ఈ ఆకులపై గోళ్లతో రాయవచ్చు. మనం రాసినవి దాదాపు ఎనిమేళ్ల వరకు అలానే ఉంటాయి. ఇలా ఒకటా రెండా…ఎన్నో ప్రత్యేకమైన మొక్కలు ఈ పార్కులో ఉన్నాయి. L.K.G నుండి P.G వరకు వందలాది మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్‌, అవగాహన, పరిశోధనలకు ఈ పార్క్ కేంద్రంగా మారింది. ఇది ఇప్పుడు మొదటి ఎక్స్-సిటు బయోడైవర్సిటీ పార్క్గా గుర్తింపు పొందింది.

  ఇది చదవండి: తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!  ప్రకృతి సేవలో 2 దశాబ్దాలు గడిపిన దంపతులు
  ఈ బయోడైవర్సిటీ పార్క్‌ 'ప్రకృతి సేవలో 2 దశాబ్దాలు' పూర్తి చేసుకుంది. 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని రామమూర్తి దంపతులు చెబుతున్నారు. ఇక్కడ వేరు వేరు జిల్లాలకు చెందినవి, తూర్పు కనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ పార్క్‌లో ఉన్న ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ మొక్క ఏ జాతికి చెందినది దాని బొటానికల్‌ పేరు ఏంటి..అన్ని వివరాలు మొక్క దగ్గర ఉన్న బోర్డుమీద రాసి ఉంటాయి.

  ఇది చదవండి: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!


  ఈ పార్క్‌ చూడాలనుకున్న వాళ్లు ఎవ్వరైనా ఇక్కడకు వెళ్లొచ్చు. ఎవ్వరికైనా ఈ నర్సెరీ వెల్‌కమ్‌ చెబుతుంది. మీకేమైనా సందేహాలున్నా వాళ్లు తీరుస్తారు. త్వరలో నర్సరీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో మనం కూడా మనకు కావల్సిన మొక్కలను తెచ్చుకోవచ్చు. నేరుగా చూడలేని వాళ్లు ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా చూడొచ్చు.

  అడ్రస్‌: ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ, పెద్ద వాల్తేర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ -530017
  ఫోన్‌ నెంబర్‌ : +91 94414 65510

  Visakhapatnam Dolphin Conservative Society Map

  ఎలా వెళ్లాలి..?
  విశాఖ బస్టాండ్‌ నుంచి ప్రైవేట్‌ క్యాబ్‌, లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. రైలు మార్గం ద్వారా అయితే దగ్గరలో విశాఖ రైల్వేస్టేషన్‌ ఉంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  తదుపరి వార్తలు