హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

విశాఖలో

విశాఖలో ఫేమస్ అవుతున్న చికెన్ షవర్మా

చికెన్‌ (Chicken) ను రుమాలి రోటీలో వేసుకొని తింటే ఆ కిక్కే వేరు అంటున్నారు ఫుడ్‌లవర్స్‌. ముఖ్యంగా యువత ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ను విపరీతంగా ఇష్టపడటంతో.. విశాఖపట్నం (Visakhapatnam) లో చికెన్ షవర్మా (Chicken Sawarma) ఫేమస్ అయిపోయింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  షవర్మా (Shawarma) ఈ పేరు వింటే చాలు నోరూరు పోయే నాన్‌వేజ్‌ ప్రియులెందరో..! చికెన్‌ (Chicken) ను రుమాలి రోటీలో వేసుకొని తింటే ఆ కిక్కే వేరు అంటున్నారు ఫుడ్‌లవర్స్‌. ముఖ్యంగా యువత ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ను విపరీతంగా ఇష్టపడటంతో.. విశాఖపట్నం (Visakhapatnam) లో చికెన్ షవర్మా (Chicken Sawarma) ఫేమస్ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ అంటే విశాఖ నగర వాసులకు అమితమైన ఇష్టం. సాయంత్రం అయితే చాలు కొత్త కొత్త రుచులు ఆస్వాదించేందుకు ప్రజలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ల వైపు క్యూ కడుతుంటారు. యువత అయితే ఇంకా ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్‌ షవర్మ లాంటి ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు.

  నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్ ఇంత ఫేమస్ అవడానికి కారణం వాటి రుచి… తక్కువ సమయంలో ఎక్కువ రుచికరమైన వంటకం తినేందుకు మన ప్లేట్‌లోకి వస్తుండటంతో నగరవాసులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ స్పెషల్‌ వంటకాలు మన దగ్గర యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో చికెన్ షవర్మా ఒకటి. విశాఖలోనే అనేక చోట్ల ఈ చికెన్‌ షవర్మ దొరుకుతుంది. వేడివేడి మంటలలో చికెన్ తిరుగుతూ ఉంటే విశాఖవాసులు లొట్టలు వేసుకొని మరి తింటున్నారు.

  ఇది చదవండి: ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

  సాయంత్రం అయితే చాలు విశాఖ బీచ్ రోడ్డుకు , ఓల్డ్ జైలు రోడ్డుకు వచ్చే జనాల్లో ఎక్కువగా ఈ షవర్మనే తినడం అలవాటైపోయింది. ఇక శని, ఆదివారాలు అయితే అస్సలు ఖాళీ ఉండదు. కొత్త రకం టేస్ట్ చూపించే ఈ షవర్మాకు ఆహార ప్రేమికులు చాలామంది ఉన్నారు. కొత్త టేస్టీతో ఎక్కువ క్యాలరీలు వచ్చే ఈ ఫుడ్ తినడానికి యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

  ఇది చదవండి: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుకు ప్రాణం పోసిన శిల్పి..! రాజసం ఉట్టిపడేలా విగ్రహ తయారీ..!

  చికెన్‌ షవర్మా ఎలా తయారుచేస్తారంటే..!

  ఒక పాత్రలో చికెన్‌ తీసుకొని మంచిగా వేడి నీళ్ళతో కడిగి పెరుగు, వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కర్రీపౌడర్‌, దాల్చిన చెక్క పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు గంటల పాటు పక్కన పెడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ ఇనుము రాడ్డుకి ఈ చికెన్ అంతా గుచ్చి , దాని వెనక మంట పెడతారు. బాగా కాలిన చికెన్‌ను పదునైన కత్తితో చెక్కుతూ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  ఇప్పుడు రుమాల్‌ రోటీని తీసుకుని మధ్యలో చికెన్‌ ముక్కలు, కట్‌ చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రోల్‌ చేయాలి. మరొక పాత్రలో పెరుగు, నిమ్మరసం, తాహిని, ఉప్పు, వెల్లుల్లిపేస్టు వేసి బాగా కలిపి సాస్‌ తయారుచేసుకోవాలి అంతే వేడి వేడిగా టేస్టీగా చికెన్ షవర్మ రెడీ అయిపోతుంది. కలర్ ఫుల్‌గా కనిపించే ఈ చికెన్ షవర్మ తినేందుకు నగరవాసులు ఎందుకంతలా క్యూ కడుతున్నారో తెలియాలంటే దీన్ని ఒక్కసారి రుచి చూడాల్సిందే..!

  ఫోన్‌ నెంబర్‌: 6361804544

  అడ్రస్: ఓల్డ్‌ జైల్‌ రోడ్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530020.

  Vizag Food Court map

  ఎలా వెళ్లాలి..?

  విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర , సెంట్రల్ పార్క్ వెనుక , ఓల్డ్ జైల్ రోడ్‌లో ఉంది. నడిచి వెళ్లేందుకు వీలైనంత దూరంలో ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు