హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag news: పదో తరగతి ఫెయిల్‌ అయినా... జీవితంలో సక్సెస్‌ అయ్యాడు..! ఎలా సక్సెస్ అయ్యాడంటే?

Vizag news: పదో తరగతి ఫెయిల్‌ అయినా... జీవితంలో సక్సెస్‌ అయ్యాడు..! ఎలా సక్సెస్ అయ్యాడంటే?

X
పదో

పదో తరగతి ఫెయిల్..కానీ లైఫ్ లో సక్సెస్‌..!

Vizag successful man: అతనికి పెద్దగా చదువబ్బలేదు.. కానీ కుకింగ్‌ మీద ఇష్టంతో హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్‌లలో పనిచేశాడు. దాదాపు 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవంతో..తానే సొంతంగా రెస్టారెంట్ పెట్టాలనుకున్నాడు. తన సొంత ఊరిలో తనపేరుతోనే రెస్టారెంట్‌ పెట్టి సక్సెస్‌ అయ్యాడు.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News 18, Visakhaptnam

Successful man in Vizag:  ఆహార రంగంలో ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా.. ఎవరి అవకాశాలు వారివే.. ఎవరి ఆదాయం వారిదే. రుచికరమైన ఆహారం, చక్కని ఆతిథ్యం అందిస్తే చాలు.. కొత్తవారినైనా భోజన ప్రియులు (Food Lovers) ఆదరిస్తుంటారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి రెస్టారెంట్‌ బిజినెస్‌ (Restaurant Business ) లో అడుగుపెట్టి సక్సెస్‌ అయ్యాడు నర్సీపట్నం (Narsipatnam) కుర్రాడు. చదువుకోలేకపోయామని బాధపడకుండా.. నచ్చిన రంగంలో వ్యాపారం పెట్టుకొని జీవితంలో సక్సెస్‌ అవొచ్చు అని చేసి చూపించాడు రాజేష్ (Rajesh).

లైఫ్‌లో సక్సెస్‌ అయిన వాళ్లంతా.. ఎన్నో కష్టాల ఒడిదుడుకులను దాటుకుంటూ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకున్న వారే. మనిషికి పట్టుదల ఉంటే.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. అనుకున్న లక్ష్యాన్ని సాదించవచ్చు అంటున్నాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన బి.రాజేష్. చిన్నతనం నుండి వంటలపై రాజేష్‌కు మక్కువ ఎక్కువ.

క్లాస్‌రూమ్‌ కన్నా కిచెన్‌లోనే ఎక్కువగా..!

చదువుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆరోతరగతి నుంచి హాస్టల్‌లో ఉండి చదువుకునే వాడు. ఆ సమయంలో క్లాస్‌లో కన్నా హాస్టల్‌లోని వంటగదిలోనే ఎక్కువగా ఉండేవాడు.. అక్కడ వంటమనిషితో పాటు వంటలు నేర్చుకునేవాడు. 10వ తరగతి మూడు సబ్జెక్టులతో ఫెయిల్ అయిన రాజేష్..ఇంక చదవు తన వాళ్ల కాదని 2007లో హైదరాబాదులో అడుగుపెట్టాడు. అక్కడ వెళ్లి అనేక రెస్టారెంట్లలో పనిచేస్తూ రకరకాల వంటకాలను నేర్చుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు రెస్టారెంట్లలో పనిచేస్తూ రుచికరమైన వంటకాలపై పట్టు సాధించాడు. ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టి మంచి స్థానానికి వెళ్లాలని పట్టుదలతో అన్నిరకాల వంటకాలు నేర్చుకుని నర్సీపట్నం వచ్చాడు..

ఇదీ చదవండి : అధికార పార్టీలో వెన్ను పోట్లతో నష్టం తప్పదు.. ఒకే వేదికపై ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ ఎవరు..?

పార్టనర్స్‌ మోసంతో మొదట్లో నష్టాలు

స్నేహితులు, సన్నిహితుల సహకారంతో రెస్టారెంట్‌ పెట్టాడు. కానీ పార్టనర్స్‌ మోసం చేయడంతో నష్టాలు చవి చూశాడు. అయినా నిరాశ చెందకుండా ధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాడు. ఒక పార్టనర్స్‌తో లాభం లేదనుకుని.. ఒక్కడే సొంతంగా కుటుంబ సభ్యుల సహకారంతో రూ. 25 లక్షల పెట్టుబడి పెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. రెస్టారెంట్‌కు పేరు పెట్టేటప్పుడు వేరేదేదో పెట్టడం ఎందుకని..తన పేరునే బ్రాండ్‌గా చేయాలనుకున్నాడు. అనుకున్నట్లే 2018లో రాజేష్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ని ప్రారంభించి... ప్రస్తుతం 50 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ సక్సెస్ సాధించాడు.

ఇదీ చదవండి : అక్కడ వైసీపీ నేతల మధ్య విబేధాలకు ఆయనే కారణమా..? రాజీనామాల పర్వం.. వెనుక మ్యాటర్ అదే!

స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఫ్యామిలీ ప్యాక్‌:                                                                                          ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ ప్యాక్ 450 రూపాయలుకి అందిస్తున్నాడు. ఈ రెస్టారెంట్ లో ఉలవ చారు బిర్యానీ ఫేమస్. అన్ని రకాల బిర్యానీలు, వెజ్‌, నాన్‌వేజ్‌, చైనీస్ స్పెషల్ మంచూరియా, న్యూడిల్స్‌, స్టార్టర్స్‌, సూప్‌లు.. ఇలా ఈ రెస్టారెంట్లలో కస్టమర్లకు అన్ని రకాల వెరైటీలను రుచిచూపిస్తున్నాడు. చుట్టుపక్కల ఫ్యామిలీలంతా పండగలకు, వీకెండ్స్‌కు రాజేష్‌ రెస్టారెంట్‌కు వస్తుంటారు. అక్కడ లోకల్‌లో ఎవ్వరిదైనా బర్త్‌డే పార్టీ ఉందంటే..కేరాఫ్‌ రాజేష్‌ రెస్టారెంట్ అంటుంటారు. ఇక్కడ ఫుడ్‌ను స్థానికులు అంతలా ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కలిసి ఫ్యామిలీ ప్యాక్‌ ఆర్డర్‌ ఇచ్చి మండి టైప్‌లో చూట్టూ కూర్చుని బిర్యానిని ఆరగిస్తారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది రక్షాబంధన్ ఎప్పుడు? ఏ సమయంలో రాఖీ కట్టడానికి మంచింది.. ఈ సారైనా అన్న జగన్ కు షర్మిల రాఖీ కడతారా?

జనాల మాటల కన్నా మన లక్ష్యం ముఖ్యం..!

రాజేష్‌ మాటల్లో…. గతంలో హోటల్లో పని చేస్తుంటే ఎంతోమంది చీప్‌గా చూస్తూ అనేక మాటలు అనేవారు…వెనక ఏదో ఒకటి మాట్లాడేవారు. కానీ అవన్నీ నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకునేవాడిని. హోటల్ ఫీల్డ్ అనేది ఎక్కడైనా జీవించడానికి.. వ్యాపారం చేయాలనుకునేవాళ్లకి మంచి అవకాశం. మన నైపుణ్యాన్ని బట్టి మంచి మంచి హోటల్స్‌లో పనిచేసిన, కొత్తగా ఓ రెస్టారెంట్ పెట్టుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందని అంటున్నారు.

ఇదీ చదవండి : అధికార వైసీపీతో చెడిందా..? సీఎం జగన్ కు మోహన్ బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారా?

నేడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు రాజేష్. సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలతో అందించడమే తన ధ్యేయం అంటున్నాడు. కష్టాలు చుట్టుముట్టినా.. ఆర్థిక పరిస్థితులు అనుకున్నట్టు అనుకూలించకపోయినా సరే.. ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతో.. వంట చేసే చెఫ్ నుండి ఓనర్‌గా ఎదిగిన రాజేష్‌ ప్రయాణం ఎందరికో ఆదర్శం.. యువకులు ఎవరైనా హోటల్ ఫీల్డ్ లోకి వచ్చి… బిజినెస్‌ చేయాలి అనుకుంటే తనును సంప్రదిస్తే తన దగ్గర ఉన్న ఆలోచనలు చెబుతానని..  ఏమైనా సలహాలు కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాననంటున్నాడు రాజేష్...


అడ్రస్‌ : రాజేష్‌ రెస్టారెంట్, ఇండియన్‌ బ్యాంక్‌ పక్కన, బంగారు రాజు కాంప్లెక్స్‌, నర్సిపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ - 531116

ఫోన్‌ నెంబర్‌ : 94913 34422

ఎలా వెళ్లాలి?

నర్సీపట్నం కాంప్లెక్స్ నుండి కేవలం నడిచివెళ్లేంత దూరంలోనే అంటే 200 మీటర్లు దూరంలో రాజేష్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. బంగార్రాజు సినిమా హాల్‌కి వెళ్ళే దారిలో మీకు కనిపిస్తుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Hotels, Local News, Vizag

ఉత్తమ కథలు