హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Encounter: ఏవోబిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. ఏం జరిగింది అంటే?

Encounter: ఏవోబిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. ఏం జరిగింది అంటే?

ఇద్దరు మావోయిస్టుల  మృతి

ఇద్దరు మావోయిస్టుల మృతి

Encounter: ఏజెన్సీ ప్రాంతం కాల్పుల శబ్ధంగా రణరంగంగా మారింది.. మావోయిస్టులు.. పోలీసుల మధ్య భీకర కాల్పుల శబ్ధాలతో గిరిజినలు భయంతో పరుగులు తీశారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

Encounter:  ఏజెన్సీ ఒక్కసారిగా అట్టుడికింది.. కాల్పుల మోతతో దద్దరిల్లింది... ఒక్కసారి కాల్పులు (Encounter) శబ్ధాలు భీకరంగా వినిపించడంలో చుట్టు పక్కల గిరిజనలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకి పోలీసులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)-  ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh)  సరిహద్దుల్లో ఉన్న కంకేర్ జిల్లా పరిధిలోని సిక్సోడ్ లోని మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో, 30.10. కంకేర్ 81వ కార్ప్స్, బిఎస్ఎఫ్ ల సంయుక్త బృందాన్ని కడ్మే, కద్రి, నవ్‌గెల్, అల్కన్హర్ గ్రామానికి పంపారు.      పోలీస్ స్టేషన్ సిక్సోడ్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కడ్మే జంగిల్‌లోని పశ్చిమ్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసు పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టులపై పోలీసు పార్టీ కాల్పులు జరపగా.. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.

కాల్పులు ముగియడంతో సంఘటన స్థలాన్ని గాలించగా ఇద్దరు పురుష మావోయిస్టు మృతదేహాలతో పాటు  పెద్ద మొత్తంలో మావోయిస్టు ఆయుధాలు-మందుగుండు సామగ్రి,పేలుడు పదార్థాలు క్యాంపింగ్ సామగ్రిని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

ఈ కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులు డివిసి దర్శన్ పెద్దా, పార్తాపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు,  నార్త్ బ్యూరో యాక్షన్  టీమ్ కమాండర్ జగేష్ సలాంగా గుర్తించారు.

ఇదీ చదవండి : రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా ఎందుకీ మౌనం.. ఓటును ఆయుధంగా చేయండంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు

మృతి చెందినమావోయిస్టులపై ప్రభుత్వం  ఇద్దరి పైనా చెరో 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ, దహనం లాంటి అనేక తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో మెటాబొడ్లి మైన్స్‌లో వాహనాలను తగులబెట్టడం, చార్‌గావ్ గ్రామంలో ఒక గ్రామస్థుడిని కాల్చిచంపిన ఘటనలో కూడా చనిపోయిన మావోయిస్టుల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు.

ఇదీ చదవండి : అమరావతి రైతులకు బిగ్ షాక్.. పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

అయితే చాలా కాలంగా ఏజెన్సీ ప్రాంతం చాలా ప్రశాంతంగానే ఉంది.. ఎక్కడా ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా కనిపించింది. ఈ మధ్య కాలంలో ఎదురుకాల్పులు జరగలేదు. దీంతో మావోయిస్టుల అలికిడి తగ్గింది అనుకున్నారు. అయితే గస్తీలో భాగంగా పోలీసులు ఉన్న చోట.. మెరుపు దాడికి మావోయిస్టులు దిగారని చెబుతున్నారు. వారి దాడిని తిప్పి కొట్టడానికి ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చిందని.. వారు కూడా తీవ్రంగా ప్రతిఘటించారని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకంటే?

అయితే ఇదంతా పథకం ప్రకారం చేసిన దాడే అంటూ మావోయిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ ఘటనకు తప్పక ప్రతీకారం ఉంటుందని.. పోలీసులు అలర్ట్ ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం.. మరోవైపు ఇప్పటికీ ఏవోబీలో  పరిస్థితి  ఉద్రిక్తంగానే ఉంది.. గాలింపు సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం ఉదయం కూడా గాలింపు చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Encounter, Maoist, Maoist attack

ఉత్తమ కథలు