(Setti.Jagadesh,News18,Visakapatnam)
నిత్యం శీతల వాతావరణానికి పేరెన్నికగన్న విశాఖ(Visaka)ఏజెన్సీలో ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. గత కొద్దిరోజుల వరకు అడపా దడపా కురిసిన వర్షాల వలన శీతాకాలం ముందుగానే మొదలయ్యింది.ఏజెన్సీలో సాయంత్రం నుంచే విపరీతంగా మంచు కురుస్తోంది. చలిగాలులు బాగా వీస్తుండడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు. పొగమంచుతో చింతపల్లి(Chintapalli), పాడేరు(Paderu), అరకు(Araku)అంతా కూడా మంచుదుప్పటిలా దర్శనం ఇస్తుంది.
మంచు దుప్పటి కప్పుకున్న మన్యం..
అందమైన ఆంధ్రా పల్లెల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలపు సాయంత్రాలు.. పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. చల్లటి మంచులో మన్యం రావడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు.
ఈ నెల 10 వరకూ ఏజెన్సీ లంబసింగిలో 17.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినప్పటికీ గడిచిన రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 14 న 15.5, 15న13, ఇప్పుడు ఏకంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. దీంతో జనం చలితో గజగజలాడుతున్నారు. ఇకపాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1, పాడేరులో 12, ఆంధ్రా ఊటీ అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెల్లవారి లెగవాలంటే గజగజ..
చలి గాలులు బాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు వీస్తున్నందున చలి పెరుగుతున్నట్లు వాతావరణశాఖ వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.నిన్న మొన్నటి వరకు 20 డిగ్రీలకుపైగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు నేటి నుండి 8 డిగ్రీలకు తక్కువగా నమోదుఅవుతుండడంతో మన్యం వాసులు దయనందిన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పిల్లలు, వృద్దులు, స్వాములకు ఇబ్బంది..
అదేవిధంగా అయ్యప్ప మాల ధారణ భక్తులు సైతం పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగినందువలన వృద్ధులు, చిన్నారులు పాఠశాలలకు వెళ్లే విద్యార్ధిని, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా పగటి వేళల్లోనూ వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించవలసిన పరిస్థితులు వున్నాయి.
దినసరి కూలీలకు తప్పని చలి తిప్పలు..
ఇప్పటికే పలుమాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు చలితో ఇబ్బందులు ఎదుర్కొని పొట్ట కూటి కోసం పనులకు వెళ్ళ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు పిల్లలు పెద్దలు వివిధ అనారోగ్య రుగ్మతలుతో బాధపడుతున్నారు. చలి తీవ్రత నుండి చిన్నారులను కాపాడుకోవాలని ఆరుబయట తిరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలి రక్షణ దుస్తులు ధరించాలని వైద్యులు చూసి స్తున్నారు. మొత్తం మీద మన్యంలో చలి అధికంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.