P Anand Mohan, News18,Visakhapatnam
Target Botsa: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికలు జరిగేది ఎప్పుడన్నది క్లారిటీ లేకున్నా.. ఇప్పటి నుంచి వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. ఓ కీలక నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఉత్తరాంధ్ర రాజకీయాల (Uttarndra Politics) లో పెనుమార్పులు చోటుచేసుకున్నట్టే.. ముఖ్యంగా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో అంటే ముఖ్యంగా విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం జిల్లా (Srikakulam District ) ల్లో బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) హవా కాదనలేనిది. అక్కడక్కడా వర్గ పోరు ఉన్నా.. బొత్సాను కాదని ఏ పని చేయడం దాదాపు సాధ్యం కాదు.. అందుకే ఇప్పటికే చాలామంది ఆశావాహులు బొత్స భజన చేస్తూనే ఉన్నారు. మరోవైపు బొత్సాకు సంబంధించి మరో వార్త ప్రచారంలో ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయరని.. తనయుడు సందీప్ లేద మేనల్లుడి చిన్న శ్రీనుకు అవకాశం ఇస్తారో చూడాలి.. మరోవైపు ప్రస్తుతం విజయనగరం ఎంపీ.. బెల్లాన సైతం చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే బొత్స మాత్రం అయితే తానే పోటీ చేయలాని.. లేదంటే తన కుమారుడ్ని బరిలో దించాలనే సంకల్పంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై తెలుగు దేశం పార్టీ సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. విజయనగరం జిల్లాతోపాటు చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స కుటుంబ సభ్యలు ఆధిపత్యానికి గండి కొట్టాలనే పట్టుదలతో టీడీపీ ఉంది.
ప్రస్తుతం చీపురుపల్లిని బొత్స తనకు అడ్డగా మార్చుకున్నా.. చరిత్రను పరిశీలిస్తే.. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఇక్కడి నుంచి గెలిచిన బొత్స నియోజకవర్గం మొత్తం తానే అయి వ్యవహరించేవారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు, వైసీపీ తరఫున ఒకసారి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ, మూడుసార్లు బొత్స గెలిచారు.
మరోసారి తమ పట్టు నిలుపుకోవాలని తెలుగు దేశం అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టడం ద్వారా విజయనగరం జిల్లాలో తన ప్రాభవాన్ని పునరుద్ధించుకోవడానికి టీడీపీ వ్యూహాలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను బరిలోకి దింపింది. కానీ బొత్సకు దీటుగా నాగార్జున వ్యవహరించలేకపోతున్నారు అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి రెండు సామాజికవర్గాలకు చెందినవారే పోటీచేస్తున్నారని, అలాకాకుండా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపి బొత్సను ఓడించాలనే పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు పన్నుతున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: : గెలుపుపై నమ్మకం ఉన్నచోట సైకిల్ కు పంక్చర్.. కీలక నేత రాజీనామా
అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కిమిడి నాగార్జున కు మరోచోట నుంచి అవకాశం కల్పించి ఆ స్థానంలో వేరే బలమైన అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలను వైసీపీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, లేదంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన కొండ్రు మురళీమోహన్ ను కానీ బరిలోకి దింపాలనే సమాలోచనలు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, TDP, Vizianagaram, Ycp