Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TEDDY BEARS AVAILABLE AT BEST PRICES IN VIZAG VSJ NJ ABH

Vizag: టెడ్డీబేర్‌ కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..! రూ.50 నుంచి రూ.5000 వరకు అన్నిధరలలో దొరుకుతాయ్‌

టెడ్డీబేర్‌ కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..!

టెడ్డీబేర్‌ కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..!

టెడ్డీ బేర్‌ అంటే చాలు పిల్లలకి ఎనలేని ప్రేమ. పిల్లలతో పాటు అమ్మాయిలు కూడా ఎక్కవగా టెడ్డీబేర్‌లను ఇష్టపడుతుంటారు.బర్త్‌డే వేడుకలకు, ఫ్రెండ్‌షిప్‌ డే, లవర్స్‌ డే..ఇలా ఏ స్పెషల్‌ అకేషన్‌కైనా టెడ్డీబేర్‌లను గిఫ్టులకు ఇవ్వడం ట్రెండ్‌గా మారింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  (Setti Jagadesh, News 18, Vizag)

  టెడ్డీ బేర్‌ అంటే చాలు పిల్లలకి ఎనలేని ప్రేమ. పిల్లలతో పాటు అమ్మాయిలు కూడా ఎక్కవగా టెడ్డీబేర్‌లను ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం పుట్టినరోజు వేడుకలకు, ఫ్రెండ్‌షిప్‌ డే, లవర్స్‌ డే..ఇలా ఏ స్పెషల్‌ అకేషన్‌కైనా టెడ్డీబేర్‌లను గిఫ్టులకు ఇవ్వడం ట్రెండ్‌గా మారింది.
  విశాఖపట్నంలో ఫ్రెండ్‌ బర్త్‌డే వేడుక వస్తే చాలు టెడ్డీ బేర్‌లు ఎక్కడ దొరుకుతాయా అని నగరవాసులు జల్లెడపడతారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తే జేబుకు చిల్లులు పడుతాయోమో అని భయం. అయితే అందరికీ అందుబాటులో తక్కువ ధర కలిగిన టెడ్డీబేర్‌లు ఉండే ప్రదేశం వైజాగ్‌లో ఎక్కడో తెలుసా..
  మరెక్కడో కాదు విశాఖపట్నం ఆర్.టి.సి కాంప్లెక్స్‌కు అతిసమీపంలో ఎల్‌ఐసీ బిల్డింగ్ వెనక అందరికీ అందుబాటు ధరలలో టెడ్డీబేర్‌లు దొరుకుతాయి. ఆ లైన్‌లోకి వెళితే చాలు ప్రతి షాపుముందు కలర్‌ఫుల్‌ టెడ్డీలు హాయ్‌ చెబుతాయి. అక్కడ ఏ షాప్‌లో చూసినా చిన్న టెడ్డీబేర్‌ నుండి పెద్ద టెడ్డీబేర్‌ వరకు అన్నిరకాలు దొరకుతాయి. ఇక్కడ మీకు రూ.50 నుండి రూ.5000 వేల వరకు అన్ని ధరల్లోనూ టెడ్డీబేర్‌లు అందుబాటులో ఉన్నాయి.
  ఎలుగుబంటి పిల్లల రూపాన్ని అనుకరించటానికి ప్రయత్నించిన మొదటి టెడ్డీబేర్‌లను సృష్టించినప్పటి నుండి, ఆ టెడ్డీల రూపం, శైలి, రంగు మరియు తయారుచేసే మెటిరీయల్‌తో చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ బొమ్మలో మెత్తటి దూదిని కుక్కి పైన ఊలు డ్రస్‌తో కుడతారు.
  చిన్నపిల్లల రూమ్‌లలో, అమ్మాయిలు తమరూమ్‌ల నిండా టెడ్డీబేర్లతో నింపేస్తారు. కొందరు పిల్లలైతే పక్కన టెడ్డీ లేకపోతే నిద్రకూడ పోరంటే అతిశయోక్తి కాదు. బయటమార్కెట్లలో అరుదైన టెడ్డీలు కనిపించడంతో అవి కలెక్షన్‌ వస్తువులుగా మారిపోయాయి. టెడ్డీ బేర్‌లు పిల్లలకు అత్యంత ప్రజాదరణ పొందిన బహుమతుల్లో ఒకటి మరియు వాటిని తరచుగా పెద్దలకు ఆప్యాయత, అభినందనలు తెలపడానికి ఇస్తుంటారు.
  వాణిజ్యపరంగా తయారు చేయబడిన, పెద్దఎత్తున ఉత్పత్తి చేయబడిన టెడ్డీబేర్‌లను ప్రధానంగా పిల్లల కోసం బొమ్మలుగా తయారు చేస్తారు. ఈ ఎలుగుబంట్లు చేతులు, కాళ్లు మరియు తలలను అటాచ్ చేయడానికి భద్రతా జాయింట్‌లను కలిగి ఉంటాయి. ఈ "ప్లష్" ఎలుగుబంట్లు యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్‌లో పిల్లలకు మార్కెట్ చేయడానికి కఠినమైన నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
  స్టోర్‌లలో లేదా ఇంటర్నెట్‌లో కొనుగోలు చేయగల…. చేతితో తయారు చేసిన, సేకరించదగిన ఎలుగుబంట్లను విక్రయించే స్టీఫ్ వంటి మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. టెడ్డీబేర్‌లలో ఎక్కువ భాగం చైనా మరియు ఇండోనేషియా వంటి తక్కువ ఉత్పత్తి ఖర్చులు కలిగిన దేశాల్లో తయారు చేయబడుతుంటాయి.
  ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9 న టెడ్డీబేర్‌ దినోత్సవం జరుపుకుంటారు. 2000 సంవత్సరంలో "వెర్మంట్" టెడ్డీబేర్ కంపెనీ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. అమెరికాలో మొదలైన ఈ టెడ్డీబేర్‌ డేని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున పిల్లలు, పెద్దలు తమ టెడ్డీబేర్లతో పాటు విందులు, వినోదాలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
  అడ్రస్‌: ఎల్‌ఐసీ బిల్డింగ్‌ బ్యాక్‌ సైడ్‌, ద్వారకా నగర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530004.
  ఎలా వెళ్లాలి?
  విశాఖ బస్టాండ్‌ నుంచి ఆటోలు , లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలోనే ఈ టెడ్డీబేర్‌ల షాపులు ఉంటాయి.


  Read This: Vizag: గుక్కెడు నీళ్ల కోసం యుద్ధం చేయాలా? చేతులు జోడించి వేడుకుంటున్న మహిళలు
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Shopsy, Telangana, Vishakaptnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు