హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!

Vizag News: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!

X
విశాఖలో

విశాఖలో బీటెక్ స్టూడెంట్స్ పానీ పూరీ బిజినెస్

బీటెక్ చదివే ప్రతివాడు క్యాంపస్ డ్రైవ్ లో జాబ్ కొట్టామా.. మంచి జీతంతో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నామా.. అనే ఆలోచిస్తారు. కానీ ఈ కుర్రాళ్లు మాత్రం చాలా డిఫరెంట్. బీటెక్ కు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చి బిజినెస్ లోకి దిగారు. ప్రాఫిట్స్ కి పర్ఫెక్ట్ ఫార్ములా కనిపెట్టారు.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News18, Visakhapatnam

ప్రస్తుతం ఇంటర్‌ అయిపోయిన ఏ విద్యార్థిని నెక్ట్స్‌ ఏంటి అని అడిగితే…ఏదో ఒక కాలేజ్‌లో బిటెక్‌ చదవాలి..ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ తెచ్చుకోవాలి.. ఇదే సమాధానం వస్తుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌కు అంత డిమాండ్‌ ఉంది మరి. వారానికి రెండు రోజులు సెలవులు, ఐదంకెల జీతం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందరిలానే ఆ ఇద్దరు బిటెక్‌ విద్యార్థులు (B.Tech Students) అనుకున్నారు. క్యాంపస్‌లో జాబ్‌ కొట్టాం.. ఇక లైఫ్‌ సెటిల్‌ అనుకున్నారు. కానీ, అనుకోని ప్రమాదం కరోనా రూపంలో వచ్చింది. కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇంక లాభం లేదనుకుని ఎదురుచూపులు అనవసరమని సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. అప్పుడే వాళ్లకో ఐడియా వచ్చింది. ఇప్పుడదే లక్షల ఆదాయం తెచ్చిపెడుతుంది.

బీటెక్‌ వాలా పానీపూరి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కి చెందిన రాపర్తి రామకృష్ణ, మనోజ్.. బీటెక్ వాలా అనే ఓ పానీ పూరి స్టాల్‌ పెట్టి బిజినెస్ ప్రారంభించారు. సొంత ఊరిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఏదో ఒక పని చేసుకోవాలని ఆలోచించారు. ఏదో నోరు తిరగని పేరు పెట్టడం కన్నా.., ప్రజెంట్‌ ట్రెండింగ్‌లో ఉన్న, తాము చదివిన బీటెక్‌ పేరు పెడితే క్రేజీగా ఉంటుంది కదా అనుకున్నారు. అందరికీ సులభంగా, ముఖ్యంగా స్టూడెంట్స్‌ ని అట్రాక్ట్‌ చేసేందుకు బీటెక్ వాలా అని పేరు పెట్టి పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఇది చదవండి: బాబోయ్ బెజవాడ..! అటువైపు వెళ్లాలంటేనే హడల్.. కారణం ఇదే..!


తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

పెట్టుబడి పెట్టేందుకు వారిద్దరి దగ్గర డబ్బులు లేకపోతే వారి దగ్గరున్న స్టైఫండ్‌, కొంతమొత్తంలో ఇంటి దగ్గర తల్లిదండ్రుల వద్ద తీసుకొని ఒక లక్ష యాబై వేల రూపాయలతో మొదటి పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. పట్టుమని కొద్దీ నెలలు కాకముందే సమిష్టిగా లాభాలు అర్జిస్తున్నారు. వీరి వద్ద పుదీనా, జీర వెల్లుల్లి, ఇంగివా, స్వీట్ పానీ పూరి నగరవాసులకు అందిస్తూ అతి తక్కువ రోజుల్లోనే ఫేమస్ అయ్యారు. ఫుణేలో ఒకసారి ఇలానే డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌ తో ఉన్న పానీపూరిని చూశానని.. దాన్ని మన సౌత్‌ ఇండియన్స్‌ కు నచ్చేలా కొన్ని మార్పులు చేర్పులు చేశామంటున్నాడు రామకృష్ణ. ఈ ఫ్లేవర్స్‌ జనాలకు బాగా నచ్చుతున్నాయని.. తమకు డైలీ కస్టమర్స్‌ కూడా ఉన్నారంటున్నారు.

ఇది చదవండి: ఆనియన్ దోశ తిన్నాం.. కానీ ఐస్ క్రీమ్, చాక్లెట్ దోశ తిన్నారా..? తింటే వదిలిపెట్టరు బాస్..


పానీపూరి టేస్టే వేరయా!

ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్‌లలో పానీపూరి ఒకటి. పానిపూరి అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు. ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలిచే ఈ పానీపూరిని రోడ్డు మీద బండి దగ్గర తింటే ఆ రూచే వేరు! పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేది పానీపూరి. హైదరబాద్‌ టాక్స్‌ పేయర్స్‌(Tax payers)లిస్ట్‌ లో పానీపూరి వాళ్లు ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ బిజెనెస్‌ తో ఎంత లాభమో..! దీన్ని గ్రహించిన ఈ యువ కిరణాలు పానీపూరి ఏర్పాటుచేసి నగరవాసులకు మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్ అందిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన మసాలాలు, ఎటువంటి రంగులు లేని పానీపూరి ఏర్పాటు చేశారు. నగరవాసులకు, స్టూడెంట్స్ కి రుచికరమైన పానీ పూరి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే గుర్తింపు తెచ్చుకున్నారు. లక్షలాది రూపాయలకు వ్యాపారాన్ని విస్తరింపజేశారు.

ఇది చదవండి: అల్లూరిని కాల్చిచంపిన రూథర్‌ఫర్డ్‌ బంగ్లా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!


బ్రాండ్‌ను విస్తరించే దిశగా అడుగులు

వైజాగ్‌లో పెట్టిన మొట్టమొదటి స్టాల్‌ విజయవంతం అవడంతో.., ప్రతి జిల్లాకు తమ బ్రాండ్‌ను విస్తరింపజేసే దిశగా యువకులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద పార్టీలకు పానీపూరిలను సప్లయ్‌ చేస్తున్నారు. సాఫ్ట్‌ వేర్‌ జీతాలకన్నా.. ఈ పానీపూరి బండికే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటున్నాడు రామకృష్ణ. ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటే తమ బ్రాండ్ ఇచ్చి, వారికి జీవన ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Visakhapatnam

ఉత్తమ కథలు