Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TEACHERS FACING PROBLEMS WITH FACIAL SCANNING ATTENDANCE IN ANDHRA PRADESH VSJ NJ PRN

Vizag News: సెల్పీ పెడితేనే శాలరీ.. లేదంటే జీతం కట్.. ఏపీలో టీచర్లకు వింత కష్టాలు..

ఏపీలో టీచర్లకు హాజరు కష్టాలు

ఏపీలో టీచర్లకు హాజరు కష్టాలు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేషియల్‌ స్కానింగ్‌ అదే నండి సెల్ఫీ ద్వారానే టీచర్ల అటెండెన్స్ అని ఆదేశాలిచ్చింది. దీంతో పొద్దున్నే స్కూల్‌కు వచ్చిన టీచర్లు సెల్ఫీలు తీసుకుంటూ..దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తూ బిజి అయిపోయారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    Setti Jagadeesh, News18, Visakhapatnam

    ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేషియల్‌ స్కానింగ్‌ అదే నండి సెల్ఫీ ద్వారానే టీచర్ల అటెండెన్స్ అని ఆదేశాలిచ్చింది. దీంతో పొద్దున్నే స్కూల్‌కు వచ్చిన టీచర్లు సెల్ఫీలు తీసుకుంటూ..దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తూ బిజి అయిపోయారు. సెల్ఫీ దిగి ఆ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటే…స్లోగా తిరుగుతూ తిరుగుతూ ఎప్పటికో గాని అప్‌లోడ్‌ కావట్లేదు. మరికొందరికైతే ఎన్నిసార్లు అప్‌లోడ్‌ చేసినా అవ్వకపోడంతో.. ఉపాధ్యాయులకు ఇదొక పెద్ద తలనొప్పి ప్రక్రియలా తయారైంది. సెల్ఫీ ద్వారా హాజరు వేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో తొలిరోజు దాదాపు సగం మంది ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ...రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మాత్రం పది శాతానికి మించలేదు. మంగళవారం ఉదయం 9 గంటల తరువాత అయితే కొంతసేపే ఆ యాప్‌ పనిచేసింది..ఆ తర్వాత మొరాయించింది.

    దీంతో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. టీచర్లు అంతా తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటల కల్లా స్కూల్‌కు వచ్చి… సెల్ఫీ ద్వారా తమ అటెండెన్స్‌ వేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా హాఫ్‌ డే శాలరీ కట్‌ చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించొద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆదేశాలు వచ్చిన కొద్దిరోజులకే అంటే మంగళవారం ఉదయం నుంచే వాట్సాప్‌ గ్రూపుల్లో పెద్దఎత్తున మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మంగళవారం రోజు రిజిస్ర్టేషన్‌తో పాటు హాజరు కూడా తక్కువగా నమోదైంది. అయితే, కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం సెల్ఫీలు తీసి అప్‌లోడ్‌ చేస్తున్నారు.

    ఇది చదవండి: ఐదు క్లాసులకు ఒకే టీచర్.. ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదేనా..? ఇప్పుడేం సమాధానం చెబుతారు..?


    ప్రతి స్కూళ్లోను టీచర్లు అందరూ ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి లాగిన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ కావాలి. ఆ తరువాత ఎవరికివారు సెల్ఫీ తీసుకుని..ఆ ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ 50 శాతానికిపైగా నమోదు కాగా… ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లో మాత్రం చాలా స్వల్పంగా నమోదయ్యింది.

    ఇది చదవండి: వైజాగ్ బీచ్‌కు ఏమైంది.. ఎందుకలా జరుగుతోంది..ముప్పు ముంచుకొస్తోందా..?


    ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాల అప్‌లోడ్‌కు విద్యా శాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ (ఫేషియల్‌ స్కానింగ్‌ కోసం సెల్ఫీ)ను మా సొంత ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై పలువురు టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వివరాల అప్‌లోడింగ్‌ బాధ్యత నుంచి తమను తప్పించాలని కోరుతూ ఆయా స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందుతున్నాయి.

    ఇది చదవండి: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ జలపాతాన్ని చూడాల్సిందే..! లేదంటే మీ బ్యాడ్‌ లక్‌..!


    సెల్ఫీ హాజరుకు రెండో రోజు కూడా మెజారిటీ ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఉమ్మడి జిల్లాలో బుధవారం పది శాతం కంటే తక్కువ మంది హాజరు వేసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయగా...మిగిలిన టీచర్స్‌ దూరంగా ఉన్నారు. నెట్‌వర్క్‌ లేని ఏజెన్సీ మండలాల్లో మూడు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే సెల్ఫీలు తీసుకుని అప్‌లోడ్‌ చేశారని వివరిస్తున్నారు. రెండు రోజుల నుంచి విద్యార్థుల అటెండెన్స్‌ యాప్‌ కూడా పనిచేయడం లేదు. దీంతో విద్యార్థుల హాజరును మాన్యువల్‌గా హాజరు పట్టికలో నమోదుచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ గ్రూపుల్లో యాప్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా తమ తమ ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందజేశారు.

    ఇది చదవండి: బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే గుర్రాలు కట్టేసేవారట..! మరి ఆ ప్రాంతం ఇప్పుడెలా ఉంది..?


    యాప్‌ డౌన్‌లోడ్‌, సెల్ఫీ హాజరుకు ప్రభుత్వం సెల్‌ ఫోన్లు సరఫరా చేస్తే తప్ప సొంత ఫోన్‌లను వినియోగించలేమని హెచ్‌ఎంలకు ఇచ్చిన వినతిపత్రాల్లో టీచర్లు స్పష్టంచేశారు. ఇప్పటికే పలురకాల యాప్‌ల వినియోగం వల్ల భారం పెరిగిందని, సర్వర్లు పనిచేయక రోజుంతా వాటితో కుస్తీ పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సొంత ఫోన్‌లలో ఉన్న వ్యక్తిగత డేటాకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే హాజరు విషయంలో మాత్రం హెచ్‌ఎంలు పట్టుబట్టడం లేదన్నారు.

    ఇది చదవండి: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!


    ఒకవైపు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు యాప్‌ డౌన్‌లోడ్‌, సెల్ఫీ హాజరుపై వివరాలు కోరుతున్నారు. మరోవైపు టీచర్లు దీనికి వ్యతిరేకత చూపిస్తున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరి దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Teacher

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు