అతడు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన గురువు వృత్తిలో ఉన్నాడు. ఆమె కూడా టీచర్ గానే పనిచేస్తోంది. కానీ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం (Extramarital Affair) ఏర్పడింది. ఓ బలహీన క్షణంలో ఆమెను లొబరుచుకున్న అతడు.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. ఆమె నగ్నఫోటోలు తీసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరకు అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) రావికమతం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు సూరెడ్డి మహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెంకు చెందిన ఉపాధ్యాయిని గత ఏడాది విజయవాడ Vijayawada)సమీపంలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన ట్రైనింగ్ సెషన్ కు హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయమైంది.
ఉపాధ్యాయినికి 2019లో పెళ్లవగా ఆమెను భర్త శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని మహేశ్వరరావుతో చెప్పుకున్న ఉపాధ్యాయిని.. అతడు మాటలతో ఓదార్చడంతో దగ్గరైంది. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ లాడ్జిలు, హోటళ్లలో శారీరకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు లాడ్జిలో ఇద్దరూ కలిశారు. అదే రోజు ఆమె నిద్రిస్తుండగా సెల్ ఫోన్లో నగ్న వీడియోలు, ఫోటోలు తీశాడు. అప్పటి నుంచి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో అతడు చెప్పిన చోటుకు బాధితురాలు వెళ్లాల్సివచ్చేది.
అంతేకాకుండా ఆమె ఫోన్లో సీక్రెట్ యాప్ ఇన్ స్టాల్ చేసి దానిని కూడా కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఆమె ఏం చేస్తోంది..? ఎవరితో మాట్లాడుతోంది..? అనే విషయాలపైనా నిఘా ఉంచాడు. తాను చెప్పినట్లు చేయాలని.. ఎక్కడికి రమ్మంటే అక్కడి రావాలంటూ న్యూడ్ ఫోటోలు చూపించి బెదిరిస్తుండేవాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు.. విజయవాడలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు మహేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దాదాపు ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. సింగ్ నగర్ కు చెందిన దిలీప్ కుమార్ అతడి భార్య.. తమ ఇంటికి ఎదురుగా ఉండే వివాహిత ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. దిలీప్ ఆమెపై అత్యాచారం చేస్తుండగా భార్య వీడియో తీసింది. ఆ వీడియోను చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ బాధితురాలపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐతే తన స్నేహితుల వద్దకు కూడా వెళ్లాలని బెదిరిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Nude videos blackmails, Visakhapatnam