హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: స్పీడ్ పెంచిన బాబాయ్, అబ్బాయ్... కారణం ఇదేనా..? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!

TDP: స్పీడ్ పెంచిన బాబాయ్, అబ్బాయ్... కారణం ఇదేనా..? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు (ఫైల్)

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు (ఫైల్)

Telugu Desham Party: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections-2019) ఫ్యాన్ గాలి స్పీడ్ గా వీచినా ఆ కుటుంబం మాత్రం ఎదురునిలిచి గెలిచింది. కానీ కేసుల ఎఫెక్ట్ తో కొన్నాళ్లు సైలెంట్ అయింది. ఐతే ఇటీవల ప్లాన్ మార్చారు.

  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  2019 అసెంబ్లీ ఎన్నికల్లో (2019 Assembly Elections) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా  వైఎస్ఆర్సీపీ (YSR Congress Party) గాలి బలంగా వీచింది. ఫ్యాను దూకుడుకు ప్రతిపక్ష పార్టీలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయయి. ఇందులో కొందరే తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) తరపున గెలిచి నిలిచారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు( Kinjarapu Atchennaidu), పార్టీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తన స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు.., శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు రెండో సారి విజయం సాధించారు. టీడీపీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇద్దరికి ప్రతికూల పవనాలు వీచాయి. ఈఎస్ఐ స్కామ్ కేసులో ముందుగా అచ్చెన్నాయుడునుపోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలోనూ అదే సీన్ రిపీట్ అవడంతో కాస్త దూకుడు తగ్గించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కేసులకు బయపడి మౌనంగా ఉండిపోయారని టాక్ బలంగా వినిపించింది.

  అదే సమయంలో పార్టీ కేడర్ చేజారిపోకుంటా.. నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దంటూ చిన్నసైజ ఓదార్పు యాత్ర కూడా చేశారట. మనకు టైం వస్తుంది.. ఆ టైం వచ్చేవరకు కొంచం ఓపిక పట్టాలని సూచనలు చేశారట అచ్చెన్న. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఇలా మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థంకాక కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఇక బాబాయ్ అరెస్టులతో ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం మొదట్లో సైలెంటుగా ఉన్నారట. కోవిడ్ టైంలో స్వీయ నియంత్రణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ కాలక్షేపం చేశారు.

  ఇది చదవండి : ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ భారం.., ఆ చిన్నారి కష్టం ఎవరికీ రాకూడదు..


  పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న బాబాయ్, అబ్బాయ్ ఇటీవల ట్రాక్ ఎక్కినట్లు తెలుస్తోంది. తమ మాటలకు పదును పెట్టి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇటీవల వీళ్లిద్దరూ డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కోటబొమ్మాళిలో నిరసనకు దిగారు. దీంతో టీడీపీ క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చింది. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అచ్చెన్న, రామన్న ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

  ఇది చదవండి: బస్ టికెట్ల బుకింగ్ కు కొత్త యాప్... అభి బస్ తో ఏపీఎస్ ఆర్టీసీ బిగ్ డీల్...


  నిన్న, మొన్నటివరకు టైమ్ మనదికాదంటూ చెప్పుకొన్నిన నేతల్లో ఒక్కసారిగా మార్పు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోటబొమ్మాళి ధర్నాలో వారు చేసిన ప్రసంగం, వైసీపీకి ఇచ్చిన కౌంటర్లు హాట్ టాపిక్ అయ్యాయి. టెక్కలిలో కొందరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వారు పద్ధతి మార్చుకోకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న పోలీసుల లెక్కల రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

  ఇది చదవండి: భయంకరమైన నిజాన్ని దాచి ఆమెకు పెళ్లి చేశారు.. ఏడాదిలోపే ఆమె జీవితం చీకటిమయమైంది..


  ఈ కామెంట్స్ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొత్తానికి కేసులంటే భయం పోయిందో.., లేక సైలెంట్ గా ఉంటె కనుమరుగైపోతామనుకున్నారో ఏమో తెలియదు కానీ అచ్చెన్న ఫ్యామిలీలో మార్పు రావడం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని ఇస్తుందట. ఇక వచ్చే ఎన్నికల వరకు ఇదే స్పీడ్ కొనసాగిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Kinjarapu Atchannaidu, Ram Mohan Naidu Kinjarapu, Tdp

  ఉత్తమ కథలు