హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ayyanna on Ganta: గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు

Ayyanna on Ganta: గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు

గంటా పై అయ్యన్న ఫైర్

గంటా పై అయ్యన్న ఫైర్

Ayyanna on Ganta: విశాఖ టీడీపీలో వర్గ పోరు మళ్లీ రచ్చకెక్కుతోంది. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే గంటా రీ ఎంట్రీతో టీడీపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. తాజాగా గంటా శ్రీనివాసరావు పై మాజీ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవడయ్యా గంటా..? లక్షల్లో ఒక్కడు అంటూ తీవ్ర స్థాయిలో ఫైరల్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Ayyanna on Ganta: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ (TDP) వ్యూహాలు రచిస్తోంది. కానీ నేతల మధ్య వర్గ పోరటు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముఖ్యంగా విశాఖ (Visakha) లో ప్రస్తుతం టీడీపీ చాలా పటిష్టంగా కనిపిస్తోంది.. వివిధ సర్వేలు సైతం విశాఖలో టీడీపీకే పరిస్థితి అనుకలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ స్థానిక పరిస్థితులు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విశాఖ సిటిలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నెగ్గితే.. అందులో వాసుపల్లి గణేష్ (Vasupalli Ganesh) జగన్ (Jagan) కు జై కొట్టారు. మరో ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ex Minister Ganta Sriniavasarao).. ఎన్నికల ముగిసిన నుంచి పార్టీకి దూరంగా ఉంటూనే వచ్చారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టు పలుమార్లు వార్తలు కూడా వినిపించాయి.

ఆ వార్తలకు చెక్ పెట్టేశారు గంటా. ఇటీవల లోకేష్ ను కలిసి వచ్చిన ఆయన.. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తుండడంతో ఆయన టీడీపీలో కొనసాగుతారన్నది ఫిక్స్ అయినట్టే.. టీడీపీలో గంటా యాక్టివ్ గా ఉంటే పార్టీకి మంచిదే కానీ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీలో వర్గపోరు తెరపైకి వచ్చింది.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గంటాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానా? పార్టీలో అందరూ రావాలి.. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక. మరి గంటా రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలియడంతో అయ్యన ఇలా ఫైర్ అయిపోయారు.

ఇదీ చదవండి : జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. సంచలన వ్యాఖ్యలు

తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయ్యన్న.. ఇన్ని రోజులు గప్‌చుప్‌గా ఇంట్లో దాక్కుని, ఎన్నికలు వస్తుండగానే బయటకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటానే కాదు.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో బయటకు రాని నేతలందరికీ ఆయన గట్టిగానే క్లాస్‌ ఇచ్చారు. ఇంకా అయ్యన్న ఏమన్నారంటే..? మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుంది. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం అన్నారు.

ఇదీ చదవండి : ఆధార్‌ కార్డులో తప్పులు దొర్లాయా? నో టెన్షన్ ఈజీగా నేటి నుంచి సచివాలయాల్లో అప్‌డేట్‌ చేసుకోండి

అయితే టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం ఉంటుంది. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతామన్నారు. వైసీపీ పాలనలో సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి అన్నారు. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : హైపర్ ఆదికి డైపర్ వేయాల్సిన సమయం వచ్చింది.. బైరెడ్డి స్టైల్ కౌంటర్లు..

భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే 20 ఎక్కువ. సీఎం జగన్ భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అని ప్రశ్నించారు. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. 8700 కోట్లు అప్పు తెస్తారా..? బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్భాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారు. దావోస్ సదస్సుకు అందరికీ ఒకే ఆహ్వానం ఇస్తారని మంత్రి అమర్నాధ్ కు తెలీదా? పొరుగు రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అమర్నాధ్. మాలాంటి వారిని తిట్టడానికే అమర్నాధుకు మంత్రి పదవి ఇచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ayyannapatrudu, Ganta srinivasa rao, Visakhapatnam

ఉత్తమ కథలు