Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM TDP LEADER NARA LOKESH TOMORROW VIZAG TOUR HE ATTEND A COURT IN ONE CASE NGS VSP

Lokesh Vizag Tour: వైజాగ్ కు లోకేష్.. కోర్టుకు హాజరు.. కేసు ఎవరు వేశారో తెలుసా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh Vizag tour: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైజాగ్ వస్తున్నారు. అయితే ఆయన వెళ్లేది.. పార్టీ సమావేశాల కోసమో.. నియోజవకర్గ నేతలను కలవడానికో మాత్రం కాదు..

    Lokesh Vizag Tour: ఆంధ్రప్రదేశ్ లో  ఏ జిల్లాలో చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార -ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొన్ని చోట్ల వ్యహారం కేసులు.. అరెస్ట్ ల వరకు వెళ్తోంది. అయితే ఇప్పటికే పలువరు టీడీపీ నేతలపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోవైపు కొన్ని కేసుల్లో అరెస్ట్ కూడా తప్పడం లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు కేసులు ఎదుర్కొంటుంటే.. రివర్స్ లో నారా లోకేష్ కేసు వేషారు. ఆ కేసు కోసం ఆయన ఇవాళ విశాఖపట్నం వస్తున్నారు.  విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. స

    గతంలో తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో  25 లక్షల రూపాయలకు మించి చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది.

    ఇదీ చదవండి : భీమ్లా నాయక్ కు బిగ్ షాక్..! ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందా..?

    అయితే ఈ కథనాలపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ పత్రికలో ప్రచురించిన  తేదీల్లో తాను విశాఖ పట్నంలోనే లేనన్నారు నారా లోకేష్. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును.. తన పరువు తీయాలనే ఉద్దేశంతో..  ఇలా తనపై అసత్యాలతో ప్రచురించారంటూ  75 కోట్ల రూపాయలకు  పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా ఇవాళ హాజరుకానున్నారు లోకేష్. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. 

    ఇదీ చదవండి : టీఆర్ఎస్ మెగా ప్లాన్.. బీజేపీపై కీలక అస్త్రం సిద్ధం చేస్తున్న గులాబీ నేతలు

    మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తమకు అందుబాటులో ఉండటం లేదని  అధినేత చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు నేతలు. బొజ్జల సుధీర్ తో కొద్దిసేపు విడిగా మాట్లాడారు చంద్రబాబు.స్థానికంగా ఉన్న ఫీడ్ బ్యాక్ ను సుధీర్ కు వివరించారు చంద్రబాబు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు.

    తండ్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కష్టపడాలని సుధీర్ కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇకపై నియోజకవర్గ నేతలతో నిత్యం అందుబాటులో ఉంటానని చంద్రబాబు సమక్షంలో నేతలకు స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Nara Lokesh, TDP, Vizag

    తదుపరి వార్తలు