బోషిడికే వివాదంలో ట్విస్ట్ : అందుకే జగన్ అలా చేశారు -తల్లిని తిట్టినవాళ్లకు మంత్రి పదవులు: టీడీపీ అయ్యన్నపాత్రుడు ఫైర్

సీఎం జగన్ పై అయ్యన్న విమర్శలు

దాడులు, అరెస్టులు, కేంద్రానికి ఫిర్యాదుల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో ‘బోషిడికే వివాదం’ చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ ను ఆ పదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన దరిమిలా.. మళ్లీ అదే తిట్టుతో టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి, విశాఖ టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా బోషిడికే పదానికి తెలంగాణ పదకోశంలోని అర్థాన్ని వెల్లడిస్తూ, సీఎం జగన్ తల్లి, చెల్లిని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..

  • Share this:
ఏపీలో రాజకీయ నేతల తిట్ల పురాణం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సీఎం జగన్ ను బోషిడికే అంటూ దూషించిన పట్టాభికి హైకోర్టులో ఊరట లభించిన తర్వాత టీడీపీ నేతలు మళ్లీ అదే పదాన్ని వాడుతూ వైసీపీపై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరో అడుగు ముందుకేసి జగన్ తల్లి, చెల్లి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అయ్యన్న ఆదివారం పలు ట్వీట్లు చేశారు. బోషిడికే పదానికి తెలంగాణ పదకోశంలో ఉన్న అర్థాన్ని చెబుతూ, అసలా మాట జగన్ ను ఉద్దేశించి అనకున్నా, సీఎం తనకు తానే అన్వయించుకున్నారని అయ్యన్న ఫైరయ్యారు..

‘సానుభూతి వస్తుందనుకుంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి వైఎస్, బాబాయ్ వివేకా శవాల దగ్గర నుంచి కోడికత్తి వరకూ దేనినీ వదల్లేదు. అలాంటిది బోషిడికే అనే పదాన్ని మాత్రం ఎలా వదులుతాడు? వాస్తవానికి తెలంగాణ పదకోశంలో బోషిడికే అంటే 'పాడై పోయిన' అనే అర్థముంది. జగన్ కావాలనే బోషిడికే పదాన్ని తనకు అన్వయించుకుని, తల్లి సెంటిమెంట్ కార్డును బయటికి తీశాడు..

YS Sharmila చెంతకు జగన్ దూతగా! -షర్మిలతో వైవీ సుబ్బారెడ్డి భేటీ వెనుక రహస్యమేంటి? -పాదయాత్రలో అనూహ్య దృశ్యం


వాస్తవానికి టీడీపీ నేత పట్టాభి బోషిడికే అని తిట్టింది ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని. కానీ ఆ మాట తననే అన్నారని సీఎం అన్వయించుకున్నారు. బోషిడీకే పదానికి పెడార్థాలు వెతుక్కొని మరీ సానుభూతి కోసం ప్రయత్నించాడు. జగన్ కు నిజంగానే తల్లిపై ప్రేమ ఉంటే.. గతంలో ఇదే తల్లిని బండ బూతులు తిట్టిన వారికి తన కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడు. తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడు’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.

రెండుగా చీలిన BJP.. ఆ వర్గాలివే - రాష్ట్ర DGPపైనే CM KCR నిఘా : Revanth reddy


టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులను ఖండిస్తూ, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ తో చంద్రబాబు నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలనూ బాబు అపాయింట్మెంట్ కోరినా ఇంకా ఖరారు కాలేదు. కాగా, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారు.
Published by:Madhu Kota
First published: