Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM STUDENTS END THEIR LIFE WHO COMING FOR VISAKHAPATNAM TO PREPARE CIVIL NGS VSP

Crime News: సివిల్స్ లో సత్తా చాటాలనుకుంది.. ప్రేమ మత్తులో జల్సాలకు అలవాటు పడింది. చివరికి ఇలా అయ్యింది

సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంది కానీ.. ఇలా అయ్యింది

సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంది కానీ.. ఇలా అయ్యింది

Crime News: కన్న కూతురు ఉన్నత లక్ష్యాలను అందుకుంటుందని ఆశించారు.. సివిల్స్ లో సత్తా చాటాలనే లక్ష్యంతోనే ఆమె విశాఖలో అడుగు పెట్టింది. కానీ ప్రేమ అనే లోకంలో తేలి.. మత్తుకు.. జల్సాలకు అలవాటు పడింది.. చివరికి ఆ కుటుంబంలో విషాదం నింపింది. అసలు ఏం జరిగింది అంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  P Anand Mohan, Visakhapatnam, News18

  Crime News: ఉన్నతమైన లక్ష్యం పెట్టుకోవడం కాదు.. దాన్ని సాధించాలి అంటే గట్టి సంకల్పం.. కఠోర శ్రమ అవసరం.. ఏ మాత్రం తప్పటడుగు పడినా.. లక్ష్యం అందుకోవడం మాట అటు ఉంచితే.. జీవితం చిందరవందర అవుతుంది. తాజగా విశాఖపట్నం (Viskhapatnam) లో జరిగిన ఓ ఘటన పెను విషాదంగా మారింది. మొదటి నుంచి చదువుల్లో రాణించేది.. పోటీ పరిక్షల్లో సత్తా చాటేది.. ఆమెకు పరిచయం ఉన్నవారంతా చదువుల తల్లి అని పిలిచేవారు.. చిన్నప్పటి నుంచే గోల్స్ పెట్టుకుని పెరిగింది.. కచ్చితంగా సివిల్స్ (Civil Services Exam) లో సత్తా చాటాలని కలలు కంది. ఆ కలలు నిజం చేసుకోవాలనుకుంది.. అనుకున్నట్టే.. తల్లిదండ్రుల ప్రోత్సహం ఉండడంతో.. సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించాలనే సంకల్పంతో విశాఖ నగరానికి (Visakha City) వచ్చిన ఆ యువతీ కల.. మరో యువకుడితో ప్రేమ.. జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

  పోలీసులు తెలిపిన వివరాలిల ప్రకారం.. విజయనగరం జిల్లా (Vizianagaram District) తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన 22 ఏళ్ల దళాయి దివ్య.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత.. విశాఖ నగరానికి వచ్చింది. సివిల్స్‌ కోచింగ్‌ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌కు వెళుతోంది. అక్కడకు వరకు బాగానే ఉంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  మొదట ఇద్దరూ స్నేహితులుగా వ్యవహరించిన.. అది వారి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల దగ్గర పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్‌ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. చదువు అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర అప్పులు చేసింది.

  ఇదీ చదవండి : యనమల మరో ప్రయోగానికి సిద్ధమయ్యారా? తమ్ముడిని పక్కన పెట్టి.. ఆమెకు ఓటేస్తారా?

  తాజాగా వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్‌ చేసి లక్ష రూపాయలు కావాలని కోరింది. అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చాడు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల దగ్గర అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. వెంకటేశ్వరరెడ్డితో తనకు ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్‌లో రాసి సూసైడ్‌ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్‌తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్‌ సందేశం పంపించింది. కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

  ఇదీ చదవండి : ఒక్క రూపాయి పంపించి.. 50 ల‌క్ష‌లు కొట్టేశాడు.. ఎలా మోసం చేశాడంటే..?

  అయితే దివ్య రాసిన సూసైడ్‌ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల అనుమానమే నిజమై.. దివ్య మృతదేహం భీమిలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది.

  ఇదీ చదవండి : గుంతలో పడి వ్యక్తి మృతి.. ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

  మరోవైపు వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తనతో అతడి కుటుంబ సభ్యులు విసిగిపోయారు. అతడి అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు