• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM STATE BANK OF INDIA SOME BRANCHES CLOSED IN ANDHRA PRADESH SOME EMPLOYEES REPORTED CORONA POSITIVE NGS

Andhra Pradesh: ఏపీలో తాత్కాలికంగా ఎస్ బీఐ బ్రాంచ్ లు బంద్. ఏ బ్యాంకునూ వదలని వైరస్

Andhra Pradesh: ఏపీలో తాత్కాలికంగా ఎస్ బీఐ బ్రాంచ్ లు బంద్. ఏ బ్యాంకునూ వదలని వైరస్

విశాఖపట్నంలో కరోనా కారణంగా మూతపడ్డ ఎస్‌బీఐ బ్రాంచ్

ఏపీలో బ్యాంకులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎస్బీఐ లాంటి బ్రాంచుల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా పలు బ్రాంచ్ లను తాత్కాలికంగా మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది.

  • Share this:
    ఏపీని కరోనా అంతకంతకూ భయపెడుతోంది. వైరస్ పేరు వింటేనే గజ గజా వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. 20 రోజుల క్రితం వరకు వందల్లో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఊహకు అందని  స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 41,871 శాంపిల్స్ ని పరీక్షించగా 10,759 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    పశ్చిమ గోదావరి జిల్లా మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైరస్ వెంటాడుతూనే ఉంది.  అనంతపురం జిల్లాలో 789, చిత్తూరు జిల్లాలో 1,474 తూర్పుగోదావరి జిల్లాలో 992, గుంటూరు జిల్లాలో 1,186, కడప జిల్లాలో 279, కృష్ణాజిల్లా జిల్లాలో 679, కర్నూలు జిల్లాలో 1,367, నెల్లూరు జిల్లాలో 816, ప్రకాశం జిల్లాలో 345, శ్రీకాకుళం జిల్లాలో 1,336, విశాఖపట్నం జిల్లాలో 844, విజయనగరం జిల్లాలో 562, పశ్చిమగోదావరి జిల్లాలో 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో సైతం కేసులు క్రమంగా రెట్టింపు అవుతున్నాయి. దీంతో పబ్లిక్ సెక్టార్ రంగంలోని వ్యక్తులకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లాలోని మడకశిరలోని స్టేట్ బ్యాంకులో కరోనా కలకలం రేగింది. బ్యాంకులో పనిచేసే 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.  బ్యాంకులో ఉద్యోగులకు కరోనా సోకడంతో ఆ బ్రాంచ్ ను తాత్కాలికంగా మూసివేశారు.

    ఇటీవల విశాఖపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. శ్రీహరిపురంలోని ఎస్‌బీఐ బ్రాంచిలోని సిబ్బంది కరోనా బారిన పడడంతో తాత్కాలికంగా ఆ శాఖను మూసేశారు. ఈ మేరకు ఆ బ్యాంక్‌ షట్టర్‌పై మూసివేతకు సంబంధించిన నోటీస్‌ అతికించారు. అయితే ఆ విషయం తెలియని వారు బ్యాంక్ వరకు వెళ్లి.. ఆ బోర్డు చూసి షాక్ తిని.. వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఓ వైపు ఎస్బీఐ బ్యాంకులు మూతపడుతున్నాయనే టెన్షన్ వెంటాడుతుంటే.. మరోవైపు ఇటీవల ఆ బ్యాంకులకు వెళ్లిన వారంతా మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆయా బ్యాంకులకు వెళ్లిన వారు.. చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.

    ఈ ప్రభావం కేవలం ఎస్బీఐ మీద మాత్రమే కాదు.. చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి. దీంతో ఇప్పటికే ఏపీలో బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేశారు. ఇకపై బ్యాంకులను మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేయనున్నాయి. కానీ పరిస్థితి ఇలా కొనసాగితే చాలావరకు బ్యాంకులు తాత్కాలికంగా మూసేయాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.
    Published by:Nagesh Paina
    First published: