VISAKHAPATNAM SRIKAKULAM YOUNG MAN PRINTED SHOWS IN LOVE TOWARDS PAWAN KALYAN BY PRINTING HIS PHOTO ON WEDDING CARD FULL DETAILS HERE PRN VZM
Pawan Kalyan Fan: అభిమానమంటే ఇదే.. ఏకంగా పెళ్లి పత్రికపై పవన్ ఫోటో..
పెళ్లి పత్రికపై పవన్ ఫోటో
ఎవరైనా ఓ నటుడ్ని లేదా నాయకుడ్ని ఇష్టపడితే ఏం చేస్తారు.? ఆయన పుట్టినరోజుకి ఏ ఫ్లెక్సీనో, కటౌటో పెట్టుకుంటారు. మరీ అభిమానిస్తే ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. పవన్ పేరు చెబితే పూనకంతో ఊగిపోయే అభిమానులున్నారు.
ఎవరైనా ఓ నటుడ్ని లేదా నాయకుడ్ని ఇష్టపడితే ఏం చేస్తారు.? ఆయన పుట్టినరోజుకి ఏ ఫ్లెక్సీనో, కటౌటో పెట్టుకుంటారు. మరీ అభిమానిస్తే ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. పవన్ పేరు చెబితే పూనకంతో ఊగిపోయే అభిమానులున్నారు. ఐతే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని ఓ అభిమాని.. పవన్ పై తనకున్న ప్రేమను, అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. పవన్ సర్వసంగా భావించే ఆ అభిమాని.. ఏకంగా తన పెళ్లి పత్రికపై తన అభిమాన నాయకుడి ఫోటోను ప్రింట్ చేయించాడు. అంతేకాదు పవన్ ఫోటో ఎదుటే భార్యమెడలో తాళికడతానని భీష్మించుకొని కూర్చున్నాడు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పైగా జనసేన పార్టీలో కీలక కార్యకర్త. ఇటీవల ఎచ్చెర్ల మండలం నుండి స్ధానిక జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పోటీ చేశాడు. పవన్ అంటే అభిమానంతో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. ఐతే ఇటీవలే శ్రీనివాస్ కు పెళ్లి కుదిరింది. ఈనెల 18న పెళ్లి జరగబోతోంది. పెళ్లి విషయంలో శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా పెళ్లి కార్డులపై తమకు ఇష్టమైన దేవతా మూర్తుల బొమ్మలను ప్రింట్ చేయించుకుంటారు. కానీ శ్రీనివాస్ మాత్రం పవన్ కళ్యాణ్ దేవుడితో సమానమని భావించి ఆయన ఫోటోనే శుభలేఖలపై ప్రింట్ చేయించాడు. ఈ కుటుంబం ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018లో జరిగిన తన సోదరుడు అప్పలనాయుడు పెళ్లి సమయంలోనూ శుభలేఖలపై పవన్ ఫొటోను ముద్రించామని శ్రీనివాస్ చెప్పాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు, అన్నావదినలు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులే.
ఇక పెళ్లింతా పవర్ స్టార్ ఫోటోలతో నింపేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. వాటర్ బాటిల్స్, ఫ్లెక్సీలపై కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించారు. అంతేకాదు కుదిరితే తన కాబోయే భార్యకు తాళి కట్టబోయే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోను పక్కనే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు శ్రీనివాస్ చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు జనసేన పార్టీ సీనియర్ నేతలుగా, పవన్ కళ్యాణ్ కు అత్యంత దగ్గరగా ఉండే నేతలు, పీఏసీ సభ్యులైన బొలిశెట్టి సత్య, శివశంకర్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా శుభలేఖ అందజేసి ఆహ్వానించినట్లు తెలిపాడు. పెళ్లికి రాలేకపోయినా.. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇద్దర్నీ ఆశీర్వదిస్తానని పవన్ చెప్పినట్లు శ్రీనివాస్ తెలిపాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.