హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Real Hero: కరోనా భయపెడుతున్న సమయంలో మానవత్వం చాటుకున్న వీఆర్వో

Real Hero: కరోనా భయపెడుతున్న సమయంలో మానవత్వం చాటుకున్న వీఆర్వో

మానవత్వం చూపించిన రియల్ హీరో వీఆర్వో

మానవత్వం చూపించిన రియల్ హీరో వీఆర్వో

రోజు రోజుకూ మానవత్వం కనుమరుగైపోతున్న రోజుల్లో అక్కడక్కడా రియల్ హీరోస్ పుట్టుకొస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ వీఆర్వో కరోన పూర్తిగా భయపెడుతున్న సమయంలో మానత్వంతో ముందుకొచ్చి అంత్యక్రియలు చేశారు. శభాష్ అనిపించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ ఊహించని స్థాయిలో.. రెట్టింపు వేగంతో సెకెండ్ వేవ్ లో వైరస్ దూసుకొస్తోంది. దీంతో కేసులు డబుల్ అవుతున్నాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో దేశంలో రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో సైతం ఒకే రోజు 5 వేల మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇలాంటి సమయంలో మనిషికి మనిషి సాయం చేయడమే కష్టంగా మారింది. ముఖ్యంగా అత్యంత దగ్గర బంధువైనా.. కరోనా భయంతో వారికి చిన్న జ్వరం వస్తే చూడడానికి వెళ్లాలి అంటే భయపడే రోజులు.. ఇక ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే కరోనా భయంతో అటువైపు వెళ్లేందుకే చాలామంది ముఖం చాటేస్తున్నారు.

ఇప్పటికే చాలాచోట్ల ఇలాంటి వార్తలు వింటున్నాం. చూస్తున్నాం. కరోనా భయంతో ఎవరైనా రోగి చనిపోతే.. అతడి అంత్యక్రియలకు నలుగురు దొరకడమే కష్టంగా మారింది. కానీ ఓ వీర్వో మాత్రం ఈ విషయంలో మానవత్వం చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం సైలాడ గ్రామానికి చెందిన 67 ఏళ్ల అట్టాడ వైకుంఠరావు వారం రోజులుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

గత కొన్ని రోజులుగా వైద్యం అందిస్తున్నా.. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులు ఎత్తేశారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తి కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వైకుంఠరావు మృతి చెందారు.

మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైకుంఠ రావు మృతి చెందడంతో బంధువులు కూడా అటువైపు రావడానికి ఇష్ట పడలేదు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ మృతదేహాన్ని రోడ్గుపైనే ఉంచాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్వో పేరాడ యుగంధర్‌ మృతుడి కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అవగాహన కల్పించారు. కరోనా రక్షణ చర్యలు చేపట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్రలను సమకూర్చి స్వయంగా తాను కూడా శ్మశానం వద్దకు వెళ్లారు. వీఆర్వో యుగంధర్‌ చూపిన చొరవను పలువురు ప్రశంసించారు.

వీఆర్వో యుగంధర్ చేసిన పనికి అందరూ  ప్రశింసుస్తున్నారు. కరోనా భయపెడుతున్న సమయంలో ముందుకు వచ్చి అంత్యక్రియలు చేయడం గ్రేట్ అంటున్నారు. నిర్లక్ష్యం చూపించకుండా కరోనా ఆంక్షలు పాటిస్తూనే.. గ్రామస్థులకు కూడా అవగాహన కల్పించడం నిజంగా గ్రేట్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు శ్రీకాకుళం వాసులు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Corona, Corona cases, Corona Possitive, HUMAN STORY, Srikakulam

ఉత్తమ కథలు