గ్రేడ్ వన్ ఆపీసర్.. కానీ అతనో కోటీశ్వరుడు.. అయితే అవన్నీ ముందునుంచి.. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా కావు. మరి అన్ని కోట్లకు ఎలా పడగెత్తాడు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌కి ఇంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తోంది. అంటూ ఏసీబీ అధికారులే షాక్ తింటున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
ఒకటి రెండు కోట్లంటేనే అమ్మో అనాల్సిన పరిస్థితి కానీ ఒక విలేజ్ డవలప్ మెంట్ అధికారి ఆదాయం మాత్రం ఏకంగా యాభైకోట్లపైనే అని తేలడంతో అంతా నోరెళ్లబెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లోఊహించని స్థాయిలో ఆదాయన్ని గుర్తించారు. అతడి ఆదాయం గురించి తెలిసి చుట్టు పక్కలవాళ్లే నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.
ఈ సోదాల్లో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ళ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్న పత్రాలు లభ్యమయ్యాయి. విజయనగరం జిల్లాలో భారీగా భూములు కూడబెట్టినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. బ్యాంక్ లాకర్లు ఉన్నాయేమోనని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఆయన ఇంటి తోపాటు సమీప బంధువుల ఇళ్లలోనూ తనీఖీలు చేయగా భారీగా బంగారం, నగదు తోపాటు ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లు బయటపడ్డాయి. అయితే అందులో చాలావారకు ఇటీవల సంపాదించినవే అని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో మొత్తం 35 లక్షల 67వేల 100 రూపాయల నగదు, 17 లక్షల 65 వేల 373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. వాటిపై సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల తనిఖీల్లో దొరికిన అతడి స్థిరచరాస్తులను లెక్కిస్తే మార్కెట్ రేటు ప్రకారం.. యాభైకోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా లెక్కలోని ఆస్తులు ఎన్ని ఉంటాయో అని అంతా షాక్ కు గురవుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అయితే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు అతనిపై నిఘా ఉంచారు.. ఈ క్రమంలో పక్కా సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేసి వారంతా షాక్ గురయ్యారు. పంచాయతీ డవలప్ మెంట్ ఆఫీసరు ఆదాయం అంత ఎలా వచ్చిందో తెలియకగా వామ్మో అనుకుంటున్నారు. దాడులు నిర్వహించి అక్రమ సంపాదనను పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Andhra Pradesh, AP News, Srikakulam, Visakhapatnam, Vizianagaram, Vizianagaram S01p03