హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wonder Kid: పిట్ట కొంచెం.. కూత చాలా ఘనం.. రికార్డులు క్రియేట్ చేస్తున్న చిచ్చర పిడుగు..

Wonder Kid: పిట్ట కొంచెం.. కూత చాలా ఘనం.. రికార్డులు క్రియేట్ చేస్తున్న చిచ్చర పిడుగు..

రికార్డులు

రికార్డులు క్రియేట్ చేస్తున్న చిన్నారి

Wonder Kid: ఈ పిల్ల చిన్నారి కాదు.. చిచ్చర పిడుగు.. వయసు చిన్నదే కానీ తెలివి అపారం. ఆమె మేథస్సు చేక్ చేద్దామనుకున్నవారందరికీ ఆమె షాక్ ఇస్తోంది. ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆమె టాలెంట్ ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...

  Neelima Eaty, News18 Visakhapatnam

  Wonder Kid:  టీవీలో కార్టూన్లు చూస్తూ.. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన  వయస్సు లో గిన్సిస్ బుక్  (Guinness Book) ఎక్కెడానికి ప్రయత్నిస్తోంది ఈ చిన్నారి. ఇంత చిన్న వయసులోనే చిచ్చర పిడుగులా అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడేస్తోంది. ఆమె మాటలు విన్న ఎవరైనా  నోరెళ్లబెట్టడం ఖాయం.  ఈ చిన్నారి పేరు దత్తు శ్రీ నందన (Dattu Sri Nandana). విశాఖపట్నం (Visakhapatnam) లోని పెందుర్తి (Penudurti) కి సమీపంలో ఉన్న సుజాతా నగర్ లో నివాసం ఉంటున్న దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ. నాలుగేళ్లకే అంటే దాదాపు స్కూల్ బుక్ కూడా చూడని వయసు.. ఈ వయసులో 200 దేశాలు వాటి రాజధానులు (Capital of Countries) రెండున్నర నిమషాల్లో చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,  ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సంపాదించుకుంది. ఇదే కాకుండా స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ (Gold Medal in Skating) సంపాదించుకుంది.

  తల్లిదండ్రులే గురువులు

  ఈ కాలంలో పిల్లలు వీడియోగేమ్స్ కు, మొబైల్ ఫోన్ లకు ఎట్రాక్ట్ అవుతుంటారు. తమ బిడ్డ అలా కాకూడదని శ్రీనందనను చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్‌ వంటి వాటికి దూరంగా ఉంచారు ఆమె తల్లిదండ్రులు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలు వివరించే ప్రయత్నం చేశారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. 

  ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే దేశాలు– రాజధానులు స్పీడ్ గా చెప్పి.. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 

  ఇదీ చదవండి : అధిష్టానం చెప్పినా తీరు మారలేదా..? ఆ ఇద్దరి నేతల మధ్య దూరం పెరుగుతోందా..?

  గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నం

  ప్రస్తుతం శ్రీ నందన వయసు ఏడేళ్లు. గ్లోబ్ మైండ్ మ్యాపింగ్ తో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. నందన తన మైండ్ లో గ్లోబ్ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచం లో మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను వెంటనే చెబుతుంది. ఇది మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తండ్రి అంటున్నారు.

  ఇదీ చదవండి : ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. రైతులకు యంత్రాలతో చేయూత.. పొందాడానికి ఏం చేయాలంటే?

  పిల్లలను మొబైల్ , వీడియో గేమ్స్ కు దూరంగా ఉంచితే అద్భుతాలు సృష్టిస్తారు

  ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక శక్తి దాగి ఉంటుందని దత్తు ప్రకాష్ అంటున్నారు. మనమే పిల్లలని ఫోన్లు కి టీవీ లాకి దూరంగా ఉంచగలిగితే.. వారిని అద్భుతంగా తయారు చేయోచ్చంటున్నారు. వారిలో ఉన్న ప్రతిభను తల్లితండ్రులు గ్రహించి, ఆ టాలెంట్ ని బయటకి తెచ్చే ప్రయత్నం చేయాలి అంటున్నారు. ఇంతటి ఘనత శ్రీ నందన పొందింది అంటే ముఖ్య కారణం తల్లితండ్రులు. తల్లితండ్రిలే ఆమె గురువులు. చిన్నపుడు నుండి దగ్గర ఉండి ఆమె ప్రతిభని గుర్తించి... వాటిని వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించేవారు. ఆమె విజయానికి సహాయం అందించారు.

  ఇదీ చదవండి : ఏపీలో మొన్నటి వరకు పరిశ్రమలకు పవర్ హాలిడే.. ఇప్పుడు క్రాప్ హాలిడే..? ఎక్కడో తెలుసా..?

  ప్రశంసలు                                                                                                  ఇటీవల పిక్‌ ఏ బుక్‌ వేదికపై జరిగిన ఈవెంట్‌లో న్యాయ నిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్‌ చేసి.. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, స్థానిక నాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్‌ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakha, Vizag

  ఉత్తమ కథలు