హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Botsa Family Politics: బొత్స కుటుంబంలో రాజకీయ చిచ్చు..? అక్కడే చెడిందా..?

Botsa Family Politics: బొత్స కుటుంబంలో రాజకీయ చిచ్చు..? అక్కడే చెడిందా..?

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

విజయనగరం జిల్లా (Vizianagaram) వైఎస్ఆర్సీపీ (YSRCP) రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా..? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా..? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా..? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు చినికి చినికి గాలివానగా మారుతోందా..?

ఇంకా చదవండి ...

P. Bhanu Prasad, Vizianagaram, News18

విజయనగరం జిల్లా (Vizianagaram) వైఎస్ఆర్సీపీ (YSRCP) రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా..? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా..? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా..? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు చినికి చినికి గాలివానగా మారుతోందా..? ఇన్నాళ్లు జీవించేలా లోని అధికార పార్టీ కి, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు..? ఏం జరుగుతోంది..? విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రం లేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన ఉన్న పార్టీలో ఆయన ఎంత చెబితే అంతే.. అంతే జరుగుతుంది. ఓ దశలో సీఎం పదవి రేసులో కూడా నిలిచారు. అలాంటి బొత్స వైసీపీ అధికారంలోకి రావడంతోనే జిల్లా నుంచి ఏకైక మంత్రిగా.. మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. పార్టీలో, ప్రభుత్వంలో బొత్స హవా సంగతి ఎలా ఉన్నా.. సొంత జిల్లాలో ఆయన మేనల్లుడి ప్రభ మాత్రం వెలిగిపోతోంది.

విజయనగరం వైసీపీ రాజకీయాలు ఈ మధ్య ఆసక్తిగా కనిపిస్తున్నాయి. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను( మజ్జి శ్రీనివాసరావు) జడ్పీ చైర్మన్ అయ్యారు. చిన్న శీను.. బొత్సకు రైట్ హ్యాండ్ అని అంటుంటారు. బొత్స రాష్ట్ర స్థాయి రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే రోజుల్లో జిల్లాలో చిన్న శ్రీనుదే హవా. గ్రౌండ్ లెవల్లో అన్నీ శీను కనుసన్నల్లోనే జరిగేవి. జిల్లాలో ఏదైనా పని కోసం ఎవరైనా వచ్చినా వాళ్లను చిన్న శ్రీనును కలవమని చెప్పేవారట బొత్స. ఒకరకంగా చెప్పాలంటే బొత్స అంటే చిన్న శ్రీను.., చిన్న శ్రీను అంటే బొత్స అన్న మాట. అలాంటి చిన్న శ్రీను.. మొట్టమొదటి సారిగా, ప్రజాప్రతినిధిగా, జెడ్పీ చైర్మన్ పదవి చేపట్టాక.. బొత్సకు దూరం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు సహా చిన్నా చితకా నేతలు చిన్న శ్రీనును ఫాలో అవుతున్నారట.

ఇది చదవండి: చంద్రబాబు స్వయంకృతమా..? పెద్దిరెడ్డి రాజకీయమా..? కుప్పంపై ఎవరిలెక్కలు వారివి..!అంతేకాదు.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి బొత్సతో అస్సలు పొసగదు. వారిద్దరు కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి విబేధాలు ఉన్నాయి. అవి వైసీపీలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి వీరభద్రస్వామి ఇప్పుడు చిన్న శ్రీనుకు దగ్గర అయ్యారు. వాళ్లిదరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. విజయనగరం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ వీరభద్రస్వామి, చిన్న శ్రీను వర్గీయులకే దక్కాయి.  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎంపిక అయ్యారు. ఆయన కూడా చిన్న శ్రీను ఫాలోయరేనట. ఇది దేనికి సంకేతమో ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...


ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స వర్సెస్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నట్టుగా పరిస్థితి ప్రస్తుతం ఉంది. దీనికంతటికీ కారణం బొత్స ఫ్యామిలీలో జరుగుతున్న రాజకీయాలే కారణం అట. బొత్సకు వరసకు మేనల్లుడు అయ్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బొత్స సొంత తమ్ముడు బొత్స లక్ష్మణరావు.. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గం నడుపుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పూసపాటిరేగలో ఈ ఇద్దరి మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగింది. లక్ష్మణరావు తనను ఇబ్బంది పెడుతున్నారని బడ్డుకొండ అప్పల నాయుడు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

ఇది చదవండి: కీలక నేతకు మరోసారి హ్యాండిచ్చిన జగన్.. ఆ మహిళా ఎమ్మెల్యేనే కారణమా..?వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి తాను పోటీ చేయడం గానీ, తన కొడుకును గానీ పోటీలో ఉంచాలని బొత్స లక్ష్మణరావు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే అప్పలనాయుడికి వ్యతిరేకంగా శిబిరం నడుతుపున్నారట. లక్ష్మణరావును అదుపు చేయాలని అప్పలనాయుడు అప్పట్లో బొత్సాను కోరారు కూడా. బొత్సా చెప్పారో లేక తనంతటతానే తగ్గారో కానీ ఆ తర్వాత లక్ష్మణరావు కొద్దిగా స్పీడ్ తగ్గించారు.

ఇది చదవండి: ‘కనీసం టీవీలో చూసైనా మారండి..’ చంద్రబాబుకు జగన్ హితవు..


ఇక బొత్స తమ్ముడి లక్ష్మణరావుతో ఇబ్బందిపడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకి చిన్న శ్రీను బావ అవుతారు. బొత్స తమ్ముడి చేతిలో ఇబ్బందిపడ్డ బావ కోసం చిన్న శ్రీను వేరు కుంపటి పెట్టారో లేక.., జెడ్పీ చైర్మన్‌గా తనకంటూ ఓ వర్గం ఉండాలని అనుకుంటున్నారో కానీ.., మొత్తానికి ఆయన జిల్లా రాజకీయాల్లో సెపరేట్‌గా మారిపోయారు.

ఇది చదవండి: 'సింహంతో వేట.. జగన్ తో ఆట ఈజీ కాదు..' చంద్రబాబు, లోకేష్ పై రోజా పంచ్ ల వర్షం.. అచ్చెన్నకు మూడు ఆప్షన్లు...!


అంతేకాదు.. ఎప్పుడూ బొత్స వెనక కనిపించే చిన్న శ్రీను ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. పైడితల్లి అమ్మవారి జాతరకు బొత్స వచ్చినప్పుడు పక్కన చిన్న శ్రీను ఉండేవారు. మొన్న మాత్రం ఇద్దరూ విడివిడిగా వచ్చారు. ఇలా చిన్న శ్రీను, బొత్స కుటుంబానికి మధ్య ఏదో జరుగుతోందని, గ్యాప్ పెరిగిందన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో విజయనగరం వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో ఏం జరుగబోతుందో అనే చర్చ ఇప్పటినుంచే జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, Botsa satyanarayana, Vizianagaram

ఉత్తమ కథలు