YS Jagan: సీఎం జగన్ వైజాగ్ టూర్ రద్దుకు కారణం ఇదేనా...? రాజకీయకోణం ఉందా..?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటనలు, కార్యక్రమాలు కనీసం వారం రోజుల ముందే ఖరారవుతాయి.అత్యంత అరుదుగా మాత్రమే చివరి నిముషంలో రద్దవుతుంటాయి.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పర్యటనలు, కార్యక్రమాలు కనీసం వారం రోజుల ముందే ఖరారవుతాయి.అత్యంత అరుదుగా మాత్రమే తక్కువ సమయంలో షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల రద్దవుతుంటాయి. సీఎం విశాఖపట్నం (Visakhapatnam) పర్యటన కూడా ఇలాంటిదే. ఐతే ఉన్నట్లుండి వైజాగ్ పర్యటనను రద్దు చేయడమే కాస్త చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కారణాలే ఇందులో ప్రధానంగా ఉన్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు వైజాగ్ టూర్ రద్దు వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా కాస్తంత ఇబ్బంది కలిగిస్తున్నారని భావించే సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చివరి నిమిషం వరకూ విశాఖలో సీఎం పర్యటన ఉంటుందని భావించిన యంత్రాంగానికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అలాగే కార్యకర్తలకు కూడా బాగా నిరుత్సాహం కలిగించే అంశమే.

  విశాఖలో ఆయనదే హవా..!
  ప్రధానంగా విశాఖలో విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఉందన్నది సీఎం పేషీలో గుసగుస. అందుకే ఆయన ప్రాతినిధ్యాన్ని ఇక్కడ తగ్గించేయాలని పూర్తి స్థాయిలో భావిస్తోందట. విశాఖలో విజయసాయిరెడ్డి ఫాలోవర్స్ ఎక్కువ కావడం.. రోజురోజుకీ వారి సంఖ్య పెరుగుతుండటం వైసీపీ అధిష్టానానికి అంతగా రుచించడం లేదని టాక్. అలాగే ఉత్తరాంధ్ర సీఎం అంటూ ఆయన్ని మోసేయడం కూడా విజయసాయిని ఇబ్బందులకు గురి చేసిన అంశం. మూడ్నెలల ముందు వరకూ ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేవు..., కానీ జూలై తర్వాత నుంచీ విజయసాయిరెడ్డి విశాఖ టూర్లపై సీఎం పేషీ గమనిస్తూ వస్తోందని వైసీపీ వర్గాల మాట. అలాగే విజయసాయిరెడ్డిని కలుస్తున్నవారిపైనా ఒక కన్నేసి ఉంచారని చెప్పుకుంటున్నారు.

  ఇది చదవండి: జగన్ ను వదలని రఘురామ... సుప్రీం కోర్టులో మరో పిటిషన్...  వైజాగ్ షెడ్యూల్ ఇదీ..
  నిన్నటి సీఎంఓ కార్యాలయం ప్రకటన ప్రకారం సీఎం జగన్ విశాఖ చేరుకుని ఎన్‌ఏడీ జంక్షన్‌ లో ఫ్లై ఓవర్‌ తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభించాలి. అలాగే పార్క్ తో పాటు జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్‌ ప్రాజెక్టుల ప్రారంభం.. ఎంజీఎం పార్క్‌ లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఐతే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే సీఎం వైజాగ్ టూర్ రద్దైందని కొందరు అంటుంటే.. సీఎంఓ నిర్ణయానికి విజయసాయి రెడ్డి తాజా పర్యటనేనని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. వైసీపీలో నెంబర్ టూ పర్యటన నెంబర్ వన్ పర్యటన రద్దయ్యేలా చేసిందని జోరుగా చర్చ నడుస్తోంది.

  ఇది చదవండి: బాబు దీక్షపై తెలుగు తమ్ముళ్ల రియాక్షన్ ఇదేనా...? సైకిల్ పార్టీ గాడిలో పడినట్లేనా..?  వైసీపీలో ఆఛాన్సే లేదు..!
  వైసీపీలో నెంబర్లు అనే మాటకు తావులేదన్నది ఆ పార్టీ నేతల మాట. వైసీపీలో ఒక్కరే నెంబర్ వన్.. అదీ సీఎం వైఎస్ జగనే.. "నెంబర్ వన్" కి కొంచెం పోటీ అనిపించినా.. నెంబర్-2 అని ఎవరనా ప్రచారం చేసుకున్నా ఇబ్బందులు తప్పవని అంటున్నాయి అధికార వైసీపీ వర్గాలు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో నెంబర్-2 అని.. ఉత్తరాంధ్ర సీఎం అనిపించుకుంటున్న విజయసాయిరెడ్డికి ఇబ్బందులు రావడం సహజమే కదా అని వైసీపీ కేడర్ అంటోంది.
  Published by:Purna Chandra
  First published: