హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: గంటాను చంద్రబాబే పక్కనబెట్టారా..? అసలు కారణం ఇదేనా..? తెరవెనుక ఇంత జరిగిందా..?

TDP: గంటాను చంద్రబాబే పక్కనబెట్టారా..? అసలు కారణం ఇదేనా..? తెరవెనుక ఇంత జరిగిందా..?

గంటా శ్రీనివాస్ (ఫైల్)

గంటా శ్రీనివాస్ (ఫైల్)

2019 అసెంబ్లీ ఎన్నికల్లో (2019 AP Assembly Elections) తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఘోరపరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి కీలక నేతలు దూరమయ్యారు. కొందరు పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతుండగా.. మరికొందరు సైకిల్ పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇంకా చదవండి ...

P.Anand Mohan, Visakhapatnam, News18

2019 అసెంబ్లీ ఎన్నికల్లో (2019 AP Assembly Elections) తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఘోరపరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి కీలక నేతలు దూరమయ్యారు. కొందరు పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతుండగా.. మరికొందరు సైకిల్ పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరిలో ముందువరసలో ఉన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao). వైఎస్ఆర్సీపీ (YSRCP) వేవ్ లోనూ విజయం సాధించిన ఆయన.. ఫలితాల తర్వాత పార్టీపై అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనికి అసలు కారణం వేరే ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు (Nara Chandra Babu Naidu) గంటాను పక్కనబెట్టారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గంటాను బాబుగారే దూరం పెట్టమని కేడర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అసలు గంటాను ఎందుకని ఆయన దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి రావడానికి కారణం ఆయన స్వయంకృతమేనా..? అసలు ఆ ముఖ్యనేతకు.. ఈ విశాఖ నేతకు ఎక్కడ తేడా వచ్చింది.

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా ? లేనట్లా ? అస‌లు ఎవరికీ అర్థం కావ‌డం లేదు. ఆయ‌న పేరుకు మాత్రమే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారే పార్టీని గానీ.. పార్టీ కార్యక్రమాలను గానీ పట్టించుకోవడం లేదు. విశాఖ నార్త్ లో గంటా చ‌చ్చీ చెడీ మ‌రి ఎమ్మెల్యే గా స్వల్ప మెజార్టీతో గెలిచారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఆయ‌న పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: ఒడిశా వెళ్లనున్న సీఎం జగన్.. అజెండా ఇదే..!


అక్కరకు రాని చుట్టమంటూ.. గతంలో ఓ నానుడి ఉండేది. ఇప్పుడు ఇదే గంటా విషయంలోనూ జరుగుతోంది. గంటా కు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ప్రయార్టీ ఇచ్చినా కూడా ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఆయ‌న ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. దీంతో గంటా శ్రీనివాసరావును ఇప్పుడు చంద్రబాబు దూరం పెట్టార‌నే తెలుస్తోంది. గంటా లెక్కలేనిత‌నం బాబుకు ఏ మాత్రం నచ్చడంలేద‌ట‌. ఇక గంటా ఎమ్మెల్యేగా గెలిచినా ఆయ‌న త‌న మేనల్లుడిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పెట్టుకున్నారు.

ఇది చదవండి: టీటీడీ కొత్త నిర్ణయం వర్కవుట్ అవుతుందా..? ఉద్యోగుల రియాక్షన్ ఏంటి..?


పార్టీ మారతారా..?

మరోవైపు ష‌రామామూలుగానే ఆయన పార్టీ మార‌తార‌న్న ప్రచారమూ జ‌రుగుతోంది. దీంతో దీనిని గంటా ఖండించ‌రు. ఆయ‌న పై వ‌స్తోన్న సందేహాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా చేస్తూ ఉంటారు. దీంతో ఆయన టీడీపీలో ఉంటారా ? లేదా ? అన్న దానిపై పార్టీ నేత‌ల‌కు అనేకానేక సందేహాలు వ‌స్తూ ఉంటాయి. ఇటీవ‌ల పార్టీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు చేసిన దాడిని కూడా గంటా ఖండించ లేదు. చంద్రబాబు దీక్ష చేస్తే ఎమ్మెల్యేగా ఉండి కూడా గంటా పార్టీ కార్యాల‌యానికి రాలేదు.

ఇది చదవండి: “Sorry మోసం చేయలేదు..” రాజమండ్రిలో పోస్టర్ల వెనుక మిస్టరీ ఇదేనా..?


గంటా అలకకు కారణం ఇదేనా..?

గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ఆశించారు. ఐతే ఆ పదవిని పయ్యావుల కేశవ్ కు ఇవ్వడంతో గంటా అలకబూనారట. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక బాబు గంటాను ఏ మాత్రం ప‌ట్టించు కోకుండా ఆయ‌న్ను పక్కన పెట్టేస్తార‌ని అంటున్నారు. ఇదే జరిగితే గంటా ఎవరికీ పట్టని నేతగా కూడా మారిపోతారు. ఇప్పటికే జనసేనాని వైపు ఆశగా చూస్తున్న గంటాకి ఇలాంటి పరిణామాలు ఇబ్బందే కలిస్తాయి.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Ganta srinivasa rao, TDP

ఉత్తమ కథలు