M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18
పార్టీ అధికారంలోకి రాక ముందు అన్ని వ్యవహారాలూ తానై చూసుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర, ఎన్నికల సమయంలో కీలక నేతలను ఆకర్షించడం, ప్రశాంత్ కిషోర్ ని జగన్ కు పరిచయం చేయించడంలోనూ ఆయనే కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకొని నడిపిస్తున్నారు. ఆయనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. 2019 ఎన్నికల్లో పార్టీ ఉహించని విజయం సాధించిన తరువాత కూడా కొన్ని రోజులు ఇటు పార్టీలోను అటు ప్రభుత్వంలోనూ ఆయన ఏం చెబితే అదే అన్నట్లు కొనసాగింది. అయితే సడెన్ గా ఏం జరిగిందో తెలేదు కానీ.. ప్రస్తుతం ఆయన మాట ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ చెల్లుబాటుకావడం లేదనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. విశాఖలో ఈ నేత చేసిన ఓవర్ యాక్షన్ వలనే జగన్ మోహాన్ రెడ్డి నెమ్మదిగా పక్కన పెట్టేశారనే వార్తలు వైసీపీలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డి విశాఖలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచే తన అనుచరలకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు నుంచి బదిలీలు వరకు కార్యకలాపాలు సాగించారు. విశాఖలో ఏ పని జరగాలన్న సాయిరెడ్డి అనుమతి లేనిదే జరిగే పరిస్థితి లేదు అనే టాక్ వినిపించే స్థాయికి వెళ్లిపోయింది ఆయన ప్రబల్యం. దీంతో పార్టీ కొంత మంది నేతలు ఇదే అంశాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన అనుచరులతో ఉత్తరాంద్రలో ఉత్తరాంధ్ర సీఏం గా ప్రచారం చేసుకుంటున్నారని కొంత మంది సాయిరెడ్డి వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రికి పిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
మొన్నటికి మొన్న సాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు కూడా విశాఖ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడంతోపాటు సిటీ వ్యాప్తంగా సాయిరెడ్డికి శుబాకాంక్షలు చెబుతున్న హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. తరువాత అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఒక గంటలోనే అన్ని హోర్డింగ్స్ బ్యానర్స్ ను తొలిగించారు. పార్టీ నేతల పిర్యాదు మేరకే జగన్ ఈ హోర్డింగ్ లు తొలిగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విశాఖలో తనకంటు ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు తన అనుచరలు సాయిరెడ్డి పేరు చెప్పి చేస్తోన్న ఆగడాలు కూడా జగన్ దృష్టిలో పడినట్లు సమచారం. ఇందులో భాగంగానే సాయిరెడ్డికి కాస్త ప్రాదాన్యత తగ్గించారనే టాక్ వినిపిస్తోంది.
విశాఖ లోనే కాదు ప్రభుత్వంలో కూడా సాయిరెడ్డి చెప్పన పనులు తన దృష్టిలో పెట్టకుండ చేయోద్దని స్వయంగా ముఖ్యమంత్రే అదికారులకు ఆఫ్ ద రికార్డ్ లో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీ లోను ప్రభుత్వంలోను కీలకంగా ఉన్న సాయిరెడ్డి హవా ఇప్పుడు కాస్త తగ్గిందనే అంటున్నారు ఆయన సన్నిహితలు కూడా. ఈ మొత్తం వ్యవహారంతో జగన్ కు సాయిరెడ్డికి చెడిందని పార్టీలో నేతలనే చెవులు కొరుక్కుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.