YSRCP: సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. విజయసాయిరెడ్డి ఆ పదవికి కత్తెర.. ఆ నేతకు పదవి?

ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress)లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపైనే (AP Cabinet Changes)చర్చ జరుగుతోంది. మంత్రివర్గంతో పాటు పార్టీ ఇన్ ఛార్జుల వ్యవగారం కూడా హాట్ టాపిక్ గా మారింది.

 • Share this:
  M.BalaKrishna, Hyderabad, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress)లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపైనే (AP Cabinet Changes)చర్చ జరుగుతోంది. మంత్రివర్గంతో పాటు పార్టీ ఇన్ ఛార్జుల వ్యవగారం కూడా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వ్యవహారమంతా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) చుట్టూనే తిరుగుతోంది. ఆయన విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తీసుకొనే నిర్ణయాలు సంచలనమే. ప్రభుత్వ పథకాల నుంచి పార్టీ వ్యవహారాల్లో సైతం ఆయన తీసుకొనే నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రివర్గ కూర్పుతో పాటు పార్టీలో సామూల మార్పులపై ఫోకస్ పెట్టారట సీఎం జగన్. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ విజయసాయి రెడ్డిపైనే ప్రధమంగా చర్చ సాగుతోందట.

  వేటు ఖాయమా..?
  విజయసాయిని ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా తప్పించి ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆయన పేరు మాత్రమే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం (Visakhapatnam) ను ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించింది. దీంతో విశాఖకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో హావాఅంతా విజయసాయి రెడ్డిదే సాగుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో విజయసాయి రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు పార్టీలోని ఓ కీలక నేత వెల్లడించారు.

  ఇది చదవండి: కేబినెట్ బెర్త్ కోసం ఊపందుకున్న లాబీయింగ్.. జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..!


  ఉత్తరాంధ్ర నేతల ఫిర్యాదు..?
  ఉత్తరాంధ్రలో ఉన్న కీలక సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలు విజయసాయి రెడ్డిపై కోపమతో రగిలిపోతున్నారట. ఇటీవలే వీరంతా ఓ సమావేశం పెట్టుకొని విజయసాయిపై అక్కసు వెళ్లగక్కారట. పనిలోపనిగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సమయానుగుణంగా విజయసాయిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారా నేతలు. ముఖ్యంగా భూముల విషయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తన పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని చెప్పే పరిస్థితి విజయసాయిరెడ్డికి వచ్చింది.

  ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్


  దూకుడు తగ్గించిన సాయిరెడ్డి
  ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి ప్రస్తుతానికి తన దూకుడు తగ్గించాడు. కొద్ది రోజుల మీడియాతో మాట్లాడిన ఆయ‌న త‌నకు విశాఖ‌లో సొంత ఇల్లు కూడా లేదని.. హైదరాబాద్ లోనూ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు వివరణ ఇచ్చారు. అవినీతికి అమ‌డ‌దూరంలో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. తెర‌వెన‌క జ‌రుగుతున్న ప‌రిణామాలు పసిగట్టిన విజ‌య‌సాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

  ఇది చదవండి: గబ్బిలాలను పూజిస్తే దోషాలు పోతాయా..? ఏపీలో ఓ గ్రామంలో వింత ఆచారం..  రెండో స్థానంలో సజ్జల..
  పార్టీలో జగన్ అనంతరం విజయసాయిరెడ్డికె మాత్రమే రెండవ స్థానం ఉండేది. ఇప్పుడు పార్టీ ప‌రంగా స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విజ‌య‌సాయిరెడ్డి ఏదైనా కీల‌క స‌మావేశం ఉంటే త‌ప్ప తాడేప‌ల్లి వైపు వెళ్లే పరిస్థితులు ఉండటం లేదు. దీంతో పాటు దేశంలోని దిగ్గ‌జ సంస్థ‌కు చెందిన ప్ర‌త్యేక విమానాలు నిత్యం ఉప‌యోగించ‌టం, ఇవ‌న్నీ జ‌గ‌న్ కూడా దృష్టికి పోవ‌టంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని స‌మాచారం. దీంతో పాటు ఢిల్లీలో తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు మ‌రింత కీల‌కంగా మారిన‌ట్లు ఆ పార్టీ నేత ఒక‌రు తెలిపారు. త్వరలో మంత్రివర్గంలో మార్పులతో పాటు పార్టీ పరంగానూ ముఖ్యమైన మార్పులు చేయబోతున్న జగన్.. విజయసాయి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన్ను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీకే పరిమితం చేస్తారని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే తాడేపల్లి నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే..!
  Published by:Purna Chandra
  First published: